Saturday, August 29, 2020

పర్బతోం కె పేడోం పర్ షామ్ క బసేరా

 

పర్బతోం కె పేడోం పర్  షామ్ క బసేరా


గాత్రం,రూపం ప్రాధాన్యత ఉన్న గానం, నటన వంటి కళలలో, ఆ కళలో మేరునగాలవంటివారితో  పోలిక ఉండటం కొంత కాలం వరం, ఆపైన శాపం. ఎంట్రీ దశలో ఆ పోలిక కొన్ని అవకాశాలనిస్తుంది. అదీ పెద్దకళాకారులకు ఒక ప్రత్యామ్నాయంగా వారి అందుబాటు లేనపుడు మాత్రమే. తమదైన గుర్తింపు పొందటం లో మాత్రం ఆ పోలిక పెద్ద అడ్డుగోడావుతుంది.

సుమన్ కల్యాణ్ పుర్ సంగీతకారుల కుటుంబంలో పుట్టింది. సంగీతసాధన చేసింది. మూడున్నర దశాబ్దాలపాటు సినిమారంగంలో కృషి చేసింది. గణనీయమైన సంఖ్యలో పాటలు పాడింది. ఐతే సాధారణ సినీసంగీతప్రియులకు గాయనీమణులంటే లత, ఆశా లే గుర్తొస్తారు. 

సుమన్ కల్యాణ్ పుర్ వరమూ శాపమూ ఆమె స్వరం  లతామంగేష్కర్  స్వరానికి బహుసమీపంగా ఉండటం. అమె పాడిన అనేకపాటల్ని శ్రోతలు లతామంగేష్కర్ పాటలుగానే భ్రమిస్తారు. 

 ఓ పి నయ్యర్ లతామంగేష్కర్ తో పొరపొచ్చాలు వచ్చి ఆమె తో పాడించటం మానేసాడు. ఎంచేతనో  అతను ఆశా భోస్లే తోనే పనిచేసాడు కాని 'సుమన్ కల్యాన్ పుర్' కు అవకాశమివ్వలేదు.

మహమ్మద్ రఫీ ,లతా లమధ్య విభేధాలు వచ్చి కొంతకాలం కలిసి పాటలు పాడలేదు. ఆ సమయంలో రఫీ - సుమన్ కల్యాణ్ పుర్ కాంబినేషన్లో వందకుపైగా పాటలు వచ్చాయి. 

. అందులో ఒకటి  'పర్బతో కే పేడో పే షామ్ క బసేరా హై'  . ఈ పాట ఇప్పటికీ  శ్రోతల్ని ఆకర్షిస్తూనె ఉంది.  సినిమా పేరు 'షాగున్ ' 1964 .  కేవలం పాటలవల్ల మాత్రమే గుర్తున్న సినిమా.

ఈ పాట లో కనిపించేవారు వహీదారెహ్మాన్- కమల్ జిత్ లు. కమల్ జిత్ నటుడుగా గుర్తింపు పొందలేదు. ఐతే అతడు వహీదారెహ్మాన్ నిజజీవితపు కథానాయకుడు. 

***********

పర్వత తరుశాఖలలో సాయం సంధ్య బస చేస్తుంది

కాటుకలాంటి చీకటి లో వెలుతురు, సంపెంగ రంగు వెలుగులో చీకటి


రెండుహృదయాలు రెండుసార్లు కలుస్తాయి

అంబరం ఆనందంతో రంగులు విరజిమ్ముతుంది


స్థబ్దుగా ఉన్న నీటిని పాట కదిలిస్తుంది

తడిచిన శ్వాస లో సుగుంధం బస చేస్తుంది


ఇంతమంచికాలంలో కలయిక సంపూర్ణమవ్వదెందుకో?

చిక్కనైన కాంతి రేఖలు ,సుళ్ళు తిరిగే మైకం







No comments:

Post a Comment