'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-33’'బాలం ఆయొ బస్ మొరే మన్ మె '
'ప్రియతమా వచ్చి నా మనసులో వసించు '
హిందీ 'దేవదాస్ '(1936)సినిమాలో కె.ఎల్.సైగల్ పాడి నటించిన పాట.
...

ఒక నవల ఒకటికన్నా ఎక్కువసార్లు సినిమా రావటం అసాధారణంకాదు(నిన్నటి మీనా నేటి అ ఆ లు ఒ ఉదాహరణ). మరి ఒకే సాంఘిక నవల సుమారు పదిసార్లు వివిధభారతీయ భాషల్లో రావటం విశేషమే (అందునా తొంభై యేళ్ళ కాలవ్యవధి లో).అంటే ఆ నవలా ఇతివృత్తంలో ఏదో సర్వకాలీనత ఉంది.ఆ నవల శరత్ చంద్ర రాసిన 'దేవదాస్ '.
దేవదాస్ మూకీ సినిమాకాలంలో అంటే ముప్ఫైలకు ముందు సినిమాగావచ్చింది.35/36 లలో బెంగాలీ, తమిళ, హిందీ దేవదాసు సినిమా వచ్చింది. తర్వాత తిరిగి హిందీలో రెండుసార్లు,తెలుగులో రెండు సార్లు వచ్చింది. అభయ్ డియోల్ నటించిన 'దేవ్ డి ' కూడా దేవదాసే. కాకుంటే అతను ఆధునిక దేవదాసు.
ఐతే 36లో వచ్చిన హిందీ దేవదాసు భరతఖండం ఆమూలాగ్రనికి తనను పరిచయంచేసుకుని వారిలో ఒకడైపోయాడు.ఆ పాత్ర ధరించిన 'కుందన్ లాల్ సైగల్ ' నటగాయకుడు. భారత దేశపు తొలి స్టార్ సింగర్ కూడా.భౌతికంగా బ్రతికింది 43 యేళ్ళేకాని, గత ఎనభైయేళ్ళు గా సంగీతప్రియుల మదిలో బ్రతికేఉన్నాడు.
తొంభల తొలి సంవత్సరాలలో ఎదో కూల్ డ్రీంక్ అడ్వర్టైజ్ మెంటులో అక్షయకుమార్ డ్రింకు తాగకముందు నెమ్మదిగా సాగే సైగల్ పాట పాడుతుంటే ప్రేక్షకులు ఒప్పుకోరు. ఆతను వెంటనే కూల్ డ్రింక్ తాగి హుషారైన పాటేదో పాడుతాడు.ఆ యాడ్ పట్ల చాలా నిరసన వ్యక్తమై, కొందరు సైగల్ అభిమానులు కోర్ట్ కెళ్ళేందుకు సిద్ధమయ్యారు. అంతగాఢమైన అభిమానం సైగల్ పట్ల ఇప్పటికీ ఉండటం నాకు అనూహ్యం.
రేడియో సిలోన్ సైగల్ కు చాలాప్రాముఖ్యత ఇచ్చింది. రోజూ ఉదయం ఎనిమిది గంటలకు ముందు పురానె ఫిల్మోంకె గీత్ ప్రోగ్రాం అఖరి పాటగా సైగల్ పాట ప్రసారం అయ్యేది.అప్పుడు ఇష్టంగా వినకపోయినా సైగల్ పేరు చెబితే కొన్ని పాటలు గుర్తొస్తాయి.
సైగల్ పాటలు పాడే విధానాన్ని తర్వాతి గాయకులైన ముకేశ్, కిశోర్ కుమార్ తొలినాళ్ళలో అనుసరించారు.సైగల్ పా టల్ని,అతన్ని అభిమానించే తరానికి చెందినవారు ఇప్పుడు చాలా కొద్ది మంది ఉండుంటారు. తర్వాత తరాలకి చెందినవారికి సైగల్ సంగీతం గతకాలపు చరిత్ర కావచ్చు.కాని అది సినిమా సంగీతానికి పునాది. సినిమా సంగీత ధోరణుల పరిణామ అధ్యయనం కోసమైనా సైగల్ పాటలు వినాలి. ఐతే ఆ అధ్యయనం చేసేక్రమంలో సైగల్ మత్తులో పడే అవకాశాలు మెండుగా ఉన్నాయనిపిస్తుంది కొన్నిపాటలు వింటుంటే.
-ముళ్ళపూడి సుబ్బారావు