Showing posts with label ankhe dekhi. Show all posts
Showing posts with label ankhe dekhi. Show all posts

Monday, May 29, 2017

సోనా రే ! తుఝే కైసే మిలూ

నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-88
‘సోనా రే ! తుఝే కైసే మిలూ’
(బంగారమా! నిన్ను ఎలా కలువగలను)
సులక్షణా పండిట్, మహమ్మద్ రఫీ పాడిన పాట.
ఈ పాట నాకు పూర్తిగా అర్ధంకాదు.మేఘగమనాన్నీ,ఆగమనాన్నీజలపాత,నదీప్రవాహాల్నీ వర్ణిస్తున్నట్టు అనిపిస్తుంది. .ప్రకృతి చేసే శబ్దాల్ని పాట గా మలచినట్టు ఉంటుంది. పచ్చని కొండల్లో, లోయల్లోసంచరిస్తూ అక్కడ ఏవో రాగాలు, వాటి ప్రతి ధ్వనులు విన్నట్టుంటుంది. ఈ పాటను పోలిన పాటలు చాలా విన్నట్టు...నైనో మె నిందియా,నిందియామె సప్నే,సప్నే మె సాజన్ అంటూ సాగే ‘సిల్ సిలా’ పాట గుర్తొస్తాయి.
సులక్షణా పండిట్ నటిగా కన్నా, గాయనిగానే నాకు ముందు పరిచయం.ఆమె పేరు వినగానే రఫీ తో పాడిన మూడు పాటలు గుర్తుకొస్తాయి. అవి ‘పరిదేశియా ! తేరే దేశ్ మే ప్యార్ ఇస్ తరాహ్(గరమ్ ఖూన్)’, జిస్ కేలియే సబ్ కో చోడా( సాజన్ కి సహేలి)’, ‘సోనారే ! తుఝే కైసె మిలూమ్(ఆంఖె దేఖి)’
‘సోనారే !’పాట రేడియో లో ఎప్పుడన్నా అనుకోని ప్రియమైన అతిధిలావచ్చి వినపడుతుండేది.సిడిలు అందుబాటు లోకి వచ్చినా ఎక్కడా ఈ పాట దొరికేది కాదు.వినపడినప్పుడూ విని ఆనందించటమే.
తరువాత ఎవరో పుణ్యంకట్టుకుని నెట్ లోకి ఎక్కించారు. ఐతే అదీ ఆడియోనే.ఇప్పు వీడియో కోసం వేట మొదలు. నెమ్మది మీద తెలిసిన విషయం సినిమా విడుదలే కాలేదని.ఈ పాటకు సంగీత దర్శకుడు జె.పి.కౌశిక్. గీతకారిణి పద్మాసచ్ దేవ్.
రచయిత గానూ, సినిమా డైలాగ్ రైటర్ గాను పేరుగాంచిన రాజిందర్ సింగ్ బేడి ఈ సినిమాకు దర్శకుడు.బిమల్ రాయ్,హృషికేశ్ ముఖర్జీ వంటి వారి సినిమాలకు మాటలు రాశారు. నాకు చాలా ఇష్టమైన సినిమా’ సత్యకామ్’ కు మాటల రచయిత ఈయనే.
“ సోనా రే ( బంగారమా!)
నిన్ను ఎలా కలవగలను?
ఎలా ఎలా కలువగలను?
మామిడి తోటా?
జలపాతపు నదా?
ఎక్కడ కలవను?
మబ్బులు కమ్ముకుంటున్నాయి
??????
ఎప్పటికీ పోని రంగును ఇస్తాను
ఎప్పటికీ వాడని పూలదండ ఇస్తాను
ఆగిపోయిన నది ధారలను చూడు
పరుగెడుతున్న ఒడ్డును చూడు
నది నీరంతా బిందె నింపేసుకుంది
మట్టి బంధనం లో కొండ ఊగుతుంది

-ముళ్ళపూడి సుబ్బారావు