Tuesday, September 22, 2020

ఈ చిత్రకారులెవ్వరు? ये कौन चित्रकार है ये कौन चित्रकार

ఈ చిత్రకారులెవ్వరు? ये कौन चित्रकार है ये कौन चित्रकार

ఈ చిత్రకారులెవ్వరు? ఈ చిత్రకారులెవ్వరు

పచ్చపచ్చని వసుధపై నీలి నీలి ఆకాశం

అందులో మేఘాల పల్లకి ని గాలులు మోస్తున్నాయి

రంగులమయం,మెరుపులమయం, ఉల్లాసమయమైన దిక్కులు చూడు


ఈ చిత్రకారులెవ్వరు? ఈ చిత్రకారులెవ్వరు? 

పర్వతాశిఖరాలు తపస్సులోమునిగిన యోగులలాఉన్నాయి

లోయమార్గాలు మెలికలు తిరుగుతూ సాగే సర్పాలలాఉన్నాయి

దేవదారు వృక్షాలు ధ్వజస్థంభాలలా నిలిచిఉన్నాయి

గులాబీల తివాచీలు , వసంతకాల వనాలు

ఇవి ఏ కవి అద్భుత కల్పనలో!


ఈ చిత్రకారులెవ్వరు? ఈ చిత్రకారులెవ్వరు? 

ప్రాకృతమైన ఈ పవిత్రతను ఆరాధించు

ఈ గుణాలను నీ మనసులో నింపుకో

నీనుదిటిపై లాలిమ ను మెరవనివ్వు

ప్రకృతినిన్ను అణువణువునా నిన్ను చూస్తూనే ఉంటుంది

నీకున్నవి రెండుకళ్ళైతే  ప్రకృతికి వేల కళ్ళున్నవి