Showing posts with label dheere se ajaa re. Show all posts
Showing posts with label dheere se ajaa re. Show all posts

Thursday, February 8, 2018

ధీరేసే ఆజా రి అఖియన్ మే

‘నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-131
ధీరేసే ఆజా రి అఖియన్ మే
కన్నులపైకి నెమ్మదిగా రా
అల్బెలా(1951) సినిమాలో లతామంగేష్కర్,సి రామచంద్ర పాడిన పాటరాజేందర్
ర్ కిషన్ రచన. సి రామచంద్ర సంగీతం....
ఈ పాట ఉత్తరాన `లోరీ` అనబడే మన దగ్గరి జోల పాట. మనసుకి లోకపు మంచిచెడులు తెలియని పసిపిల్లలు జోలపాడితే తేలిగ్గా నిదురలోకి జారుకుంటారు. కలతచెంది ఉన్న పెద్దవాళ్ళను నిద్రపుచ్చటం అంత తేలికకాదు. ఆ జోలపాట బరువైనదై ఉండాలి.
కథానాయకునికి కళాకారుడవ్వాలని కలలున్నాయి. అవి తీర్చుకునేందుకు అనేక యత్నాలు చేస్తున్నాడు. అలా అలసిన అతను చెల్లెలు పాడిన జోలపాటలో సేద తీరాడు. రెండో చరణం వచ్చేసరికి కలలు నిజంచేసుకున్న అతను సంతృప్తితో ప్రేయసిని నిద్రపుచ్చటానికి పాడుతున్నాడు. చివరి చరణం బాధల్లొ ఉన్న చెల్లెలు అదే పాట పాడి తండ్రిని ఓదారుస్తుంది.
చితల్కర్ గా కూడా పిలవబడే సంగీత దర్శకుడు సి. రామచంద్ర ఒక తెలుగు సినిమాకు సంగీతమందించారు. ఐతే ఆ పాటలన్నీ కొత్తబాణీలే. కానీ అంతకుమునుపే అతని హిందీ బాణీల ఆధారంగా తెలుగులోవచ్చిన పాటలు వినిఉన్నాం. వాటిలో ఒక పాట ` నీలాల కన్నుల్లో మెల మెల్లగా`.నాటకాలరాయుడు సినిమాలోది.
ఆ సినిమా కు ఆధారం `అల్ బెలా` హిందీ చిత్రం ,పాటకు ఆధారం అదే సినిమాలోని ` ధీరె సే ఆజారే `

``కన్నులపైకి నెమ్మదిగా రా
నిదురా ! రా ! నెమ్మదిగా రా
చాటుగా కన్నుల తోటలోకి
నిదురా ! రా ! నెమ్మదిగా రా
సుందరస్వప్నాల మొగ్గలుతీసుకుని
వచ్చి కనుపాపల్లో బస చేయి
కనుపాపల చిరువీధుల్లో
నిదురా ! రా ! నెమ్మదిగా రా
చుక్కల నుండి చాటుగా , చుక్కలనుండి దొంగిలించి
ఈ రాత్రి చంద్రునికి జోల పాడు
చంద్రుడూ నిదురలో నవ్వుకుంటున్నాడు
కనులు మెలకువతో ఉంటాయి అదృష్టం నిద్రిస్తూఉంటుంది
అదృష్టం పేదవానికి విరోధి
ఒక క్షణం పేదవాని కుటిరానికి
నిదురా ! రా ! నెమ్మదిగా రా
కనులనేవి ఎవరికైనా ఒకేలా ఉంటాయి
ఉన్నావారికెలానో లేనివారికీ అలానే
అదృష్టం చాటేసిన కన్నులపైకి
నిదురా ! రా ! నెమ్మదిగా రా``
https://www.youtube.com/watch?v=8h94Qg1g-JI