Dil ka bha.Nwar kare pukaar
దిల్ క భవర్ కరే పుకార్
తెరే ఘర్ కె సామ్నె (1963)
హస్రత్ జైపురి ఎస్. డి. బర్మన్, మహమ్మద్ రఫీ ల కలయిక వీనులవిందు చేస్తే దేవానంద్, నూతన్ లు నేత్రపర్వం చేసారు. కాలంతో నిమిత్తం లేకుండా విన్నప్పుడూ,చూసినప్పుడూ కొత్తలోకాలకు తీసుకెళ్ళే పాట.
పాటకు నేపధ్యం లో కనపడేది కుతుబ్ మినార్ లోపల ఉన్న మెట్లు. మినార్ పైభాగంనుంది ప్రేమికులు కిందకు వస్తున్నారు. ఇరుకైన మార్గం, అందులో ప్రేమికుడు ఆమెతో మనసు మాట తెలియజేస్తున్నాడు. వివిధరకాల పర్యాటకులు అతని మాటకు అడ్డువస్తున్నారు. కిందకు దిగేసమయానికి అతనామెకు చెప్పాల్సింది చెప్పాడు.
పాట దృశ్యీకరణకు కుతుబ్ మినార్ ఇరుకైన మెట్లు సహకరించక పోవటంతో కుతుబ్ మినార్ సెట్ లో నే చిత్రీకరణ జరిగింది. పాట చూస్తున్నపుడు అది తెలియకపోవటానికి ఒక కారణం చూపరులదృష్టి దేవానంద్, నూతన్ లపైనుండి మరలకపోవటం.
*******
ప్రేమరాగం విను
నీవొక గులాబివి..నీకు సరి ఏది
నీ శైలే ఒక వసంతం
మనసు లోపలి సందిగ్ధం పెదవిపైకి వచ్చింది
నీవంటే ప్రేమనే మాటగా
నీకే మనసిచ్చాగా
ప్రేమరాగం విను
కావలిస్తే నన్ను మాయం చెయ్యి కాని కిందకు తోయకు
నీ కంటి అశ్రుకణంలా!
నాప్రేమ ఉన్నతి, లోతును
నా నిట్టూర్పులనడుగు
అవి ఆకాశాన్ని అంటుతున్నాయి.
ప్రేమరాగం విను
ఈ అందమైన చోట నేను ఓడిపోయి కూర్చోను
నీడనై నీవెంట నడుస్తాను
నేడు నాపక్కన నీవు.. మనసు కోరిక ప్రతిధ్వనిస్తుంది
నీతో నా చూపు కలిసినపుడు
నువ్వేమి చేసావో తెలియదుగా
ప్రేమరాగం విను
నీ ఈ పైట ఒక ప్రేమ మేఘంలా
తిరిగి నన్ను నేలమీదకు తెచ్చింది
నా చేయి అందుకో ఇపుడు, నీచూపు మధుపాత్ర ఇవ్వు
ఈ కొత్తయాత్ర కోసం
నీవు నా సాకీ వి
ప్రేమరాగం విను