హే నీలె గగన్ కి తలే
సంగీత దర్శకుడు రవి కృషికి గుర్తింపు చౌద్వీ క చాంద్ సినిమాతో లభించింది. మహమ్మద్ రఫి -రవి (రవి శంకర శర్మ) కాంబినేషన్ లో అజరామరమైన గీతాలు కొన్ని వచ్చాయి.
నిర్మాత బి ఆర్ చోప్రా , సంగీత దర్శకునిగా రవి ప్రోత్సహించాడు. బి ఆర్ సినిమాలకు రఫీ చాలాపాటలు పాడాడు.
ఐతే బి ఆర్ చోప్రా కు రఫీ కి విబేధాలు వచ్చాయి. దానికి కారణాలు వివిధరకాలు వినిపిస్తాయి. ఒక పాటలో తన సహ గాయకుడుగా 'మహేంద్ర కపూర్' ను రఫీ వద్దన్నారని, దానికి బి ఆర్ అంగీకరించలేదని ,అందువల్ల విబేధాలు వచ్చాయన్నది ఒక వెర్షన్.
మహేంద్ర కపూర్ గాత్రం తొలినాళ్ళలో రఫీ గాత్రానికి దగ్గరగాఉండేది.(కొన్ని మహేంద్ర కపూర్ పాటల్ని రఫీ పాటలని శ్రోతలు భ్రమపడటం నాకు తెలుసు). అందువల్ల ఇద్దరు కలిసి పాడితే వైవిధ్యం ఉండదనేది రఫీ వాదనగా చెబుతారు. ఏదిఏమైనా చివరకు బి ఆర్ చోప్రా , మహేంద్ర కపూర్ ను తన సంస్థ ద్వారా ప్రోత్సహమిచ్చాడు. రవి ఒక రకంగా వారి ఆస్థాన సంగీతదర్శకుడు. అలా రవి- మహేంద్ర కపూర్ కాంబినేషన్లో చాలానే పాటలు- మంచిపాటలు వచ్చాయి.
హమ్ రాజ్ సినిమా (బి ఆర్ చోప్రా-సాహిర్ లూధియాన్వి- రవి- మహేంద్రకపూర్ ల కాంబినేషన్) లో ఇద్దరు హీరో లకు (రాజ్ కుమార్ , సునీల్ దత్ ) కు నేపధ్య గానం మహేంద్రకపూర్ చేయటం హమనార్హం.
ఆ సినిమాలో ఒక పాట 'హే నీలె గగన్ కి తలే'.
నీలాకాశపు నీడలో
పుడమి ప్రేమ ఫలించింది
ఇలాంటి చోటే పొద్దుపొడుపులు
అలానే పొద్దుకుంకులు
మంచుముత్యాలు పూలమీద రాలాయి
రెండింటి ఆశలూ ఫలించాయి
చెట్టును ఆలింగనం చేసుకున్న లత
మత్తులోన తూలింది
సెలయేరు నదితో కలిసి
సాగరునివైపు సాగింది
No comments:
Post a Comment