Showing posts with label Chand Mera Dil. Show all posts
Showing posts with label Chand Mera Dil. Show all posts

Wednesday, March 29, 2017

'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-47’

చాంద్ మేరా దిల్,చాందినీ హో తుమ్..4 March at 19:02
(నా హృదయం ఒక చందమామ,నువ్వు వెన్నెలవు)
'హం కిసీ సే కమ్ నహీ ' సినిమాలో ఒక మెడ్లీ. మహమ్మద్ రఫీ,కిశోర్ కుమార్,ఆర్.డి.బర్మన్,ఆశా భోంస్లే పాడిన పాట.సంగీతం ఆర్.డి.బర్మన్.రచన మజ్రూహ్ సుల్తాన్ పురి.
...
నాసిర్ హుసేన్ నిర్మాత,దర్శకుడిగా మూడు దశాబ్దాల పాటు సినిమాలు తీసాడు. తన చిత్రాలలో పాటలు పట్ల చాలా శ్రద్ధ పెట్టేవాడు.ఎనభైల మొదట్లో వచ్చిన 'జమానేకో దిఖానా హై' వరకూ అన్నీ సినిమాల్లోనూ పాటలు హిట్లే.అతని సినిమాల మరో ప్రత్యేకత, చాలా సినిమాల్లో ఒకే పాట రెండేసి వెర్షన్లు ఉండటం. చిన్నప్పుడు పాడిన పాట పెద్దయ్యాక పాడటమో, హీరో పాడిన పాట మరోసారి హీరోయిన్ పాడటం ..ఇలా. ఐతే ఆ తరహా పాటలన్నీ సక్సెస్ అయ్యాయి.
అతని 'యాదోంకి బారాత్ ' సినిమా సూపర్ హిట్ అయ్యింది.అందులో నేపధ్యం-నగరవాతావరణం, ధనిక వర్గాల జీవిత చిత్రణ,క్లబ్ సంస్కృతి,అందులో గిటార్ తో పాటలు పాడే హీరోలు,విదేశాలనుండి వచ్చే హీరో/హీరోయిన్లు .
అలాంటి నేపధ్యంతోనే అతని మరో సినిమా 'హం కిసీ సే కమ్‌నహీ' తీశాడు.(1977).
మ్యూజికల్ హిట్ అని చెప్పటానికి ఒక ఉదాహరణగా ఈ సినిమా నుచెప్పవచ్చు.అందమైన, రంగురంగుల,పరిమళభరిత పుష్పాలను ఒక చోట అమర్చితేఅది ఫ్లవర్ బొకే అవుతుంది.అలాంటి పాటల్ని ఒకే చోట చేర్చితే అది 'హమ్ కిసి సె కమ్ నహీ' అవుతుంది.
బాల్యంలో స్నేహాన్ని,బాసల్ని గుర్తుచేసే నాసిర్ హుసేన్ ట్రేడ్ మార్క్ లాంటిశ్రావ్యమైన పాట 'క్యాహువా తేరా వాదా',రోడ్ సాంగ్స్ లాంటి రెండు డ్యూయెట్లు (యే లడకా హాయ్ రే అల్లా,హం కో తో యారా తేరీ ), ఒక ఖవాలీ(హై అగర్ దుష్మన్), డాన్స్ తో స్టేజ్ సాంగు (బచనా యే హసీనో) ఇంకా ప్రత్యేకమైన ఒక మెడిలీ (మెడ్లీ)..నాలుగు వేరు వేరు పాటలనదగిన వాటిని ఒకటిగా గుదిగుచ్చి దానికీ రెండు నిముషాల సంగీతాన్ని కలిపి సుమారు 10 నిముషాలు సాగే 'చాంద్ మేరా దిల్ ' అంటూ మొదలయ్యే పాట..వేటికవే అన్నీ మనోరంజకమైనవే.
సినిమాలో పాటలు వేటికవే 'హం కిసీ సే కమ్ నహీ '(మేమెవరికంటేనూ తక్కువ కాదు) అన్నట్టుంటాయి.
'చాంద్ మేరా దిల్ ' పాట ఇద్దరు హీరోలమధ్య సాగే సంగీత/నృత్య పోటీ నేపధ్యంలో వస్తుంది.
కొంత సేపు సంగీతం,తర్వాత మెలోడియస్ గా రఫీ స్వరంతో గుతుంది.
కొనసాగింపుగా మరో బాణీ లో కిశోర్ కుమార్ స్వరంతో 'ఆ దిల్ క్యా మెహఫిల్ హై తెరీ ' మొదలౌతుంది.
వెంటనే ఆర్.డి.బర్మన్ గొంతుతో వేరే బాణీ తో 'తుమ్ క్యా జానొ మొహబ్బత్ క్యా హై ' .
ఆపై లతా మంగేష్కర్ పాడే మరో చరణం ఇంకో బాణీ లో 'మిల్ గయా ..హం కో సాథీ. తర్వత రెండు నిముషాలు సంగీతం.
సినిమా గా కాకుండా ఒక సింగింగ్ కాంపిటీషన్నో,డాన్స్ కాంపిటిషన్నో నిజంగా చూసిన అనుభూతి ఈ పాట అప్పుడు కలగజేసింది. .హిందీ పూర్తిగా అర్ధం కానీ,వాడుకలో లేని ప్రాంతం లోని చిన్న పట్టణాలలో సైతం కాంపిటీషన్ సాంగుకు ప్రేక్షకులు ఈలలతో,చప్పట్లతో హోరెత్తిస్తూ ఆనందించటాన్ని చూడటం ఒక అనుభవం

-ముళ్ళపూడి సుబ్బారావు