Showing posts with label akhiyon ki jharo ka me. Show all posts
Showing posts with label akhiyon ki jharo ka me. Show all posts

Sunday, March 26, 2017


'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-6 'బడే బడాయీ న కరే '
Subbarao Mullapudi 
‘రవీంద్ర జైన్’ పేరు మొదటవిన్నది ‘చిత్ చోర్’ సినిమలో 'గోరి తెరా గావ్ బడా ప్యారా' పాటతో.ఆ పాటకి సంగీత కారుడూ,గీత కారుడు ఆయనే. పాట విని అతని సంగీతం గుర్తుపట్టేంత భిన్నత్వం అతని సంగీతంలో ఉండేది. ‘గీత్ ఔర్ సంగీత్.. రవీంద్ర జైన్’ అని రేడియోలో పాటముందువినపడుతుండేది.
అతని సంగీతం చాలా శ్రావ్యంగా,లలితంగా,మనసును శీతల పరుస్తున్నట్టు ఉంటుంది. ఆయన స్వరరచనలో కబీర్,రహీం,తులసీదాస్ ల దోహాల కొన్నింటిని ఒక సినిమా పాటగా కూర్చారు.
సినిమా పేరు అఖియోం కి ఝరోఖా. గానం జస్పాల్ సింగ్, హేమలత
కాలేజీ లో పాట ల పోటీ.ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫైనల్స్ వచ్చారు. వారిమధ్య తగాదాలతో కూడిన ప్రేమ లాంటిది అప్పటికే ఉంది. పాట మొదలయ్యింది. ఇదీ సందర్భం. పాటలో పల్లవి,చరణాలు ఒక్కొక్కటీ ఒక్కోక్క దోహ.
అర్ధం రమారమీ ఇలా:
అమ్మాయి :“గొప్పవాళ్ళెన్నడు బడాయి పోరు,గొప్పలు చెప్పరు
వజ్రం తన విలువ లక్ష టాకాలని ఎప్పుడు చెప్పింది?”( రహీం దాస్ దోహా)
అబ్బాయి “ గొప్పవారిని తక్కువ చేసిచూస్తే వారికి పోయేది లేదు
గోవర్ధన గిరిధారిని,కేవలం మురళీధరుడు గానే చూసినా అతను బాధ పడడు.” ( రహీం దాస్ దోహా)
అమ్మాయి : “జ్ఞాని తో కబీర్ చెబుతున్నాడు మూర్ఖులకు బోధించకు
గుడ్డివారి ముందు నాట్య కళ చూపి ఉపయోగమేమి?”(కబీర్ దోహా)
అబ్బాయి :“అలాంటి భాష, మాటలు చెప్పు,హృదయ పూర్వకంగా
ఎదుటివారిని చల్ల బరచేవి, నిన్ను చల్లగా వుంచేవి” (కబీర్ దోహా)
అమ్మాయి : “అందరూ తమకళ్ళతో ప్రేమను చూడలేరు
మేఘాలు ప్రేమను వర్షించినా గమనించలేరు” (తులసీ దాస్ దోహా)
అబ్బాయి :“చెడ్డవానిని చూడాలని వెళ్ళాను..చెడ్డవాడు కానరాలేదు
మనసులోకి చూసుకుంటేనా అంత చెడ్డవాడు లేదనిపించింది” (కబీర్ దోహా)
అమ్మాయి : “చెడ్డ మాటలాడకు, లక్ష సార్లు ప్రయత్నించినా మాటల్నివాపసు తీసుకోలేవు
చెడిపోయిన పాలనుండి వెన్న తీయలేము” ( రహీం దాస్ దోహా)
అబ్బాయి :“ప్రేమ బంధాలు తెంచెయ్యకు
తెగిపోతే అతకవు,అతికినా ముడులు తెలుస్తూనే వుంటాయి” ( రహీం దాస్ దోహా)
వేరు వేరు దోహాలతో ఒక అర్ధవంతమైన,సందర్భానికి అవసరమైన పాట రూపొందించడం కొత్తగా అనిపించింది.పాట ఇప్పుడువిన్నా చల్లగాలి తనువెల్లా స్పృశించి వెళ్ళినట్టనిపిస్తుంది.
(కాట్రగడ్డ మురారి సినిమాలో ఒక పాట 'ఇరువురి భామలో కౌగిలిలో' లో ‘ఇంటిలోన పోరంటె ఇంతింత కాదయ’(వేమన),’పరమేశా గంగ విడుము’(శ్రీనాథ),’నా తరమా భవసాగరమీదను’(రామదాసు) ఇలా కొన్ని పద్య/పదపంక్తులు పాటలో భాగమయ్యాయి.)