Husn Pahadon Ka, O Sahiban, Husn Pahadon Ka
हुस्न पहाड़ों का ओ साहिबाహుస్న్ పహాడో కా, ఓ సాహిబా, హుస్న్ పహాడో కారాజ్ కపూర్ ఎక్కుభాగం సొంత సినిమాలకు శంకర్-జైకిషన్ లు సంగీతం అందించారు. గీతకారుడు మాత్రం ఎక్కువగా
శైలేంద్రనే.
తర్వాత కాలంలో మూడు సినిమాలకు లక్ష్మికాంత్ ప్యారేలాల్ లు పనిచేసారు. ఆనంద్ బక్షి గీతకర్త.
రాజ్ కపూర్ చివర సినిమాలు 'రామ్ తెరి గంగా మైలీ' , 'హెన్నా' సినిమాలకు రవీంద్ర జైన్ పాటలు రాసి స్వరపరచాడు.
'రామ్ తెరి గంగా మైలీ' సినిమా లో కథానాయిక పాత్ర గంగానదిని పోలిఉంటుంది. గంగోత్రినుండి కలకత్తావరకూ
ప్రవహించే గంగ మలినమౌతున్నక్రమాన్ని కథానాయికకు అన్వయిస్తూ కథ సాగుతుంది. పర్యావరణం, మతం,
రాజకీయం,ధనస్వామ్యం ..ఇవన్నీ కానవస్తాయి.
కలకత్తా నగరవాసి ఐన హీరో గంగోత్రిలో హీరోయిన్ చూసి ప్రేమించి అక్కడే పెఌ చేసుకున్నాడు. వారి మధ్య ప్రేమ
చోటుచేసుకున్న సందర్భంలో వచ్చే పాట ఇది. లలితమైన పదాలతో కూడుకున్నది. సందర్భానికితగినట్టు,
సూచన ప్రాయం గా భవిష్యత్తు ను తెలియజేస్తున్నట్టు ఉంటుంది.
ఈ అందమైన పర్వతాలలో ,
పన్నెండు నెలలూ శీత కాలమే!
ఋతువు ఎంతో ఆహ్లాదకరం
ఇక చలి పట్ల భయమెందుకు! ఋతువు ఎంతో ఆహ్లాదకరం
ఇక చలి పట్ల భయమెందుకు! చెంత వేడి వయసుండగావిరిసిన పూలతో లోయ నిండి ఉంది
రాత్రికి రాత్రి ఎవరు దీనిని అలంకరించారు?మన కల్యాణం ఇక్కడే జరుపుకోవాలనిపిస్తుంది.పూలు, పొదలు, కొండలు ఏమి చెబుతున్నాయి?పరదేశులు అబద్దాలకోరులని!!
నువ్వు పరదేశివి,ఎక్కడినుండి వచ్చావో
వచ్చి నామనసులో చేరావుఏమిచేయను మనసు చేజారింది.
చిన్నచిన్న జలపాతాలున్నాయి, వాటి నీటిని తాకుతూ కొన్ని మాటలు ఇవ్వాలి..
జలపాతాలు సాగిపోతుంటాయి, పర్వతాలపై ఒట్టు పెట్టు , అవి ఎప్పుడూ నిలిచి ఉంటాయి.
చేతిలో చెయ్యి , ప్రేమభాషణలతో దారి తరిగిపోతుంది
లోకం ఇదే గానం చేస్తుంది ! విను! ప్రేమలో దారులే కాదు జీవితమూ గడచిపోతుంది.
No comments:
Post a Comment