Saturday, November 28, 2020

హృదయం .. హృదయమే ... హృదయాన్ని నమ్మేదెలా? -दिल तो है दिल, दिल का ऐतबार, क्या कीजै- dil to hai dil, dil kaa aitabaar

హృదయం .. హృదయమే ... హృదయాన్ని నమ్మేదెలా? 

ఎవరిమీదైనా ప్రేమ కలిగితే చేయగలిగింది ఏముంది?


నీజ్ఞాపకాలలో తప్పిపోయాను, రాత్రులు నిద్రకు దూరమయ్యాను
నా హృదయపు స్థితి తెలిసిన వారేలేరు
ఎన్నోయేళ్ళు గా కళ్ళు ఎదురుచూస్తున్నాయి, దాహపు రాత్రులు మేలుకునే గడిపాను
మనసులోని మాటలు పెదవులమీదికి వచ్చిచేరాయి
నీమీద ప్రేమతో, నా మనసుమాట  పర్యవసానం ఏదైనా కానీ


హృదయం .. హృదయమే ... హృదయాన్ని నమ్మేదెలా? 

ఎవరిమీదైనా ప్రేమ కలిగితే చేయగలిగింది ఏముంది?

అశాంతిలోనే నాకు ప్రశాంతి, చేయగలిగిందేముంది?

ఎవరిమీదైనా ప్రేమ కలిగితే చేయగలిగింది ఏముంది?


మత్తుగొలిపే నీ చూపులు నా మనసును ఆవరించాయి
నీ బాహువులు నా తనువును చుట్టుకున్నాయి
దూరాన్ని సహించలేను, పోయిన శాంతిని వెతకలేను
నడవాలంటే ఇప్పుడు  నీ చూపుల నీడలో మాత్రమే
ఉదయ సాయంత్రాలు నీ పేరు తలచుకుంటూ గడుపుతున్నాను
గుండె పదేపదే కొట్టుకుంటుంది .చేయగలిగింది ఏముంది?




Friday, November 6, 2020

 Nainon mein badra chhaye

కళ్ళలో మేఘచ్చాయలు

విద్యుల్లతల్లా మెరుస్తున్నాయి

అలాటివేళ  ప్రియా నన్ను

చేతుల్లోకి తీసుకో

కనులు మత్తులో మునిగి ఉన్నాయి

ఆ చెలులు రెండూ చంచలంగా ఉన్నాయి

కనురెప్పలు 

నీకోసం తపిస్తూనే ఉంటాయి

సిగ్గుపడుతూ నీకందిస్తాయి

మధువుతో నిండిన పాత్రను

కళ్ళలో మేఘచ్చాయలు

విద్యుల్లతల్లా మెరుస్తున్నాయి

నీ ప్రేమ పిచ్చిలో ఉన్నాను

నీ స్వప్నసుందరిని నేను

కిందటి జన్మనుండీ నీ

ప్రేమ కథను నేను

ఈ జన్మలోనూ 

నీ దానిని చేసుకో



 బహారో! మేరా జీవన్ భీ సవారో!


వసంతమా! నా జీవితాన్నీ అలంకరించు!

ఎవరో ఎక్కడనుండో వచ్చి పిలిచినట్టు !వసంతమా

వసంతమా! నా జీవితాన్నీ అలంకరించు!

మనసు కు బాధపడటం నువ్వే నేర్పావు

దానికి నిన్నే దోషిని చేస్తాను

సుందర దృశ్యమా! వసంతమా!
నా జీవితాన్నీ అలంకరించు!వసంతమా! 
(కంటికి) కాటుక దిద్దు! మల్లెలమాల తీసుకురా
వంగిన కొమ్మలనుండి నువ్వు
పూలు తీసుకురా
వసంతమా! నా జీవితాన్నీ అలంకరించు!
నా ఈచేతులకు గోరింటాకు పెట్టు
నా   పాపిట  సింధూరం పెట్టు
జ్ఞాపకాల ధారలు! వసంతమా!