Showing posts with label umrao jan. Show all posts
Showing posts with label umrao jan. Show all posts

Wednesday, March 29, 2017

ఇన్ ఆంఖొం కి మస్తి కె మస్తానె హజారోం హై

’ఇన్ ఆంఖొం కి మస్తి కె మస్తానె హజారోం హై’20 March at 18:10
(ఈ కళ్ళ లోని మత్తుకు మైకంలో మునిగారు వేలకొద్దీ)
...
(ఉమ్రావ్ జాన్ సినిమాలో పాట. షహర్యార్ రచన ఖయ్యాం సంగీతం, ఆశా భోన్ స్లే గానం)
80ల ప్రారంభకాలంలో ఉమ్రావ్ జాన్ పాటలు బాగా వినపడుతుండేవి. పాటలు మందంగా నడిచేతీరూ, సాధారణంగా వినె హిందీ పాటల్లో వుండే సంగీతవాద్యాలకు భిన్నమైనవేవో ఉపయోగించినట్టుందే సంగీతం.సినిమా వచ్చిన పుష్కర కాలంతర్వాత సినిమా చూసాను. ఆ మధ్యకాలంలో పాటలు మరింత దగ్గరైనాయి.
సినిమా 'మీర్జా హది రుసువా' ఉర్దూ నవల 'ఉమ్రావ్ జాన్ అదా ' (తెలుగు అనువాదం లభ్యం) ఆధారంగా తీయబడింది. లక్నో ప్రాంత ముస్లిం రాజవంశానికి చెంది 'ముజాఫర్ అలి ' ఈ చిత్ర దర్శకుడు.
1850 ప్రాంతాలకు చెందింన దేవదాసి(?)వంటి స్త్రీజీవితం చెప్పే కథ .కథా స్థలం అవధ్ రాజధాని లక్నో.సిపాయి తిరుగుబాటు కు కొద్ది ముందు కాలం.సంధికాలం,సందిగ్ధకాలం ..అప్పటి సాంస్కృతిక,సాంఘిక వాతావరణం..వీటిని ఉమ్రావ్ జాన్ జీవితంద్వారా సినిమాలో చూడగలం.
ఉమ్రావ్ జాన్ జీవితంలో ఒక అంకం నవాబ్ తో ప్రేమ, దాని వైఫల్యం.
ఉమ్రావ్ జాన్ సంగీత నృత్యాలకు రసజ్ఞుడైన నవాబ్ ఆకర్షింపబడ్డాడు.చాటుగా ఆమె నృత్యగానాలను చూడటానికి వస్తున్నాడు. వాటిని అస్వాదిస్తూ పరవశుడౌతున్నాడు.
ఆ సందర్భంలో 'ఇన్ ఆంఖొం కి మస్తి కె మస్తానె హజారోం హై ‘పాట వస్తుంది.
ఆమె తన కళ్ళు కలిగించగల మైమరుపు ను, తన కళ్ళ నే మధుపాత్రలు గా చేయగలగటాన్నితెలియజేస్తుంది , తను దీపమైతే అందులో పడి కాలిపోయే దీపపు పురుగులు అనేకమందని చెప్పుకుంటుంది.
పాట చిత్రీకరణలో నృత్యం (కథక్?) మరీ ఎక్కువ లేదు.ఎక్కువ భాగం క్లోజ్ అప్ దృశ్యాలే.పాట అర్ధాన్ని తెరపై ఆమె ముఖంలో చూడగలం.
“ఈ కళ్ళ లోని మత్తుకు
ఈ కళ్ళ లోని మత్తుకు మైకంలో మునిగారు వేలకొద్దీ
ఈ కళ్ళతో ప్రేమకథలు అల్లబడ్డాయి వేలకొద్దీ
నీవొక్కడివే కాదు
నీవొక్కడివే కాదు నా మీద ప్రేమతో నింద పడ్డవాడవు
ఈనగరంలో నీలాంటి వెర్రివాళ్ళు వేలకొద్దీ
నేనొక్కదాన్ని మాత్రమే మధువును
నేనొక్కదానిని మాత్రమే మధువును కళ్ళతో తాపుతాను
చెప్పటానికి లోకంలో మధుశాలలు వేలకొద్దీ
ఈ దీపాన్ని గాలివాన పేరుతో భయపెడుతున్నావు
ఈ దీపానికి ఆకర్షింపబడే శలభాలు వేలకొద్దీ”
-ముళ్ళపూడి సుబ్బారావు