Showing posts with label prem parbat. Show all posts
Showing posts with label prem parbat. Show all posts

Sunday, October 4, 2020

ये दिल और उनकी, निगाहों के साये

ये दिल और उनकी, निगाहों के साये

నటుడు ఎమ్.బాలయ్య మంచి అభిరుచి కలిగిన నిర్మాత. విభిన్న కథాంశాలతో సినిమాలు తీసాడు. చెల్లెలి కాపురం,నేరము-శిక్ష, అన్నదమ్ములకథ, ఈనాటిబంధం ఏనాటిదో, ప్రేమ పగ ,  చుట్టలున్నారు జాగ్రత్త  వాటిలో కొన్ని . చిత్రాలన్నింటిలోనూ సంగీతానికి ప్రాధాన్యతనిచ్చాడు. మొదటి రెండు సినిమాలకు  కె విశ్వనాథ్ దర్శకుడు.  కేవి మహదేవన్, ఎస్. రాజేశ్వరరావు (మూడు సినిమాలకు), ఎమ్ ఎస్ విశ్వనాథన్ వంటి లబ్ద ప్రతిష్టులతో సంగీతం తీసుకున్నాడు.


'ఈ నాటి బంధం ఏనాటిదో'  సినిమానాటికి కృష్ణ పూర్తిస్థాయి కమర్షియకల్ హీరో గా ఉన్నాడు. ఐతే ఈ సినిమాలో అతని పాత్రలో గొప్ప హీరోయిజమ్ తో కూడిలేదు. సినిమా జయప్రద చుట్టూ తిరుగుతుంది, అల్లు రామలింగయ్య పాత్ర కూడా ప్రాముఖ్యతతో కూడినదే. కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కానిఈ సినిమా పాటలద్వారా ఎక్కువ గుర్తింపు పొందింది. దేవులపల్లి కృష్ణ శాస్త్రి -ఎస్ రాజేశ్వర రావులు అందుకు కారకులు. సినిమాలో ఒక  పాట సుశీల పాడిన 'ఎవరికి చెప్పేది ఏమని చేప్పేది ' . ఆ పాట పై నిర్వివాదంగా హిందీ పాట 'ఏ దిల్ ఔర్ ఉన్ కి' పాట ప్రభావం ఉంది. ఆ పాట తెలుగునాటనూ బహు ప్రసిద్ధం.

లతా పాడిన హిందీ పాట 'ప్రేమ్ పర్బత్' (1973)సినిమా లొది. స్వరకర్త 'జై దేవ్' , గీతకారుడు 'జాన్ నిసార్ అఖ్తర్'. సినిమా దర్శకుడు,రచయిత  వేద్ రాహి డోంగ్రీ భాష లో పేరున్న రచయిత. ప్రేమ్ పర్బత్ సినిమా ఇపుడు అందుబాటులో ఉన్నట్టులేదు

*********
అతని చూపుల నీడ నా మనసుపై వాలితే 
అతని చేతులు నన్ను చుట్టుముట్టినట్టుంటుంది.

చంచలించే సూర్యకిరణాలు పర్వతాలను ముద్దాడుతున్నాయి
గాలికెరటాలు నదులతనువుల్ని ముద్దాడుతున్నాయి
ప్రతీచోటా ప్రేమ నీడలు పరచుకున్నాయి

చెట్టు కొమ్మల్ని దట్టమైనమేఘాలు పెనవేసుకున్నాయి
ఒక్కక్షణం కాంతివంతం , మరోక్షణం అంధకారం
 చల్లని  నీడలతో దారులు నిండాయి


గుండె స్వేచ్చగా కొట్టుకుంటుంది
ఈ  ప్రకృతిని అనుకరిస్తూ
వర్ణమయ ప్రేమ ఛాయలు పరచుకున్నాయి

**** 
ఎవరో ఔత్సాహికులు ఈ పాటను  వైజయంతి మాల (మధుమతి సినిమా) విజువల్స్ తో కలిపారు.