Showing posts with label Dil Aisa Kisi Ne Mera Toda. Show all posts
Showing posts with label Dil Aisa Kisi Ne Mera Toda. Show all posts

Wednesday, March 29, 2017

దిల్ ఐసా కిసీనే మేరా తోడా



“దిల్ ఐసా కిసీనే మేరా తోడా ,బరబాదీ కి తరఫ్ ఐసా మోడా”18 March at 19:49

(ధ్వంసమయ్యేంతగా హృదయాన్ని గాయపరచారు )
('అమానుష్ ' సినిమాలో కిశోర్ కుమార్ పాడిన పాట.ఇందీవర్ రచన,శ్యామల్ మిత్రా సంగీతం)
...
డెబ్భైలలో నాకు సంబంధించి ప్రతీ ప్రాంతీయ భాష లోనూ ఒక్కో ఎన్.టి.ఆర్ ఉండేవాడు.తమిళ్ లో శివాజీగణేశన్ (ఎం.జి.ఆర్ సినిమాలు అంతగా నాకు అందుబాటులోకి రాలేదు), కన్నడంలో రాజ్ కుమార్, మలయాళంలో ప్రేం నజీర్..ఇలా. సినిమా పుస్తకాలద్వారా బెంగాలీ సినిమా ఎన్.టి.ఆర్ ఉత్తమ్ కుమార్ అని తెలిసింది. ఐతే అతని సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ అవ్వలేదు కనుక నాకు ఆయన్ను చూసేఅవకాశం అప్పట్లో కలగలేదు.
ఉత్తమ్ కుమార్ కొన్ని హిందీ సినిమాల్లో నటింఛాడు.వాటిలో 'అమానుష్ '(1975) సినిమా ఒకటి. డెబ్భైలలో హిందీ సినిమాలు చాలా ఎక్కువ తెలుగులోకి రిమేక్ చెయబడ్డాయి. ఆక్రమంలో అమానుష్ సినిమాకూడా తెలుగులోకి ఎదురీత పేర నిర్మించబడింది. అందులో ఎన్.టి.ఆర్ నటించాడు. దానికి సంగీతం సత్యం అందించారు.సాధారణంగా సంగీత దర్శకుడు 'సత్యం' ,రిమేక్ లకు సంగీతం చేసేటప్పుడు హిందీ పాట వరసల్నే యధాతధంగా ఉంచేవాడు. ఈ సినిమాలో మాత్రం టైటిల్ సాంగ్ ను మాత్రమే మాతృక నుంచి తీసుకున్నారు. ఆ పాట తెలుగులో కూడ బాగా హిట్ అయ్యింది.ఆ పాట 'ఎదురీత కు అంతం లేదా?'.హిందీ లో 'దిల్ ఐసా కిసీనే మేరా తోడా '
సొంతమనుషులతోనే మోసపోయి,అపనిందలు పడి,జైలు పాలయ్యి బయటకు వచ్చాడు కథానాయకుడు. ప్రేయసికి దూరమయ్యాడు. మృగం లా కనిపిస్తున్న అతను గాయపడ్డ మనసుతో ఉన్నాడు.అనుకోకుండా పాత ప్రేయసిని ఆపదనుండి కాపాడాడు. ఆ సందర్భంలో పాట
“ధ్వంసమయ్యేంతగా హృదయాన్ని గాయపరచారు
ఒక మంచి మనిషిని రాక్షసుణ్ణి చేసి వదిలారు
సముద్రం ఎంత సమీపంలోఉనా,నా జీవితం లో ఇంకా దాహమే
దాహం పెద్దది.జీవితం చిన్నది...
లోకపు దారులన్నీ చెబుతున్నాయి..నీ కోసమంటూ గమ్యమేమీ లేదని
వైఫల్యంతో జతకట్టాను...
అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించి చీకటి లేకుండా చేస్తాడు.
కాని నా సూర్యుడు కోపించాడు..నాకు తిరిగి ఉదయమనేది లేదు
వెలుతురు నా జట్టు వదిలి వెళ్ళింది...”
పల్లెటూరి నేపధ్యంలో సాగే ఈ కథ అన్ని భారతీయ భాషలకు,ప్రాంతాలకు తగినట్టు ఉంటుంది. అందుకే కావచ్చు హిందీ, బెంగాలీ (ఉత్తమ్ కుమార్),తెలుగు, తమిళ(శివాజీ గణేశన్), మళయాళీ భాషల్లోకి వెళ్ళగలిగింది.
-ముళ్ళపూడి సుబ్బారావు