Showing posts with label prem pujari. Show all posts
Showing posts with label prem pujari. Show all posts

Wednesday, March 29, 2017

షోఖియోమె ఘోలా జాయ్ ఫూలోంకా షబాబ్


'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-57’
“షోఖియోమె ఘోలా జాయ్ ఫూలోంకా షబాబ్ “26 March at 18:08

(‘చిలిపిదనాన్ని పూలలోని యవ్వనం తో రంగరించు’)
...
ప్రేమ్ పుజారి సినిమాలో కిశోర్ కుమార్,లతా మంగేష్కర్ పాడిన పాట.
దేవానంద్ సోదరులిద్దరు (చేతన్ ఆనంద్,విజయ్ ఆనంద్) చిత్ర దర్శకులు.దేవానంద్ తో సొంత బానర్ పై హిట్ సినిమాలు తీశారు.తర్వాత రోజుల్లో దేవానంద్ స్వయంగా దర్శకుడయ్యాడు.అలా దర్శకత్వం చేసిన మొదటిసినిమా ప్రేమ్ పుజారి.సినిమాలో అన్నీ హిట్ పాటలే.దేవానంద్ ఎక్కువ సినిమాలకు సంగీతమిచ్చిన ఎస్.డి.బర్మన్ దీనికీ సంగీతం ఇచ్చారు.అలాగే నీరజ్ గీతరచన కూడా.
సినిమా కథానాయకుడు సున్నిత హృదయుడు.హింస అంటే ఇష్టం లేనివాడు.తన గ్రామసీమల్లొ ,పంటపొలాల్లో ప్రకృతిని, అన ప్రేయసిని ప్రెమిస్తూ తిరుగుతుంటాడు.ఊరిలో జరిగే కోడిపందేలవంటివి కూడా అతనికి గిట్టవు.తగువులు ఇష్టం లేవు. అతని తండ్రి మిలటరీలో ఉండి యుద్ధంలో కాలు పోగోట్టుకుని ఉన్నాడు.సైనికుడిగా తన వారసత్వం కొడుకు తీసుకోవాలనుకుంటున్నాడు.
వూరిలో గొడవల్లోనే తలదూర్చనివాడు దేశాలమధ్య జరిగే యుద్ధంలోపాల్గొనాలి. సీతకోక చిలకల్ని పట్టుకుంటూ కాలంగడిపేఅతను తుపాకి పట్టుకోవాల్సి ఉంటుంది. బలవంతంగా మిలటరీలో చేరిన అతని జీవితం ఎన్నో మలుపులు తిరిగింది.
ఈ పాట కథనాయకుడు మిలటరీ లో చేరకముందు ప్రేయసితో ఆటపాటల్తో ఉన్నప్పటిది.అతను సీతాకోక చిలుకల ను పట్టటానికి వలతో వున్నాడు.పంటపొలాల్లో,గడ్డివాముల్లో,విశాలమైన మైదానాల్లో ఆమె తో విహరిస్తున్నాడు. ప్రేమంటే ఏమిటో,ఎలా ఉంటుందో ఒకరికొకరు చెప్పుకుంటున్నారు.సీతాకోక చిలకను బంధించటంలో ఉన్న హింస అతనికి అర్ధమైనట్టు లేదు.
‘చిలిపిదనాన్ని పూలలోని యవ్వనం తో రంగరించు
దానికి కొద్దిగా మధువు కలుపు
నిషా అనేది అలా తయారౌతుంది
ఔను..నిషా అనేది అలా తయారౌతుంది...అదే ప్రేమ
అది చిన్నప్పటి నవ్వు,పొంగిపొర్లే ఋతు సౌందర్యం
కవ్విస్తే మంటలాంటిది...కోరితే మంచులాంటిది.
వూరిలోనూ,జాతరలోనూ,దారిలోనూ,ఒంటరితనంలోనూ
పదే పదే గుర్తుకొస్తుంటే ..అదే ప్రేమ
రంగులో కరిగిన బంగారం,రూపంలో మకరందం
రాత్రుల్లో సుతిమెత్తగా మోగే వాద్యంలా వుండేది.
ఎండలో, నీడలో ,తిరుగాడే గాలుల్లో
ప్రతి క్షణం చూసే ఎదురు చూపు..అదే ప్రేమ
అదిగనుక గుర్తొస్తే ...ఒంటరితనం ఎలా దూరమౌతుందంటే
శూన్యమైన నగరంలో షెహనాయి మోత మొదలైనట్టు
వస్తునా ,వెళ్ళిపోతున్నా ,లోకమెటు పోతున్నా
ఎప్పటికీ తగ్గని నిషా...అదే ప్రేమ”

-ముళ్ళపూడి సుబ్బారావు