Showing posts with label jagjit singh. Show all posts
Showing posts with label jagjit singh. Show all posts

Wednesday, February 7, 2018

హోష్ వాలోం కో ఖబర్ క్యా , బేఖుదీ క్యా చీజ్ హై

‘నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-130
``హోష్ వాలోం కో ఖబర్ క్యా , బేఖుదీ క్యా చీజ్ హై``
(మెలకువతో ఉన్నవారికేం తెలుసు మైమరపు అంటే ఏమిటో)
సర్ఫరోష్ (1999) సినిమాలో జగ్ జిత్ సింగ్ పాడిన పాట .జతిన్ -లలిత్ సంగీతం. నిదా ఫజ్లి రచన....
నిదా ఫజ్లి ,గుప్పెడు పాటలే సినిమాలకు రాసినా అవి గుప్పెడు గుండెను తట్టేవే. సంగీత దర్శకులు జతిన్ -లలిత్ లు సంగీత కుటుంబానికి చెందినవారే. పాటలు పాడిన నటి సులక్షణా పండిట్ సోదరులు వీరు.
ఎనభైలలో వచ్చిన కొన్ని సినిమాలలో జగ్ జిత్ సింగ్ గజళ్ళు చోటుచేసుకున్నాయి. సున్నితమైన అనుభూతులతో మనసును నెమ్మదిగా ఊయలలూపేవి అవి. అలాంటి అనుభూతిని 1999 లో మరోసారి ఈ పాటతో పొందగలిగాం. పాట చిత్రీకరణా అప్పటికి పాతకాలపుదే. కనపడేవి పాట వింటున్న కథానాయకుడి కాలేజి రోజుల జ్ఞాపకాలే.

``మెలకువతో ఉన్నవారికేం తెలుసు మైమరపు అంటే ఏమిటో
ప్రేమించు. అప్పుడు తెలుసుకో జీవితమంటే ఏమిటో
తనతో చూపు కలిసాక పరిసరాలు వెలుతురుతోనిండాయి
నేడే తెలుసుకున్నాను ప్రేమలో ఉన్న మాయ ఏమిటో
విడివడిన కురులు ఋతువుకు గీతాలు నేర్పాయి
వాలిన కన్నులు చెప్పాయి మద్యపానమహిమ ఏమిటో
తనతో మనసు ఉన్న స్థితి ని పెదవులతో చెప్పలేకపోయాను
తనూ అర్ధంచేసుకోలేక పోయింది మౌనమంటే ఏమిటో``

Sunday, June 4, 2017

‘తుమ్ ఇత్నా జో ముస్కురా రహే హో, క్యా గమ్ హై జిస్కో చుపా రహే హో’


నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-91

‘తుమ్ ఇత్నా జో ముస్కురా రహే హో, క్యా గమ్ హై జిస్కో చుపా రహే హో’
(నువ్వు ఇంతగా నవ్వుతూ ఉన్నావు,దాని వెనుక ఏమి బాధను దాచి వుంచావు?)

‘అర్ధ్  ‘(అర్ధం) సినిమాలో జగ్ జిత్ సింగ్ ఆలపించిన గజల్. సంగీతమూ ఆయనదే.
గజల్ రచయిత ‘కైఫి ఆజ్మి’. పాటలో కనిపించే ‘షబానా అజ్మీ’ ఆయన కూతురు.

సినిమా దర్శకుడు మహేశ్ భట్ మిగతా సినిమాలు టచ్ చేయకుండా వదిలేసిన (నగర)జీవిత పార్శ్వాలను స్పృశిస్తాయి. మొహమాటం లేకుండా ఎంచుకున్న కథాంశం పై సెర్చ్ లైట్ వేసినట్టు, ప్రయోగశాలలో ‘డిసెక్షన్ ‘ చేసినట్టు ఉంటాయి.

అర్ధ్ సినిమా అలాంటిదే. వివాహేతర సంబంధాలు,జీవిత భాగస్వాముల అభద్రతలు సినిమా కథ .
దేనితో మనసు ఖాళీ అయ్యిందో దానితోనే  (వివాహబంధం)  ఆ ఖాళీ నిండి తీరాల్సి లేదనే నిర్ణయానికి చివరకు కథానాయిక వస్తుంది.
భర్త  నమ్మకద్రోహంతో గాయపడిన ఆమెకు, మరొకరు స్నేహితుడయ్యాడు. అతనింటికి ఆమె అతిధిగా వెళ్లింది. ఆమె చిరునవ్వు వెనక విషాదాన్ని అతను గమనించాడు. ఆ సందర్భంలో పాటఇది .

ఇందులో ఆఖరి చరణం లో కైఫి ఆజ్మి,  విధి (ముకద్దర్)  గురించి చెప్పినదానిపై  నాకనిపించింది

మనం ఎదుర్కొనే సమస్యలు,సవాళ్ళు ,అనుభవించే వ్యధలు,చింతలు,కష్టాలు ..వీటన్నింటినీ రెంటిగా విడగొట్టొచ్చు. ఒక వర్గం. మనం మన చర్యల, ప్రయత్నాల ద్వారా మార్చుకోగలిగినవి. మరొక వర్గం . ఇవి మనని ప్రభావితం చేస్తుంటాయిగాని వాటిని మార్చగల శక్తి మనకుండదు.
అలాటి వాటిని ఏమిచేయాలి? ‘విధి’ కి వదిలిపెడితే కొంత ఓదార్పు దొరుకుతుందేమో! అదే ఇక్కడ చెబుతున్నాడనిపిస్తుంది.(సర్కిల్ ఆఫ్  ఇన్ఫ్లూయెన్స్,సర్కిల్ ఆఫ్ కన్సర్న్ లాగా???)


