Showing posts with label kuch khta hai sawan. Show all posts
Showing posts with label kuch khta hai sawan. Show all posts

Wednesday, March 29, 2017

'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-11  'కుచ్ కెహతా హై సావన్

 సాఫ్ట్ వేర్ కు లో వెర్షన్ 1,2,3 ఇలా ఉంటాయిగా. సాధారణంగా కొత్త వెర్షన్ పాతదానికన్నాఎక్కువ ఫీచర్లతో పాతవాటిని మించివుంటుంది.ఈ వెర్షన్లు సాఫ్ట్ వేర్ కే కాదు సినిమాలకూ వుంటుందనిపిస్తుంది కొన్నిసినిమాలు చూస్తే.
అలాంటివి చాలానే వుంటాయి.అందులో ఒక సినిమా.
ఒక దొంగను పోలీసులకు పట్టించి అతనికి 6నెలలు జైలుశిక్ష పడేట్టు చేశాడొక మాజీసైనికుడు.శిక్ష పూర్తయ్యాక అతనికి పని ఇస్తానని తనవూరికి పిలిపించుకున్నాడు. బొమ్మాబొరుసువేసి నిర్ణయంతీసు...కుని వూరుకివెళ్ళాడుదొంగ. ఆవూరిలోనే సేద్యంచేస్తూ అక్కడ ఓ అమ్మాయి తో ప్రేమలో పడతాడు.,హీరోయిన్ కి తుపాకి కాల్చటం నేర్పేమిషతో హీరో రొమాన్సు. ఆ వూరికి ఓ బందిపోటు బెడదవుంది.ఓ పిల్లవాణ్ణి,ప్రేయసి తండ్రిని బందిపోటు చంపేసాడు. అపుడు దొంగ బందిపోటు తో తలపడ్డాడు. బందిపోటు కు దొరికిపోయాడు. దొంగని బందిపోటు బంధిస్తే ఒకామె పాట పాడి దొంగని విడిపించింది. చివరికిహీరో గ్రామస్తులతో కలిసిబందిపోటుని చంపేసాడు.
ఛాలా తెలిసిన కథ ,షోలే లో ఒక హీరో పాత్ర తగ్గించిచెప్పినట్టుంది కదా.
షోలే కన్నా నాలుగేళ్ళ ముందు వచ్చి సక్సెస్ ఐన సినిమా ‘మేరా గావ్ మేరా దేశ్’
కొంత మైదాన ప్రాంతం,చిన్న చిన్న గుట్టలు,,పంటపొలాలు,ఎద్దులబళ్ళు, యేటిగట్లు,మోటబావులు,చిన్న చిన్న దేవాలయాలు,పనిపాటల్లో మునిగుండే జనాలు,తిరణాలు ,జాతర్లు,అందులో వినోదాలు, వీటికి కాంట్రాస్ట్ గా బందిపోటు స్తావరం వీటితో పాటు ,హీరోయిన్,వాంపుల తో సూపర్ హిట్ గీతాలు. దేహధారుఢ్యంతో హీరో,భయంకలిగించే హాండ్ సం విలన్, పిల్లాడ్ని పోగొట్టుకుని మతి స్థిమితం తప్పిన తల్లి ,హీరో విలన్ల ంఅధ్య భీకరమైన పోరు,చివరికి చెడుపై మంచి విజయం. వీటన్నింటినీ చక్క పేర్చిన సినిమా.

షోలే సినిమా వెర్షన్ 2 అనుకుంటే మేరాగావ్ మేరాదేశ్ వెర్షన్ 1.కొన్ని వెర్షన్లు మనని మన అవసరాలన్నీ తీర్చి ఆకట్టుకుంటాయి. నావరకూ ఆఫీస్ 97.’మేరా గావ్ మేరా దేశ్’ కూడా అలాంటిదే.
సినిమాను మళ్ళీ గమనించినపుడు.....మొదటి ఫ్రేం లోనే ఒక కోట్ కనపడుతుంది ..‘పిరికితనం, హింస ..ఈ రెంటిలో ఎన్నుకోవల్సి వస్తే హింసనే ఎన్నుకుంటాను’ . ఈ కోట్ మహాత్మా గాంధీ ది.
ఒక అనాధ..దొంగగా..రైతుగా..ప్రేమికునిగా..రక్షకునిగా..నాయకునిగా పరిణామంచెందాడు. ఏమి చెబుతుంది సినిమా? సంస్కరణ గురించా..మాజీ సైనికుడి ద్వారా కథానాయకుడు సంస్కరింపబడ్డాడా? గాంధీ తత్వం ఈ పక్కా మాస్ సినిమాకు ఆధారమయ్యిందా.
కురసావా’సెవెన్ సమురాయి’ ఆధారంగా ‘మాగ్నిఫిషెంట్ సెవెన్’, వీటి ఆధారంగా కొన్నిహింది సినిమాలు వచ్చాయి.
ఐతే మేరా గావ్ ...నేటివిటీ పరంగా ఉత్తర భారతదేశానికి చాలా దగ్గరగా ఉన్నట్టనిపిస్తుంది.
ఇందులోపాట 'కుచ్ కెహతా హై సావన్ .పచ్చటిచెరుకుతోటలు,మోటబావి,ఉయ్యాల,నీలకాశం, తెలిమబ్బులు... ఋతువర్ణన,పాటలుపాడే సెలయేళ్ళూ,తూరుపుగాలి,ఛణఛణమోగే గజ్జెలు,...ఒక ఆనందకరమైన వాతావరణాన్ని కళ్ళకు,చెవులకు అందిస్తూసాగుతుంది

: ముళ్ళపూడి సుబ్బారావు