'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-16:‘చల్ అకేలా చల్ అకేలా’
'దూరాకాశ వీధుల్లో తారాదీపాలు ‘ అనేపాట రేడియోలోబాగావినపడేది.సినిమా పేరు 'మాయావి '. అలాగే'ఓ బంగరు రంగుల చిలకా'అనే తోట రాముడు లో పాటకూడా. ఆ పాటలు తప్ప సినిమాలకు ఏరకమైన గుర్తింపులేదు. అలా పాట ద్వారామాత్రమే గుర్తున్నఒక హిందీ సినిమా' సంబంధ్ '.
అకేలా అనే పదంతో మొదలయ్యే హిందీ సినిమా పాటలు కొన్ని డజన్లైనా ఉంటాయి. అందులో ఒకటి సంబంధ్ సినిమాలో 'చల్ అకేలా చల్ అకేలా'.
“ఒంటరిగానే నడువు. ...
నీ బంధుగణం నీ వెనకే ఆగిపోయింది. యాత్రీకుడా..ఒంటరిగానే నడువు
వేల మైళ్ళరహదారులు నిన్ను పిలుస్తున్నాయి
అక్కడి దుఃఖాన్నిచవిచూడమని పిలుస్తున్నాయి.
లోకంలో ఏమనిషైనా ఇక్కడి దుఃఖంతో జ్వలించకుండా ఉన్నాడా?
ఎవరూ తోడురాకున్నా నీకు నువ్వే తోడువవ్వు
భూమిని నీ పడక గా మార్చుకో ఆకాశాన్ని నీ దుప్పటి చేసుకో..
ఇంకా జీవనఖేలను నువ్వు పూర్తిగా ఆడిందెక్కడ?”
ఈ పాటలో నాకు బాగాపట్టిన అంశం..ఇందులోనికోరస్. పాట గుర్తొస్తే కోరస్ మనసులో మెదులుతుంది. ముకేశ్ మరుపురానిపాటల్లో ఇదొకటి. ఓ.పి.నయ్యర్ సంగీతం ప్రత్యేకంగా చరణాలమధ్య వచ్చే సంగీతం గొప్పగా ఉంటుంది.
ఒకింత సీరియస్ గా హీరో,జీపు ప్రయాణం,మెలితిరిగిన రహదారులు,లాండ్ స్కేపుల్ని చూపే ఫొటొగ్రఫీ,మధ్యలో క్లోజ్ అప్ లో కనిపించే పిల్లలూ , డార్జీలింగ్ పరిసరాలు,టాయ్ ట్రెయిన్ (జబ్ ప్యార్ కిసిసే హొతా హై,ఆరాధన పాటలు గుర్తున్నాయా?)...వీటితో పాటచిత్రీకరణ ఆకర్షణీయం. దిగంతాలను పలకరించేట్టు ముకేశ్ స్వరం,దానితో సాగే కోరస్,లాంగ్ షాట్ దృశ్యాలూ..పాట వినటం,చూడటం రెండూ మంచి అనుభూతి.
అకేలా అంటు సాగే రెండుపాటలు .. ‘చల్ అకేలా చల్ అకేలా’ ,‘ఫకీరా చల్ చలా చల్ ‘ పైన రవీంద్రుని ప్రసిద్ధగీతం ‘ఏక్లా చలొ ‘ ప్రభావం ఉనంట్టు అనిపిస్తుంది.
రవీంద్రుని గీతం లో తొలి చరణం అర్థం “నువ్వు పిలిచినప్పుడు బదులు పలికేవారు లేనప్పుడూ..ఒంటరిగనే నడువు” పై రెండు పాటలూ ఈ తొలిచరణాన్ని మాత్రమే ఊతంగా తీసుకున్నాయి. ఎంచేతనొ తర్వాతి చరణాలు సినిమా పాటల్లొ కి రాలేదు.
ఆ చరణాలు..
“ఎవరూ నీ తో మాట్లడనప్పుడు,మొహంతిప్పుకున్నపుడు కూడా నీ మాట నువ్వు చెబుతూనే ఉండు..గుండె ను దిటవు చేసుకో,మనసును బయటపెట్టు,నువ్వు చెప్పేది చెబుతూనే ఉండు”.
“నల్లమబ్బులు కమ్మినప్పుడు,నిజంచుట్టూ చీకటిముసిరినప్పుడు,లోకం మొత్తం భయం ముందు తలవంచి వున్నపుడు.. ఒక జ్వాలగా మారు.నువ్వు జ్వలిస్తూ లోకంలో చీకటి పారదోలు. ఒంటరిగానే జ్వలించు.
--ముళ్ళపూడి సుబ్బారావు