Showing posts with label sajjad ali. Show all posts
Showing posts with label sajjad ali. Show all posts

Wednesday, March 29, 2017


'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-32’'మేరే మహబూబ్ కయామత్ హోగీ'.31 January
ఇప్పటి ప్రముఖ పాకిస్తానీ గాయకుడు 'సజ్జద్ అలి ' హిందీ సంగీత ప్రియులకు తెలిసిన పేరే. మహాగాయకులైన బడే గులాం అలిఖాన్,మెహ్దీ హసన్,గులాం అలి వంటి వారి పాటల్ని పదమూడేళ్ళవయసులోనే తిరిగి పాడి అల్బం వెలయించి పేరుతెచ్చుకున్నాడు.
బహుశా అదేకారణంతో కావచ్చు అతనికి ప్రముఖ హిందీ గాయకుల పాటలు తిరిగి పాడే అవకాశం వచ్చింది.
ఆ అవకాశం వెనుక కథ.......
ఎనభైల మొదట్లో సుమారు 500 రూపాయిల ఖరీదుతో టేప్ రికార్డర్లు సామాన్యజనానికి అందుబాట్లోకి వచ్చాయి.ఎల్.పి,ఇ.పి రికార్డులనుండి కాసెట్టు మీదికి రికార్డింగు చేసే సెంటర్లు వొచ్చాయి. ఖరీదు పరంగానూ,అందుబాటు పరంగానూ కాసెట్టులు ప్రజల అవసరాలను తీర్చేవికావు.సోనీ వాక్ మాన్ వంటివు వున్నవారివంక ఆరాధన గా చూసే రోజులవి. ఢిల్లీ మార్కెట్లో వాక్ మన్ కు ప్రత్యామ్నాయ ప్లేయర్లు 350 రూపాయలకి దొరికేవి. ఐతే దానిలో ప్లే చేసుకోవటానికి హెచ్.ఎం.వి వారి కేసెట్ కొనాలంటే నలభై రూపాయలపైనే.పది గంటలకు సరిపడా కేసెట్లు కొనాలంటే ప్లేయర్ ను మించి ఖరీదు.ఏతా వాతా ..కేసెట్ల డిమాండ్ కు సరిపడా సప్లై లేదు. సప్లై చేయాల్సిన వారు సినిమా పాటలమీద ఇంచుమించు మోనోపలీ ఉన్న హెచ్.ఎం.వి వారే. మరి వారి అప్పటి స్ట్రేటజీ ఏమిటోగాని మార్కెట్లోనైతే బోలెడంత గేప్.

ఎన్ని చిన్నచిన్న ప్రయత్నాలు జరిగాయోగాని చాలా తక్కువ రేట్లకు సినిమా పాటలు అందసాగాయి. టి.సీరీస్,ఎస్ సి ఐ (సుపర్ కాసెట్ ఇండస్ట్రీ)పేరుతో 15రూపాయలకే కాసెట్ దొరికేది.అందులో పాటలు ఒరిజినల్ సింగర్స్ వి కావు.అదేసంగీతం,దగ్గరదగ్గర అదే స్వరంతో తిరిగి పాడించిన పాటలు.ఐతేనేం అసలు దొరకనిదానికన్నా మంచిదేగా!ఆ పాటలకి జనాలెంత అలవాటు పడిపోయారంటే అవే అసలు పాటలనేటంత.
అలా ప్రజలకు దగ్గరైన గాయకుడు ‘సజ్జద్ ఆలి’. ఒరిజినల్ గాయకుడు రఫీఐనా,ముకేశ్ ఐనా,కిశోర్ ఐనా,చివరికి లతా మంగేష్కర్ ఐనా ..సజ్జద్ అలి తనగొంతుతోనే పాడి ఒక తరహా ప్రజల్ని అలరించాడు.
టి సిరీస్ ఓవర్ నైట్ పెద్ద సంగీత సంస్థ ఐపోయింది, ఒరిజనల్ సింగర్లకు మరింత దగ్గర స్వరం వున్న గాయకుల్ని వెతికి 'ఇంచుమించు సరిపాటి ' అనేలా కాసెట్లు మార్కెట్ చేసింది. హెచ్.ఎం.వి నిద్రలేచి కాపీ రైటు చట్టం తిరగేసేలోపే అందులో ఉన్న కొన్ని సెక్షన్ల వెనక టి సిరీస్ దాక్కుంది.
హెచ్.ఎం.వి చౌకగా కాసెట్లు ఇవ్వటం ప్రారంభించేలోపే టి సిరీస్ పద్ధతిలో వీనస్,టిప్స్ సంస్థలు సంగీతోత్పత్తి ప్రారంభించాయి.
మార్కెట్లో ఉన్న చిన్న ఖాళీ గమనించి దానిని పూరించి సంస్థ గా ఎదిగిన టి సిరీస్ తర్వాత సంగీతంతో పాటు అనేక వ్యాపారాల్లోకి డైవర్సిఫై అయ్యింది.
టీ వీలూ, ఫాన్లు, గృహోపకరణాలు,సినిమా నిర్మాణం,చివరకు భక్తి మార్కెట్ ను కూడా వదిలి పెట్టలేదు.
ఇందులో ఐరనీ ఏమిటంటే మొదట్లో తాను ఎలాంటి పెద్ద సంస్థను గురిపెట్టిందో అలాంటి సంస్థగానే తాను మారటం. దాని ముగింపు ఎటు దారి తీసిందో 'నిన్నటి చరిత్రే '
'సజ్జద్ అలీ పాడిన కిశోర్ కుమార్ పాట 'మిస్టర్ ఎక్స్ ఇన్ బోంబే' లో'మేరే మహబూబ్ కయామత్ హోగీ'. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీతం,ఆనంద్ బక్షి రచన. చిత్రీకరణ ఒరిజినల్ సినిమా పాటపైనే.
-ముళ్ళపూడి సుబ్బారావు