Showing posts with label lag ja gale me phir. Show all posts
Showing posts with label lag ja gale me phir. Show all posts

Wednesday, March 29, 2017


'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-24 'లగ్ జా గలె కి ఫిర్ యె హసీన్ రాత్ హో న హో’  15 January
పాట వింటూ సంగీత దర్శకుడిని నేను గుర్తుపట్టగల సంగీత దర్శకులలో మదన్ మోహన్ ఒకరు.నాకు తెలిసి శారీరక ధారుఢ్యత(బాడీ బిల్డింగు) పట్ల ఆసక్తి ఉన్న సంగీత దర్శకుడు మదన్ మోహన్ ఒక్కడే. సున్నితమైన గాన విశేషం 'ఘజల్ 'ను హిందీ చిత్రసంగీతంలో బాగా వినిపించిందీ మదన్ మోహనే.ఇతనికి రావలసినన్ని అవకాశాలు రాకపోవటానికి కారణం ఇతను సంగీతం ఇచ్చిన సినిమాలు విజయవంతం కాకపోవటమంటారు. అదేసమయంలో ఆ సినిమాలు ఫెయిల్ అయ్యాయికాని అతని సంగీతం ఫెయిల్ కాలేదంటారు. ఆవిషయం లో నాకు అంగీక...ారముంది.
ఇతని సంగీతంలో ఇతని ముద్ర ముందుకువచ్చి తెలుస్తుంది. అదే అతనికి లిమిటేషన్ అయ్యిందేమో తెలియదు. సినిమాసంగీతంలో లోతైన అభిరుచి వున్న చాలామంది తామెవరి అభిమానులైనా మదన్ మోహన్ సంగీతాన్ని అభిమానించడం నా అనుభవంలోకి వచ్చిన విషయం.
ఈయన సంగీతదర్శకత్వంలో రాజా మొహ్ది అలిఖాన్ రచిచంగా లతా పాడిన ఒక పాట
‘లగ్ జా గలె కి ఫిర్ యె హసీన్ రాత్ హో న హో’
(ఈ అందమైన రేయి జీవితంలో మరో సారి వస్తుందో రాదో ..హృదయానికి హత్తుకో.)

కొన్ని పాటలు కాలాన్ని ఆగిపొమ్మంటాయి.'రుక్ జా రాత్ టెహర్ జారే చందా','రేయి ఆగిపోనీ! రేపు ఆగిపోనీ! ఈ ప్రేమ వాహిని ఇలా సాగి పోనీ!' వాటిలో కొన్ని.
ఐతే ‘లగ్ జా గలే ‘పాట పాట రేపటి మీద ఆశలేనట్టు, ఈ క్షణమే జీవితానికి ఆఖరు అని తలుస్తూ ఈ క్షణాలనే జీవితకాలపు అనుభూతులు చేసుకొమ్మన్నట్టు చెబుతుంది.
“ఈ అందమైన రేయి జీవితంలో మరో సారి వస్తుందో రాదో ..హృదయానికి హత్తుకో.
ఈ జన్మలొ మరో కలయిక ఉంటుందో ఉండదో?
మనకీ రోజు అదృష్టవశాన ఈ సమయం దొరికింది
దగ్గరగా మనసారా నన్ను చూసుకో
ఇలాంటిది మరోసారి నీకు రాసిపెట్టి ఉందోలేదో?
దగ్గరకు రా..నేను మళ్ళి మళ్ళీ రానేమో?
నన్ను బాహువుల్లోకి తీసుకొని నన్ను తనివితీరా రోదీంచనీ
కళ్ళనుండి తిరిగి ఈ ప్రేమవర్షం కురుస్తుందో లేదో?”
-ముళ్ళపూడి సుబ్బారావు