Showing posts with label anarkali. Show all posts
Showing posts with label anarkali. Show all posts

Wednesday, March 29, 2017

'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-31’
“యే జిందగీ ఉసీ కి హై జో కిసీ క హో గయా,ప్యార్ హి మే ఖో గయా” 29 January

(వేరేవారి పరమై, ప్రేమలో సర్వం మరచినవారిదే ఈ జీవితం)
...
'విజయచిత్ర ' సినిమా పత్రికలో 'వినవేడుక ' అనే సినిమాపాటలకు సంబంధించిన కాలమ్ వస్తుండేది. అందులో నవ్వుతూ,వెడల్పైన మొహంతో ఉన్నాయన ఫొటో ఉండేది. ఆ ఫొటో ఆ కాలమ్ రాస్తున్న వి.ఎ.కె.రంగారావు (తెలుగు సినిమా సంగీత విమర్శకుడు)ది అనుకునేవాడ్ని.ఐతే ఆ ఫొటో సి.రామచంద్ర అనే హిందీ సినిమాసంగీతదర్శకుడిదని తర్వాత తెలిసింది.సి.రామచంద్ర 'చితల్కర్ ' పేరుతోకూడా పరిచితుడు. వి.ఏ.కే రంగారావు సి.రామచంద్ర కు వీరాభిమాని.
సి.రామచంద్ర తెలుగులో ఎన్.టి.ఆర్ తీసిన 'అక్బర్ సలీం అనార్కలి ' సినిమాకు సంగీతమందించారు.దీని వెనుకకథ ఆరా తీసినపుడు తెలిసినసంగతులు....
హిందీలో అంతకుముందెన్నడో అనార్కలి సినిమా వచ్చింది.దానికి సి.రామచంద్ర సంగిత దర్శకుడు.ఆ అనార్కలి స్పూర్తి తో తెలుగులో అంజలీ ఆదినారాయణరావుల 'అనార్కలి ' వచ్చింది. దానికి ఆదినారాయణరావు సంగీతం అందించారు.
ఎన్.టి.ఆర్ 1979 లో 'అక్బర్ సలీం అనార్కలి ' సినిమా తీసారు.సినిమా తీయటానికి రామారావు ను ప్రేరేపించినది మొఘల్ ఎ అజ్మ్ సినిమాలొ అక్బర్ గా పృథీరాజ్ కపూర్ నటనఅని చెబుతారు..మొఘల్ ఎ అజ్మ్ కు సంగీతకారుడు నౌషాద్. కాని ఎన్.టి.ఆర్ హింది అనార్కలి సంగీతదర్శకుడైన సి.రామచంద్ర ను telugu సినిమా రంగానికితీసుకొచ్చారు..(సి.నారాయణరెడ్డి ఏకవీర సినిమాతరవాత ఈ సినిమాకే మాటలు రాశారు)
అందులో పాటలు 'తారలెంతగా మెరిసేనో','తానే మేలిముసుగు తీసి ','సిపాయీ ఓ సిపాయీ..హసీనా' వంటిపాటలు చిత్రజయాపజయాలతో సంబంధం లేకుండా ఇప్పటికీ చిత్రసంగీతప్రేమికుల్ని అలరిస్తున్నాయి.
సి.రామచంద్ర అంతకుముందు తెలుగులో చెయ్యకపోయినా అతని ట్యూనులు మనం చాలానే విన్నాం.అందులో తెలుగు అనార్కలీ లో 'జీవితమే సఫలము ' కూడా ఒకటి.
దీనికి ఆధారం హింది అనార్కలీ లో సి.రామచంద్ర పాట ' యే జిందగీ ఉసీకి హై '
“వేరేవారి పరమై, ప్రేమలో సర్వం మరచినవారిదే
ఈ జీవితం
ఈ వసంతం,ఈ గాలీనేలా ప్రేమించమని చెబుతున్నాయి
ఎవరిపట్లైనా తీరనివలపు తో మనసును కలవరపరచుకోమంటుంది
జీవితానికి భరోసా లేదు
ప్రేమలో ఆనందాన్ని కొనిపో
హృదయం స్పందిస్తుంటేనేం ,స్పందనల్ని లెక్కించకు
ఇంత విశ్రాంతి తిరిగి ఎక్కడిది,ఇలాంటి రేబవలు మరి ఎక్కడ?
పిలుపు వినవస్తుంది
ప్రేమమైకంలో మునిగిపో”
హిందీ అనార్కలి లో పాటలన్నీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. లతా పాడిన ఈ పాట ఆమె పాటల్లో ఒక అద్భుతమైనదిగా చెబుతారు.(గీత రచన రాజిందర్ కిషన్)
-ముళ్ళపూడి సుబ్బారావు