"జాయేతో జాయె కహా " పాట టాక్సీ డ్రైవర్ సినిమాలోది. తలత్ మహమూద్ పాడిన ఈ పాట ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది.
"పోవాలంటే ఎటు పోగలను....
బరువెక్కినమనసుమాట అర్ధమయ్యేది ఎవరికి?
"పోవాలంటే ఎటు పోగలను....
బరువెక్కినమనసుమాట అర్ధమయ్యేది ఎవరికి?
లోలోన నిరాశలు గుమిగూడి వున్నాయి.
మిగిలిందేమిటి,వేదన నిండిన అంతరంగం,మసకబారిన గుండె
బాధ తనకూ ఉంది,నాకూ ఉంది
మనసు కుదుటబడుతుందన్న ఆశ అడుగంటింది.
నావ ఒకటి..వంద తుఫానులు...."
ఈ పాట విన్నపుడల్లాకాలేజిలో నా ఫ్రెండు మల్లికార్జున్ గుర్తొస్తాడు
..క్లాస్ రూం మెట్లుఎక్కుతూ ఏదో పాట సన్నగా పాడుతున్నాడు..అదేటైం తో నా మనసులోనూ అదే పాట మెదులుతుంది. ‘ జాయెతో జాయె కహా???' ప్రశ్నిస్తున్నట్టు అన్నాను.ఔనన్నాడు. మరోసారీ అలాంటి అనుభవమే అయ్యాక స్నేహితులమయ్యాము.అంత కో ఇన్సిడెన్స్ ఎలా ఔతుందన్న తర్వాతి ఆరా లో కిందటి రాత్రో,ఉదయమో రేడియోలో వచ్చినపాటలని తేలింది.
అతను నాకు నాకుతెలియని పెద్దవాళ్ళను పరిచయం చేశాడు.వాళ్ళంటా సిలోన్ కు 8 గంటలముందే వచ్చిపోతుంటారు.అప్పుడప్పుడు టైం తప్పి మిగతాగంటల్లో ఎదురౌతారు.వాళ్ళలో ఒకరు 'తలత్ మహముద్ '.
ఆయన నాకు మరీ దూరపు బంధువేంకాదు.నాకు ఇష్టమైన సంగీత దర్శకుడు రమేష్ నాయుడు అయన్ని మన సీమలకు తీసుకొచ్చి 'అందాల సీమా సుధామధురం' వంటి పాటలు(మనోరమ సినిమాలో 3) పాడించాడు. అంతకుముందు ఆ పాట పి.బి. దో ఏ.ఎం.రాజా దో అనుకున్నాను.
రఫీకిశోర్ పాటలు వినీవినీ అంతకుముందు గాయకులపాటలు వినటం మొదటి చాయిస్ గా ఉండెదికాదు.ఇంటరెస్ట్ లేని చాప్టరుకూడా కష్టపడి అర్ధంచేసుకున్నట్టు,పనిగట్టుకు కొన్నిపాటలువిన్నాక వాటినీఆనందించగలిగాను.
పదిపైగా సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు.చాలానే సినిమా పాటలు పాడాదు.దిలీప్ కుమార్,
దేవానంద్,రాజ్ కపూర్, వంటిపెద్దహీరోలకు రెగ్యులర్ గా పాడాదు.50ల 'గాయకత్రిమూర్తుల 'లో ఒకడిగా ప్రసిద్ధిచెందాడు.ఘజల్ ను ప్రైవేటు కచేరీ స్థాయి నుంది స్టేజి కచేరీగా మార్చి,మెహిదిహసన్ వంటి వారికి మార్గదర్శకుడయ్యాడు.
తలత్ మొహమూద్ పాటలు నాకు 'శరత్కాలంలో నిర్మలంగా పారుతున్న సెలయేటి సవ్వడి 'లా అనిపిస్తాయి.జలపాతాల హోరు,రాళ్ళనుఢీకొనిఉవ్వెత్తున్ లేచే అలల చప్పుడూ అందులో వినపడదు.
టాక్సీడ్రైవర్ లో తలత్ పాడిన ఈ పాట లో ఇప్పటికీ నచ్చుతుంది.
పాటలో కొన్ని పదాలు 'దర్ద్ భరే దిల్ కి జుబా','రూహ్ మె గం దిల్ మె ధుఆ ','ఏక్ కష్టి ....సౌ తూఫాన్ 'చాలా నచ్చుతాయి.
--ముళ్ళపూడి సుబ్బారావు