“నువ్వు ఇంతగా నవ్వుతూ ఉన్నావు
దాని వెనుక ఏమి బాధను దాచి వుంచావు?

కళ్ళలో తేమ, పెదవులపై నవ్వు
ఉన్న స్థితి ఏమిటి? పైకి చూపేది ఏమిటి?

కన్నీటిని దిగమింగుకుంటూ ఉంటే
మింగినకన్నీరు   విషమౌతుంది

కాలం మాన్పిన గాయాలను
నువ్వెందుకు తిరిగి రేపుతావు?

విధి అనేది చేతిగీతల ఆట
నువ్వు ఓడింది ఆ గీతల చేతిలోనే!”


Wednesday, March 29, 2017

 
'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-19
'యే తేర ఘర్ ..యే మేర ఘర్ ..హమారి ఘర్ హై ప్యార ఘర్ '
(సాత్ సాత్ సినిమాలో పాట. 'జగ్ జిత్ సింగ్'చిత్రాసింగ్' ఆలపించారు.)· 5 Januay
...
" నవ్విందంటే అధరం వరకే
చెప్పిందంటే నా చెవి వరకే
నడిచిందంటే వాకిలి వరకే
కోపం వచ్చిందంటే కొద్దిపాటి మౌనం వరకే"
సంసారం ఒక చక్కని వీణ, సంతోషం ఒక కమ్మని రాగం అవ్వాలంటే భార్య భర్తతో పైన చెప్పినట్టు ఉండాలని ఈ తెలుగు పాట చెబుతుంది.
కొన్ని పాటలు తెలియకుండానే కొన్ని భావాలను నాటేస్తాయి లేదా భావాల్ని బలపరుస్తాయి.
కొన్ని అత్యాశలన్ని కల్పిస్తాయి. కొన్ని పాటలు నిజంచేసుకునే అవకాశమున్న కలల్ని కనిపిస్తాయి.
పైన చెప్పిన పాట ఒక అత్యాశ.
ఒక అందమైన కల ఈ కింది పాట.
ఆదర్శం, వాస్తవం, వాస్తవాన్ని ఎదుర్కోవటంలో ఆదర్శాన్ని వదులుకోవడం,దానిద్వారా కొన్ని కోల్పోవటం, పొందినవి,పోగొట్టుకున్నవి బేరీజు వేసుకుని వెనక్కి చూసుకుని తిరిగి జీవితం మొదలు పెట్టటం...ఈ కథతో సాగే సినిమా సాత్ సాత్.
హీరో గ్రామీణభూస్వామిక కుటుంబానికి చెందినవాడు.అక్కడి వ్యవస్థ తో విబేధించి కొన్ని ఆదర్శాలతో నగరానికొచ్చాడు.స్థితిపరురాలైన అమ్మాయి ఇతనిని,ఇతని ఆదర్శాలను ఇష్టపడింది.పెద్దవారిని కాదని పెళ్ళీ చేసుకున్నారు.ఒక అద్దె ఇంటిలో నివాసం. ఈ పాట ఆ సందర్భంలో.
“ఈ నీ ఇంటిని నా ఇంటిని ఎవరైనా చూడాలనుకుంటే
వచ్చి ముందుగా నీకళ్ళను నాకళ్ళను అడగాలి
(మన కళ్ళతో ఇంటిని చూడాలి)
ఈ మన ఇల్లు ఎంతో సుందరమైనది
మేఘాలనంటేంత ఎత్తైనదేమీ కాదు
వెన్నెల పల్లెల్లో కట్టిందేమీ కాదు
పూలదారులేమీ దీనికోసం వేయలేదు
కాని ఈ ఇల్లు ప్రత్యేకమైనది
నేలను అట్టిపట్టుకుంది
ఇది ఇటుకలు,రాళ్ళతో కట్టింది
మా కోరికల రూపం ఈ ఇల్లు
వెన్నెలలు విరియకపోతేనేమి
ప్రేమ వెలుగులు నిండివున్నాయి
మనసులో పూలు విరబూసి ఉన్నాక
వసంతం రాదని బెంగెందుకు?
అరువుతెచ్చుకున్న ఆనందం మా ఇంటికి ఎప్పుడూ రాదు
మాది చింతలులేని ఇల్లు
మాది ఇష్టాలతో నిండిన ఇల్లు”
ఇక్కడ నమ్మకమనే సుగంధం, ప్రేమ అనే రంగులు ఉన్నాయి
ఈ ఇల్లు నీ స్వప్నం,నా ఆనందం
ఆశలపై ఆంక్షలు లేవు,ఉత్సాహానికి అడ్డుకట్టలేదు
మన ఆకాంక్షలకు భరోసా ఇచ్చే ఇల్లు
మనకు ధైర్యాన్నిచ్చే ఇల్లు