అప్పట్లో ఏదైనా నచ్చిన పాట వినటం తటస్తిస్తే ఒక ఇంద్ర ధనుస్సు ను చూసినట్టే. ఇంద్రధనుస్సు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడలేము.వాన వుండాలి,ఎండవుండాలి,ఏటవాలు కిరణాలుండాలి. ‘కా కరు సజని ఆయేన బాలం ‘ పాటను బహుశా 79/80 లలొ విని వుంటాను. ఈ పాట నాకు హరివిల్లు లాంటిదే.
ఎందుకు నచ్చింది,గుర్తుంది అంటే....కొన్ని విన్నవెంటనేనచ్చుతాయి.కారణాలు నెమ్మదిగా వెతికి తెలుసుకోవాలి.పాటలో ఒక పెయిన్ ఉంది.యేసుదాస్ పలికిస్తున్నాడు.బాధకు కారణాలు తెలియాలంటే పాట అర్ధం పూర్తిగా తెలియాలి.
కొద్ది కాలం తర్వాత అర్ధం తెలిసింది. పాటలో వ్యక్తమయ్యే బాధకు కారణం విరహం.విరహపుబాధ ను హితురాలితో చెపుతుంది విరహిణి. దీనిపట్ల సహానుభూతీ చెందగలం.
తర్వాత దృశ్యపరంగా పాటను చూసినపుడు అందులో పాట పాడేవారూ,వినేవారు వేదనతో లేరు.పాటలోని వేదననంతా అనుభవిస్తున్న స్త్రీ వేరే ఆమె.
వేదన కు కారణమైన విరహం పైన చెప్పిన ప్రేయసిదేనా? మరి మనవంటి విని స్పందించేవారిసంగతి?
శ్రీ శ్రీ ‘నా హృదయంలో నిదురించే చెలీ’ పాటలో చెలి ఎవరంటే ఏమి చెప్పాడు???
పాట అర్ధం ఇలా ఉంది.
‘ఏమి చేయను చెలి ..ప్రియాగమనం లేదు
పరదేశి ప్రియునికై కనులు రెప్పలార్పకుండా వేచాయి
ఏ అడుగుల సవ్వడి ఐనా, అతనే అని హృదయం పరుగిడుతుంది
ప్రేమబంధాలు తెగనీకు
ప్రేమ దాచాలన్న దాగట్లేదు
శ్రావణమే నువ్వు,నేను మేఘాన్ని
సూర్యుడస్తమించాడు,సంధ్య వచ్చింది,కాలం వళ్ళు విరుచుకుంది
లోకమంతా నిదురలో సోలింది,నాకు నిదుర లేదు
అతడు వస్తాడొ రాడోనని గాభరా,భయం
రాధ పిలుస్తుంది ..కృష్ణా నీవెక్కడ?”

తర్వాత తెలిసిన వివరాలు.చాలా ప్రాచుర్యంలో ఉన్న ‘ఆయేన బాలం ‘ థుమ్రీ అధారంగా అమిత్ ఖన్నా రాయగా రాజేష్ రోషన్ స్వరపరిచారు.
ఈ థుమ్రీని మహా విద్వాంసులైన బడే గులాం అలి ఖాన్ ,గులాం అలి వంటివారు ఆలపించారు.వారి పాటను విని ఆనందించటానికి యేసుదాస్ పాడిన ఈ పాటేనాకు పునాది.