నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-92
తు ఇస్ తరాహ్ సె జిందగీ మె షామిల్ హై
(నువ్విలా నా జీవితంలో భాగమైతే)
‘ఆప్ తో ఐసే న థే’ సినిమాలో మహమ్మద్ రఫీ పాడిన పాట.రచన ‘ఫజ్ లి’
వివిధ్ భారతిలోనూ, రేడియో సిలోన్ లోనూ ఎనభై లలో మారుమోగిన పాట ఇది. ఒక పాట సినిమాలొ రెండు వెర్షన్లుగా ఉండటం చాలా సార్లు జరుతుంది. మేల్,ఫిమేల్ వెర్షన్లు, హాపీ,శాడ్ వెర్షన్లు,చిన్నప్పటి పాట పెద్దయ్యాక పాడటం..ఇలా. ఐతే ఈ సినిమాలో ఈ పల్లవితో ప్రారంభమయ్యే పాటలు మూడు వున్నాయి.మహమ్మద్ రఫీ ది ఒకటి , మన్ హర్ ఉధాస్ ది ఒకటి, మరొకటి హేమలత పాడింది. మూడిట్లో ఏది వచ్చినా చివరిదాకా వినేట్లు వుంటాయి.
ఈ పాటకు సంగీతం ఇచ్చింది ‘ఉషా ఖన్నా’. స్త్రీ సంగీత దర్శకులు హిందీ లో ఉండివుండవచ్చు.కాని ఉషా ఖన్నా లా మూడు దశాబ్దాల పాటు సినిమాసంగీత దర్శకుల్లా కొనసాగినవారు లేరు. వందకు తగ్గని సినిమాలకు పనిచేశారు.వాటిలో ఎక్కువ భాగం చిన్న తరహా సినిమాలు. అందులో పాటలద్వారా మాత్రమే గుర్తింపు పొందిన సినిమాలూవున్నాయి.
ఇప్పటి పాట మహమ్మద్ రఫీ పాడినది. ఇది హుషారుగా సాగే వెర్షన్. రఫీ అభిమానులు ఇష్టంగా వినే పాట.
“నువ్విలా నా జీవితంలో భాగమైతే
ఎక్కడ ఉన్నా నీ సమక్షంలోనే ఉన్నట్టుంటుంది
ఈ ఆకాశం, ఈ మేఘాలు, ఈ దారులు, ఈ గాలులు
ప్రతీది తమ స్థానాల్లోపదిలంగా ఉన్నాయి
చాలా రోజులుగా లోకంలో దేనిపట్లా ఫిర్యాదు లేదు
ఈ జీవితమొక ప్రయాణం, నువ్వు ఆ ప్రయాణపు గమ్యానివి
నువ్వే లేకుంటే లోకంలో ఏదో లోటు ఉండేది
చీకటి దారుల్లో వయసు దారితప్పి తిరుగుతుండేది
నీ బాహువుల్లోకి వచ్చి మనసు విశ్రమించింది
నేను తప్పిపోయిన అలను,నువ్వు ఒడ్డు వి
నా ప్రపంచం నీ అందంతో కాంతివంతమయ్యింది
నా అన్వేషణ,నీ సౌందర్యం కలకాలముండాలి
దేవుడు ఈ పిచ్చితనాన్ని కలకాలముంచాలి
నీపైఉంచిన నమ్మకమే, నా ప్రతీ కోరికను నిజంచేయగలుగుతుంది.”
No comments:
Post a Comment