Showing posts with label कसमें वादें प्यार वफ़ा सब. Show all posts
Showing posts with label कसमें वादें प्यार वफ़ा सब. Show all posts

Wednesday, March 29, 2017


'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-44’
..'కస్మె వాదే pyaar వఫా sab.baate హై బాతోమ్ కా Kyaa? 26 February
(ఒట్టు పెట్టటం,ప్రతిజ్ఞలు,ప్రేమ,నమ్మకం
ఇవన్నీ మాటల్లో వచ్చే మాటలే(నిలబడేవికావు))
రైతుబిడ్డ(1970) సినిమాలో రామారావు ఇంటిబాధ్యత వహించే అన్నపాత్ర వేశాడు. కుటుంబానికి ఉపయోగపడ్డాడు.ఊర్లోవారికి ఉపయోగపడ్డాడు.
‘ఎవరినుంచి పొందామో వాళ్ళను క్షమించటం కష్టం ‘ అంటారు.
అలాంటివారిని ఎక్కువకాలం భరించటం లోకానికి కష్టమే. అందుకే వదిలించుకునే ప్రయత్నం చేస్తారు.
.
చుట్టుముట్టిన పరిస్థితులు అతన్ని ఊరిబైటకు తోవచూపాయి.అలా పోతున్న వానిని ముందునుంచీ చూస్తున్న వ్యక్తి వున్నాడు.అతనికి లోకరీతి ముందే తెలుసుకుని లోకాన్ని రోసిఉన్నాడు. ఆతనొ పాట పాడుతున్నాడు. ఆ పాట “మనిషిని నమ్మితె ఏముందిరా…మబ్బును నమ్మినా ఫలితముందిరా..”
తర్వాత ఐదేళ్ళకు(1975/76)లో కృష్ణ ‘పాడిపంటలు ‘ సినిమాలో ఇంచుమించు అదే పాత్ర వేశాడు.లోకచేతిలో దెబ్బతిని బంజరు బాగుచేయటం మొదలుపెట్టాడు.అతన్ని,లోకాన్ని బాగా చూసిఉన్న కాలు పోగొట్టుకున్న ఓ మాజీ సైనికుడు పాడుతున్నాడు.ఆ పాట “నీతీ న్యాయం మంచి మమత ..అన్ని నీటి మీది రాతలురా..అనుబంధాలు,అభిమానాలు ..అన్ని గాలి mootalu raa “
మరో ఐదేళ్ళకు ‘ఉప్ కార్ ‘అనే హిందీ సినిమా చూశాను.’మిస్టర్ భరత్ ’ మనోజ్ కుమార్ అదే అన్నపాత్రలో. ఫైన చెప్పిన రెండు సినిమాలపైనా ఈ ఉప్ కార్ సినిమా ప్రభావం ఉండి.రైతుబిడ్డలో కొద్దిగా.. పాడి పంటలు పైన ఎక్కువగా.
జై జవాన్ జై కిసాన్ స్లోగన్ స్పూర్తిసినిమా అంతటాకనపడుతుంది. తూర్పు అన్నయ, పడమటి తమ్ముడు..వ్యక్తిత్వాలవిబేధం,కుటుంబబంధాల్లో సంఘర్షణ ..ఇవన్నీ కథానాయకుణ్ణి ఒంటరిని చేశాయి.అతనికి తోడునిలిచిన వ్యక్తి ఓ మాజీ సైనికుడు.యుద్ధంలో కాలు పోగొట్టుకుని ఉన్నాడు.అతను పాడే పాట ..'కస్మె వాదే pyaarవఫా sab బాత్ హై బాతోమ్ కా kya'
విలన్ గా లబ్దప్రతిష్టుడైన ప్రాణ్ తర్వాత రోజుల్లో కారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి చిత్రప్రేమికులకు మరింత చేరువయ్యాడు.చాలా సినిమాలో హీరోకు సమానమైన పాత్రలు వేశాడు. దీనికి పునాది వేసిన సినిమా ఉప్ కార్ '. ఇందులో ప్రాణ్ మాజి సైనికునిగా హీరో కు ఆసరాగా నిలిచే పాత్ర ధరించాడు. ప్రాణ్ పై తొలిసారిగా పాట చిత్రీకరణ జరిగింది దీనితోనే.తర్వాత అనేక పాటలు అతనికోసం ప్రత్యేకంగా రాయబడ్డాయి,తీయబడ్డాయి.
హిందీపాటల్లోనూ,కల్యాణ్ జీఆనంద్ జీస్వరపరచిన పాటల్లోనూ,మన్నాడే ఆలపించినపాటల్లోనూ ఎంపికచెయ్యబడే ఈ పాట వెనుక ఆసక్తిగొలిపే అంశాలున్నాయి.ప్రాణ్ పై ఈ పాట చిత్రీకరిస్తామంటే సంగీత దర్శకులు ససేమిరా అన్నారు.వారిని ఒప్పించి కిశోర్ కుమార్ ను పాడమని అడిగితే ఆయన ఒప్పుకోలేదు.సినిమా కు నిర్మాత ,దర్శకుడు,కథానాయకుదూ ఐన మనోజ్ కుమార్ పట్టువదలలేదు. మన్నాడే తో ఈ పాటను పాడించి ప్రాణ్ పై చిత్రీకరించాడు.( పాట రచన ఇందీవర్)
సంగీత దర్శకద్వయం కల్యాణ్ జి అనంద్ జీ లలో ఎవరిమాటలో తెలియదు కాని వారు పాటలో నటించిన ప్రాణ్ కు గొప్ప కితాబు ఇచ్చారు.తమ పాట కు పెదవుల కదలిక గాక,హృదయపు కదలికల ద్వారా...చిత్రీకరణలో మెడపైని కండరాల కదలికలు చూపుతు ప్రాణ్ పాటకు ప్రాణ ప్రతిష్ట చేశాడని చెప్పారు.
“ఒట్టు పెట్టటం,ప్రతిజ్ఞలు,ప్రేమ,నమ్మకం
ఇవన్నీ మాటల్లో వచ్చే మాటలే(నిలబడేవికావు)
ఎవరికెవరూ ఉండరు..అన్నీ అబద్ధాలే
బంధుత్వాలన్నీ వట్టివే
దేవుడు ఎదురుగా వున్నా
అప్పటికీ నిన్నెవరూ కాపాడలేరు.
నీ సొంత రక్తమే చివరికి నీకు చిచ్చు పెట్టింది
ఆకాశంలో విహరించేవారైన..మట్టిలో కలవాల్సిందే.
సుఖాలలో ఉన్నంతవరకూ అందరూ వెంటనడుస్తారు.
కష్టాలలో అందరూ ముఖం చాటేస్తారు.
లొకులంతా నీవారూ ఔతారు..నీహృదయాన్ని ముక్కలూ చేస్తారు.
భగవంతుణ్ణే మోసంచేసేవారు మనిషిని వదులుతారా?
ఇది హిందువు చేసిన పనే ఐతే ..దేవాలయాన్ని దోచిందెవరు?
ఇది ముసల్మాను పనే ఐతే...ఖుదా మందిరమెందుకు ముక్కలయ్యింది?
దీనిని ఆమోదించింది మతమే ఐతే అది మతమెందుకు ఔతుంది?”
--ముళ్ళపూడి సుబ్బారావు