'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-18:
"నామ్ గుమ్ జాయేగా చెహరా యే బదల్ జాయేగా"....
“పేరు మారవచ్చు,రూపు మారిపోవచ్చు,జ్ఞాపకం ఉంచుకుంటే ,నా స్వరం తో నన్ను గురుపట్టగలరు..”
ఈ పాటతో నాప్రయాణం ఇలా....
...
మాండు ఫోర్ట్ కట్టడాలు,శిధిలాలు ను 'మాధవ్ సత్వాలేకర్ 'పెయింటింగులుగా వేసినవి చూశాను.. పెయింటింగుల్లో ఉన్న భవనాల్లో ఏదో ఆకర్షణ ఉంది. ఆర్కిటెక్చర్ వల్ల కావచ్చు.
‘మాండు ‘రాజ్యం 10వశతాబ్దంలో హిందూ రాజులతో మొదలై,ముస్లింల వశమై చివరకు ఆక్బర్ కాలంలోమొఘల్ సామ్రాజ్యంలో కలిసింది.ఆరాజ్యానికి సంబంధించి ఒక ప్రేమకథ ప్రాచుర్యంలో ఉంది. ఆ ప్రేమ, రాజు బాజ్ బహాదుర్,ప శు /గొర్రెల కాపరి రూప్ మతిల మధ్య.
రాణీరూప్ మతి అని ఒక హిందీసినిమా ముకేశ్,లతా పాటలతో ఉనికిలో ఉంది. ( ఆ లౌట్ కే ఆజా.. మెరే ప్రీత్ బులాతీ హై..అందులో హిట్ గీతం).మాండు కట్టడాలు,పరిసరాలు ఆ సినిమాలో దొరకొచ్చేమోనని చూస్తే ఆ సినిమా మొత్తం స్టూడియోల్లో తీసినట్టేఉంది.
'నా మ్ గు మ్ జాయేగా,చెహరా యే బదల్ జాయేగా' పాట అనేకసార్లు విన్నదే.అనుకోకుండా ఆ పాటను చూసి నప్పుడు ఆ పాట మాండు కట్టడాలమధ్య చిత్రీకరించారని అర్ధమయ్యింది.సినిమావాళ్ళు వాళ్ళ అవసరాలరీత్యా పనిచేసినా,కొన్ని మేళ్ళు జరిగిపోతుంటాయి. వాటిలో ఒకటి చారిత్రక ప్రదేశాలను అజరామరం చేయటం. (దేవానంద్ బయోగ్రఫీ ..రొమాన్సింగ్ విత్ లైఫ్ లో ఒక చోట అంటారు...దే హేవ్ ఇమ్మోర్టలైజ్డ్ చితోడ్ ఘర్ విత్ 'ఆజ్ ఫిర్ జీనే కి 'సాంగ్ ). అలా మాండు కట్టడాలు ఆ సినిమా తిసేనాటీకి(77/78) ఎలా ఉండేవో దృశ్యమానం అయ్యింది.
'నా మ్ గు మ్ జాయేగా ‘పాట 'కినారా' సినిమాలోది. ఆ సినిమాలో కథానాయకుడు అర్కిటెక్ట్ . అతను 'మాండు 'అర్కిటెక్చర్ చూడటానికివచ్చి అక్కడ కథానాయికను కలుస్తాడు. అప్పటికే కథానాయిక తన ప్రియుడ్ని పోగొట్టుకుని అతని జ్ఞాపకాలు అతను పనిచేసినచోట వెతుక్కుంటుంది. పాట ఆసందర్భంలోనిదే. భూపేందర్, లతా లు పాడారు. గుల్జార్ రచన,ఆర్ డీ బర్మన్ సంగీతం.
పాట అర్ధం స్థూలంగా
“పేరు మారవచ్చు,రూపు మారిపోవచ్చు
జ్ఞాపకం ఉంచుకుంటే ,నా స్వరం తో నన్ను గురుపట్టగలరు..
కాలం చేసిన గాయం తక్కువ అందమైనదేమీ కాదు
ఈ రోజు ఇక్కడున్నాము, రేపు ఎక్కడా ఉండకపోవచ్చు.
కాలానికి ఆవల ఎక్కడైనా కలవవచ్చు
జరిగిపోయిందంతా గతానికి చెందింది
ఏ ఒక్క రాత్రితోనో మొత్తం జీవితమైపోదు.
ఆ రాత్రే తిరిగి ఎదురైతే?”
కథలో గడిచినదానిని, జరగబోయే దానిని స్పృశిస్తూ పాట సాగుతుంది. ఒక చరణంలో భాగం 'వక్త్ కే సితమ్ కమ్ హసీ నహీ ',బాధే సౌఖ్యమనే భావన (దేవదాసు) ని గుర్తుకుతెస్తుంది.
---ముళ్ళపూడి సుబ్బారావు