Saturday, December 19, 2020

सजन रे झूठ मत बोलो, మిత్రుడా! అబద్ధాలు చెప్పకు

మిత్రుడా! అబద్ధాలు చెప్పకు 
(చివరకు) దేవుని దగ్గరకు వెళ్ళాలి 
అక్కడికి ఏనుగులు గుర్రాలు రావు 
కాలినడకనే అక్కడికి చేరాలి 

నీ ఈ మహళ్ళు , భవనాలు 
ఇక్కడే ఉండిపోతాయి 
అంత పట్టింపు దేనికి 
ఈ తల చివరకు వంచాల్సిందే 


మంచి చేస్తే మంచి జరుగుతుంది 
చెడు చేస్తే చెడు జరుగుతుంది 
వాటినే లెక్క రాసుకుంటే ఏమౌతుంది 
అక్కడ అన్నింటికీ చెల్లింపు  చేయాల్సి ఉంటుంది. 


బాల్యం ఆటలతో గడచిపోయింది 
యవ్వనం నిద్రతో గడచిపోయింది 
వృద్ధాప్యం  దుఃఖం తో గడుస్తుంది 
ఈ కథ పురాతనమైనదే 





Tuesday, December 15, 2020

वफ़ा जो ना की - Wafa Jo Na Ki - ముకద్దర్ కా సికందర్

నా ప్రేమ నీకు అంగీకారం కాకుంటే ఏమి?

హితుడా! నీ శతృత్వాన్ని నిలుపుకోవటానికైనా రా !

నీ గొప్పదనానికి  తగినదానిని కానని నాకు తెలుసు 

నా మనసును కష్ట పెట్టటానికైనా రా!

****

నాపై నమ్మకముంచకపోయినా బాధ మాత్రం పెట్టకు

ప్రియా!  అన్యాయం చేయకు

మరణించాలనే కోరికతో మనసు ఎటూ మరలదు 

నమ్మకం .. 

నిన్ను చూసినప్పటి నుండి నాకనిపిస్తుంది 
నౌక కు ఇపుడు  నావికుడు దొరికాడని 
నా హృదయా రాధనకు ఇలా 
నా మనసుకు దేవుడు దొరికాడని 
 వరం .. 
వరమివ్వకపోయినా పరవాలేదు కానీ  శపించవద్దు 
హింస .. ప్రియా ! ఇలా హింసించకు 
మరణించాలనే కోరికతో మనసు ఎటూ మరలదు 
నమ్మకం.. 

నేనంటే నీకు ప్రేమ లేదు .. సరే 
నాకుమాత్రం నువ్వంటే ప్రేమ .. నేనేం చేయను 
చస్తూ బ్రతకటం నాకు అలవాటే 
నేను ఉన్నా  లేకున్నా నీకేమి?
మంచిది 
మేలు చేయకున్నా కీడు మాత్రం చేయకు 
హింస .. ప్రియా ! ఇలా హింసించకు 
మరణించాలనే కోరికతో మనసు ఎటూ మరలదు 
నమ్మకం .....