'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-15: 'వహా కౌన్ హై తేరా'
ఎస్ డి బర్మన్ సంగీతదర్శకుడిగా యశస్సు పొందాడు. ఐతే గాయకుడిగా అతను పాడిన అన్నిపాటలు ఉత్తమమైనవే.ఒక పెక్యూలియర్ వాయిస్ తో సంగీతప్రేమికుల్నేగాక,మిమిక్రీ ఆర్టిస్తుల్నీ ఆకర్షిస్తాడు. గైడ్ సినిమాలో రెండు ఆయన పాడిన పాటలు ఉన్నాయి.ఒకటి 'వహా కౌన్ హై తేరా', మరొకటి 'అల్లా మేఘ్ దే ,పానీ దే..' వహా కౌన్ హై పాట అప్పటివరకూ రాజు (కథనాయకుడు) జీవితాన్ని సమ్మరైజ్ చేసి చెప్పినట్టుంటుంది. శైలేంద్ర సాహిత్యం.సినిమా ఆర్కే నారాయణ్ నవల 'గైడ్ 'అధారంగ...ా తీశారు.
గైడ్ వృత్తి రాజు కి లౌక్యం,మార్కెటింగ్ స్కిల్స్ ను నేర్పింది.పురావస్తుపరిశోధకుడికి గైడ్ గా ఒక అసైన్మెంటు అతనిజీవితాన్ని పెనుమార్పులకు గురి చేసింది.సందర్భవశాత్తూ పరిశోధకుడి భార్యకు దగ్గరయ్యాడు.ఆమె ఒక స్టార్ గామారటంలో తోడ్పడ్డాడు.ఆక్రమంలో తల్లికి,బంధువులకు,స్నేహితులకు,సమాజానికి దూరమయ్యాడు.స్టార్ గా మారిని ప్రేయసిఎక్కడదూరమౌతుందోనని వ్యాకులపడ్డాడు,అనుమానం,అసూయ,ఆత్మన్యూనతలతో జూదరి,తాగుబోతు అయ్యాడు.ఆమె పట్లప్రేమతోనే ఫోర్జరీ చేసి ఆమెకు దూరమై జైలు పాలయ్యాడు.జైలు నుండి విడుదలై ప్రయాణం మొదలుపెట్టాడు.
అతని స్థితిని చెబుతూ ఈ పాట బాక్ గ్రౌండ్ లో వినిపిస్తుంది.
'వహా కౌన్ హై తేరా?..ముసాఫిర్ జాయేగా కహా?'
'అక్కడెవరున్నారు నీకు.. ఓ యాత్రికుడా..ఎక్కడికి పోతావు?
కొంత తడవు దమ్ము(శ్వాస) తీసుకో,ఈ మాదిరి నీడెక్కడ దోరుకుతుంది?
ప్రేమతో నిండిన క్షణాలు,ఆ రోజులు గడిచిపోయాయి,ఆ రాత్రులన్ని కలైపోయాయి.
ప్రేమ కలయికల్ని ఆమె మరచిపోయిందినువ్వు మరచిపో
మిగిలిన దూరాలన్ని చీకటే,ఓ యాత్రికుడా..ఎక్కడికెళతావు?
నీ రాకకు ఎదురుచూసేవారు లేరు,నీకోసం బాధపడేవారు లేరు
నీకోసం తడిచే కన్ను లేదు,నావాళ్ళు అని ఎవరిని అంటావు.
నువ్వు(గైడ్ గా) అందరికి దారి చూపావు,నువ్వెలా గమ్యానికి దారి తప్పావు?
వేరేవారి చిక్కులు తప్పించి,నువ్వెలా బంధాల్లొ చిక్కావు
నీ నాగస్వరాన్నికి నువ్వే నర్తిస్తున్నావు.
జ్ఞాని చెబుతాడు..లోకమొక ఎండమావి అని
అన్ని నీటిమీద రాతలే అందరూ చూస్తారు,అందరూ తెలుసుకుంటారు
కాని ఎవరూ చేసేదేమీ లేదు
నీదీ ఏమీలేదు నాదీ ఏమీ లేదు ఓ యాత్రికుడా..ఎక్కడికెళతావు?"
గైడ్ తన గమ్యమేమిటో తెలియనిస్థితికిచేరాడు. తనకే ఆసరా లేకపోయినాఅనుకోకుండావేరేవారికి ఆసరా అయ్యాడు.తనుపొందలేని స్వాంతనను వేరేవాళ్ళు అతనిద్వారాపొందగలిగారు.వాళ్ళకోసం అప్రమేయంగా దీక్ష బూనాడు.అందులో మరణించి వాళ్ళకు దేవుడయ్యాడు.
కాలిపోవటం తప్పనిదైనప్పుడు,వేరేవారికి వెలుగునిచ్చే కాగడా గా వెలిగిపోవటం మంచిదేగా!
--ముళ్ళపూడి సుబ్బారావు