ఆప్ కి నజరో నె సంఝా ప్యార్ కె కాబిల్ ముఝే
आप की नज़रों ने समझा
అన్ పఢ్ (1962) సినిమా లతా మంగేష్కర్ పాడిన పాట. హిందీ సినిమా లో ఉత్తమమైన ఘజల్ లో ఒకటిగా చెప్పబడే ఈ పాట 'రాజా మహ్ది అలి ఖాన్' విరచితం. స్వరకర్త మదన్ మోహన్. సంగీత దర్శకుడు నౌషాద్ కూ ఈ పాత ఎంతో నచ్చి, మదన్ మోహన్ ను ప్రత్యేకంగా అభినందించాడట. ఆరు దశాబ్దాలుగా ఈ పాత శ్రోతల్ని అలరిస్తూనే ఉంది.
2015 లో 'ఆలిఘర్' సినిమా వచ్చింది. అందులో 'మనోజ్ బాజ్ పాయ్' ప్రొఫెసర్ గా నటించాడు. ఏవో కారణాలతో ఒంటరిగా కాలంగడుపుతుంటాడు. అతని ఒంటరితనాన్ని చూపటానికి ఈ పాటను ఉపయోగించారు.
నీ చూపులు చెబుతున్నాయి నేను నీ ప్రేమకు తగినదాననని
హృదయమా! స్పందించటం ఆపు. నేను గమ్యం చేరుకున్నాను.
నీ ఈ నిర్ణయం నాకు సమ్మతమే
నా ప్రతీ చూపూ దేవునికి కృతజ్ఞత చెబుతుంది
నవ్వుతూ నీజీవితంలో నన్ను కలుపుకున్నావు
నేను నీ గమ్యాన్ని , నువ్వు నా గమ్యానివి
నా ఒడ్డువు నువ్వైనపుడు నేను తుఫానుకు ఎందుకు భయపడతాను?
ఎవరైనా తుఫానుకు చెప్పండి నేను గమ్యానికి చేరానని
నా హృదయం పై నీ ఛాయ పరచుకుంది
ఎవరైనా తుఫానుకు చెప్పండి నేను గమ్యానికి చేరానని
నా హృదయం పై నీ ఛాయ పరచుకుంది
అన్నిదిక్కులనుండి వందలాది షెహనాయి మోతలు మొదలయ్యాయి
రెండు లోకాల ఆనందం నేడు నాకు దొరికింది
-ముళ్ళపూడి సుబ్బారావు
రెండు లోకాల ఆనందం నేడు నాకు దొరికింది
-ముళ్ళపూడి సుబ్బారావు
No comments:
Post a Comment