Showing posts with label ye daulat bhi lelo. Show all posts
Showing posts with label ye daulat bhi lelo. Show all posts

Wednesday, March 29, 2017

'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-34’
'యే దౌలత్ భి లేలొ,యే షొహరత్ భి లేలొ '4 February

  (ఈ సంపదలు తీసేసుకో,ఈ కీర్తి,కిరీటాలు తీసేసుకో)
(గానం జగ్జిత్ సింగ్ & చిత్రా సింగ్, సుదర్శన్ ఫాకిర్ రచన)
ఈ పాటను తొలిసారి 86 లో విన్నాను.నా మరాఠీ మిత్రుడు వినిపించాడు.గాయకులు జగ్జీత్ సింగ్, పంకజ్ ఉధాస్ లు 'ఆధునిక ' గజల్ ను వ్యాప్తిలోకి తెస్తున్నకాలం.ఈ పాట గజల్ ఔను కాదు అనేవారున్నారు.నాకు ఇది గజల్ అనిచెప్పి వినిపించారు.ప్రక్రియ తో సంబంధంలేకుండా ఈ పాట నన్ను ఆకట్టుకుంది.ఆకర్షిస్తూనే ఉంది....
సొంతింటికి,మనుషులకు,వూరికి తపాలా అందేకాలంలెక్కేస్తే ఐదు రోజుల దూరం,రైలు ప్రయాణం లెక్కేస్తే 20 గంటల దూరం.ఫోను అనేది ఆలోచనకే అందనంత ఖరీదు.సొంతప్రపంచం విస్తృతం అవ్వని రోజులు నాకు.

బాల్యానికి దూరం అప్పటికే అయ్యాను.జీవన పోరాటానికి సన్నధ్ధం ఔతున్నాను.వెనక్కి చూసినప్పుడు బెంగ,ముందుకు ఆలోచిస్తే భయం. అలాంటి మానసిక స్థితి లో ఉన్నప్పుడు విన్నపాట ఇది.
“ఈ సంపదలు తీసేసుకో
ఈ కీర్తి,కిరీటాలు తీసేసుకో
ఇంకా చాలదంటే ఈ యవ్వనాన్ని లాగేసుకో
కానీ నా చిన్ననాటి వానాకాలాన్ని..
ఆ కాగితపు పడవను, వాననీటిని వాపసు ఇవ్వు.
వీధిలో పాతకాలపు గురుతులా ఆ ఇల్లు
పిల్లలందరం బామ్మ అనిపిలిచే ఆ ముసలామె
ఆ బామ్మ మాటల్లోపటి కల్పితకధల మజిలీ
ఆమె ముఖంలో ముడతలు చెప్పే శతాబ్దాల కథలు
మరువలేదు..ఎవరూ మరువలేరు
ఆ చిన్నచిన్న రాత్రులు..పెద్ద పెద్ద కథలు
ఆ కాగితపు పడవ, వాన నీరు
ఎర్రటి ఎండలో ఇంటినుండి బయటపడటం
పిట్టలు,కోయిల్లు,సీతాకోక చిలుకలు..వీటి వేట
బొమ్మలపెళ్ళిలో కయ్యాలు,జగడాలు
ఉయ్యాల్నించి పడటం,పడుతూ సంబాళింపు
రాగి రింగుల చక్కటి బహుమతులు
విరిగిన గాజుల గురుతులు
ఆ కాగితపు పడవ, వాన నీరు
ఇసుక గుట్టల ఎత్తుల ఆరోహణలు
బొమ్మరిళ్ళు కట్టటం వాటిని తొక్కి పాడుచేయటం
ఆ అమాయక కోరికల చాయాచిత్రాలు
ఆ ఆటబొమ్మల,కలల నా జాగీరు
ప్రాపంచిక బాధలు,బంధుత్వపు బంధనాలు ఉండవు
ఎంతో అందమైన లోకం
ఆ కాగితపు పడవ, వాన నీరు”
ఈ పాట గుర్తుచేసే వివరాలు ఎన్నోకొన్ని చాలామందికి అనుభవం అయ్యి ఉంటాయి.
బాల్యంఅందమైనదో,ఆనందమైనదో కావటానికి కారణం అప్పటి మన బరువును ఎవరో మోస్తుండటం కావచ్చు. దేనికీ పూచీ లేని bratuku ఎప్పటికీ బ్రతకాలనుకోవటం అత్యాశో,అతి స్వార్ధమో కూడా అనిపిస్తుంది.
----ముళ్ళపూడి సుబ్బారావు