Showing posts with label Zihale muskin. Show all posts
Showing posts with label Zihale muskin. Show all posts

Sunday, April 9, 2017

జిహాల్ ఎ ముస్కిన్ ముకుంబ్ అ రంజిష్


‘జిహాల్ ఎ ముస్కిన్  ముకుంబ్ అ రంజిష్...బహాల్ ఎ హిజ్రా బేచారా దిల్ హై’
(ఈ పేదగుండెను కోపంగా చూడకు,అది ఇప్పటికే తనవారికి దూరమై  గాయపడి ఉంది)

గులామీ (1985) సినిమా లో పాట ఇదిగుల్జార్ సాహిత్యం,లక్ష్మికాంత్ ప్యారేలాల్ సంగీతం,షబ్బీర్ కుమార్ , లతా మంగేష్కర్ గానం.


. పాట పల్లవి  కొత్త పదాలతో  ఉంది.భాష హిందీ ఐతేకాదు. ఉర్దూ కావచ్చనిపించింది. పల్లవి కాకుండా మిగతా పాట అర్ధమౌతుంది. గీరతకారుడు గుల్జార్.అతని పాటల్లో ఉర్దూ వినియోగం ఎక్కువగా ఉంటుంది. అనేక పాటల్లో గాలిబ్ ,మీర్ వంటి వారి కవితాపాదాలను కొన్నింటిని వాడి వాటిని కొత్త అర్ధాలతో సినిమాల్లోకి తెచ్చాడు.

ఐతే ఈ పాట కు పల్లవి మాత్రం అతను ‘అమీర్ ఖుస్రో ‘ రాసిన గజల్ నుంచి తీసుకున్నాడట. అలా ‘జిహాల్ ఎ ముస్కిన్ ముకుంబ రంజిష్’ అంటూ మొదలయ్యే పల్లవి   పర్షియన్ బాష నుండి హిందీ పాటలోకి వచ్చింది.

సినిమా రాజస్థానీ గ్రామీణ ప్రాంతానికి  చెందింది. అక్కడి భూస్వామ్య వ్యవస్థ, కులవివక్ష, గదానికి వ్యతిరేకంగా పోరాటం సినిమాకథ. భూస్వామ్యకుటుంబంలో యువకులు,వారి బంధువైన ఒక పోలీసు అధికారి ఒకవైపు, వారి అకృత్యాలకి బలైన వర్గం వైపు ఒక యువకుడు,అతనికి సహకారం అందించిన సైన్యంలో పనిచేసిన యువకుడు మరొకపవైపు...వీరి మధ్య ఘర్షణ తో సినిమా సాగుతుంది.

ఇందులో సైన్యంలో పనిచేసిన వ్యక్తిగా మిథున్ చక్రవర్తి నటించాడు. అతని ప్రయాణం లో ఒకామెను రక్షించాడు. ఆమె అప్పటికే గాయపడిన మనసుతో ఉంది. వారిద్దరు బస్సు ప్రయాణం చేస్తున్నాఋఉ. బస్సు మధ్యలో ఆగింది. అక్కడ ఉన్న బంజారాలు ఒక పాట ప్రారంభించారు. అందులో వీరూ పాట కలిపారు. బస్సు బయలుదేరింది. బస్సు టాపు మీద కూర్చున్న ఇద్ధరిమధ్యా పాట కొనసాగింది.
(పాట మధ్యలో కథానాయకుడు ఆ సినిమాలో తన్ ఊతపదమైన ‘కోయి షక్ ‘ అంటాడు. పాటలో లీనమైపోయిన ప్రేక్షకులు అది విని ఈలలు వేస్తారు)

పాట అర్ధం:

ఈ పేదగుండెను కోపంగా చూడకు
అది ఇప్పటికే తనవారికి దూరమై  గాయపడి ఉంది


వినవస్తుందిఎవరిదో హృదయ స్పందన
నీ గుండె నుండా?? నా గుండె నుండా?

తను వచ్చి పక్కన కూర్చుంటే
ఈ సాయంత్రం రంగులమయమై పోయింది

కొద్దికొద్దిగా మేను పులకరింపు
కొద్దిగా ఎదోబాధ

చిత్రమైన హృదయవేదన..
అది లేకుంటే జీవించటమే కష్టం

ప్రతిగాయమూ ఒక వజ్రమే
ప్రతి వేదనా ఒక ఆభరణమె.

అప్పుడప్పుడూ సాయంసంధ్య
మేలిముసుగు మెల్లగా తీసినట్టు ఉంటుంది

నీ వంటినుండి వచ్చే ధూపం
నా గుండేలొ తిరుగాడుతుంది

అది సిగ్గా లేక గౌరవమా?
కనులు పైకెత్తగానే వాలిపోతున్నాయి.

నీ కళ్ళనుండి రాలిన చినుకులు
నా కళ్ళలో వచ్చి నిలిచాయి.

  • ముళ్ళపూడి సుబ్బారావు