Showing posts with label हर खुशी अपनी. Show all posts
Showing posts with label हर खुशी अपनी. Show all posts

Wednesday, March 29, 2017


'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-48’
‘అబ్ తో హై తుమ్ సే హర్ ఖుషి అప్ని’ 6 March at 20:21
(ఇప్పుడు నా ప్రతీ సంతోషమూ నీతోనే).
‘అభిమాన్’ సినిమాలోలతా మంగేష్కర్ పాట. సంగీతం ఎస్.డి.బర్మన్,మజ్రూహ్ సుల్తాన్ పురి రచన.
"ఇవ్వటమంటూ చేస్తే నన్ను నేను మొత్తంగా ఇచ్చుకుంటాను" అంటాడు అమెరికన్ రచయిత ‘ వాల్ట్ విట్ మాన్ ‘తన రచన 'సాంగ్ ఆఫ్ మై సెల్ఫ్' లో.
...
'అబ్ తో హై తుమ్ సే హర్ ఖుషి అప్ని ' పాట వింటుంటే పాడే ఆమె తనది అలాంటి అర్పణే అని చెప్పుతున్నట్టుంది.
'అభిమాన్ ' సినిమా రిలవెన్స్ ఇప్పటి సమాజంలో మరీఉందనిపిస్తుంది.దంపతులిద్దరూ ఫైనాన్షియల్ ఇండిపెండెంన్స్ తో ఉండటం, ఒకే రంగంలో పోటీపడాల్సిరావటం ఇవన్నీ సంబంధాలను ప్రభావితం చేస్తున్నాయి. అదే గ్లామర్ ఫీల్డ్ లోనైతే మరింత ఎక్కువ.ఒకప్పుడు చాలా కొద్దిమంది అనుభవం ఇప్పుడు మెజారిటి కి అనుభవమౌతూ ఉంది.
ప్రాధాన్యాల ఎంపిక, దేనికోసం దేనిని వదులుకోవాలి అనే వాటిలో ఎవరి విజ్ఞత వారిదే.
గాయకుడిగా ఉన్నతస్థితిలోఉన్న హీరో, సంగీతంలో ప్రవేశం ఉన్న అమ్మాయిని ఇష్టపడి పెళ్ళి చెసుకున్నాడు. ఆమేను గాయనిగా ప్రోత్సహించాడు.ఆమె తనకన్నా ఎదుగుతుంటే తట్టుకోలేకపోయాడు.ఆమెను దూరంచేసుకున్నాడు.అంతర్మధనానికి లోనయ్యాడు.పశ్చాత్తాపపడ్డాడు.అహాన్ని గెలిచాడు.తిరిగి ఆమెకు దగ్గరయ్యాడు.
'అభిమాన్ ' సినిమా చూసినపుడల్లా బాధపెడుతూనే ఉంటుంది.తన బాధకి కారణమైనదాన్ని గుర్తించలేక ఒక రకంగా స్వయం హింసకు గురయ్యే కథానాయకుడు, తన ప్రమేయం లేకుండానే బాధించబడే కథానాయికలకు పట్ల ప్రేక్షకులకు సానుభూతి కలుగుతుంది.

ఎస్.డి.బర్మన్ సంగీతం హీరో,హీరోయిన్లతో సమానమైన పాత్ర సినిమాలో పోషించింది.అన్ని పాటలూ శ్రవణానందం కలిగించేవే.ప్రత్యేకంగా 'అబ్ తో హై తుం సే హర్ ఖుషీ అప్ని"పాట వింటున్నా, చూస్తున్నా మనసు ఆర్ధ్రమౌతుంది.లతా మంగేష్కర్ స్వరం, ప్రేమ,బాధ,నిష్టూరం..వీటన్నిటినీ పలికిస్తుంది.మధ్యలో వచ్చే సంగీతం,హృదయ స్పందనల్ని బైట వినిపిస్తున్నట్టనిపిస్తుంది. ఇ.సి.జి. గ్రాఫు నో,మోనిటర్నో చూస్తున్నట్టనిపిస్తుంది. కథ సుఖాంతమౌతుందని తెలిసినా....ఆ క్షణపు బాధ భరించాల్సిందే.
ఇప్పుడు నా ప్రతీ సంతోషమూ నీతోనే
నీకై మరణించటమైనా అదే నా జీవితం
నీకోసం నా మనసు పిచ్చిదయ్యాక
లోకం నా గురించి ఏమనుకున్నా నాకు లెక్కలేదు.
ఎవరు నా గురించి ఎన్ననుకున్నా..
నీ ప్రేమలొ నేను పడ్డ అపవాదు ఎంత దూరమో పాకింది
ప్రియా…. నీతో అంతే కీర్తినీ పొందాను.
నీ పై ఈ మైకం ఎక్కడిదాకా తీసుకెళుతుందో చూద్దాం.

-ముళ్ళపూడి సుబ్బారావు