.'అజీబ్ దాస్తా హై యే '
(ఇది చిత్రమైన కథ)
సినిమా’ దిల్ అప్నా ఔర్ ప్రీత్ పరాయి’ ,శైలేంద్ర రచన,శంకర్ జైకిషన్ సంగీతం,లతామంగేష్కర్ గానం,
'ఇంకావుంది చాలాదూరం '(భట్టిప్రోలు కృష్ణమూర్తిరచన?) అనే చిన్న నవల 85/86 లో చదివాను.ఒక యువ సివిల్ సర్వెంటు ఉద్యోగజీవితం వర్ణించేకథ.వ్యక్తిత్వం,సిన్సియారిటీ ఉన్నఅతను ఏజన్సీ ఏరియాలో ఐటిడిఏ(?) వంటిప్రాజెక్ట్ లో పనిచేస్తుంటాడు.ఐతే ఆకథ అతనుచెప్పడు.అతనికంటే చాలా తక్కువ స్థాయిల్లో పనిచేస్తున్న యువతి దృష్టికోణం నుంచి కథ నడుస్తుంది.ఆమే అతని చిన్నప్పటి నేస్తమేకాని అతనికాసంగతి తెలియదు.ఆమె అవ్యక్త ఆరాధన చదవరులకు అర్ధమౌతూ ఉంటుంది.
ఎందుకోఆ నవల అప్పుడపుడు గుర్తుకొస్తుంది.'అజీబ్ దాస్తా హై యే 'పాటచూసినప్పుడు తప్పనిసరిగా గుర్తుకొస్తుంది. సినిమా కథకు నవలకూ పెద్ద సంబంధంలేదు. సాగుతున్న పడవలో కాళ్ళు ముడుచుకుని పాటపాడే మీనా కుమారిని చూస్తే పై నవలలో చెప్పిన యువతి రూపం ఇదే అనిపిస్తుంది.
తను ప్రేమించిన వ్యక్తి పెళ్ళివేడుక ఒక పడవలో ఆనందంగా సాగుతుంది.మిగతావారిని ఆనందంపజేయటానికి గాయపడ్డ ఆయువతి (మీనాకుమారి)పాడేపాట..
అవ్యక్తప్రేమ,ప్రేమలో మధురిమ,అదికోల్పోయేటప్పటి బాధ,అదేకాలంలోనే ప్రేమికునికి శుభకామన..వెలుతురితో పొగ,దూరమయ్యే దగ్గరతనం ....వీటన్నింటినీ మీనాకుమారి ముఖంలో చూడగలం.
“ఇది చిత్రమైన కథ
ఇది ఎక్కడమొదలయ్యింది,ఎక్కడ ఆగుతుంది
దీని గమ్యమేమిటో?
దీనినర్ధం చేసుకోలేకపోతున్నాను.
ఈ వెలుగుతో పాటు
ఈ దీపాన్నుండి పొగ ఎందుకు వస్తుందో?
నేను కలగంటున్నానా
లేక కలనుండి మేలుకున్నానా?
అభినందనలు నీకు
వేరొకరికి వెలుగైనందుకు..
ఒకరికి ఎంతదగ్గరయ్యావో
ఇతరులకు అంతదూరమయ్యావు.
ఒకరి ప్రేమ పొంది నువ్వు
కొత్త లోకం సృష్టించుకుంటావు
ఇలాంటి ప్రతి సంధ్యవేళ
నువ్వు మాకు జ్ఞప్తికొస్తావు.
--ముళ్ళపూడి సుబ్బారావు
No comments:
Post a Comment