Showing posts with label mahendra kapoor. Show all posts
Showing posts with label mahendra kapoor. Show all posts

Saturday, August 29, 2020

హే నీలె గగన్ కి తలే

హే నీలె గగన్ కి తలే

సంగీత దర్శకుడు రవి కృషికి గుర్తింపు చౌద్వీ క చాంద్ సినిమాతో లభించింది. మహమ్మద్ రఫి -రవి (రవి శంకర శర్మ) కాంబినేషన్ లో అజరామరమైన గీతాలు కొన్ని వచ్చాయి. 

నిర్మాత బి ఆర్ చోప్రా , సంగీత దర్శకునిగా రవి ప్రోత్సహించాడు. బి ఆర్ సినిమాలకు రఫీ చాలాపాటలు పాడాడు. 

ఐతే బి ఆర్ చోప్రా కు రఫీ కి విబేధాలు వచ్చాయి. దానికి కారణాలు వివిధరకాలు  వినిపిస్తాయి.  ఒక పాటలో తన సహ గాయకుడుగా 'మహేంద్ర కపూర్' ను రఫీ వద్దన్నారని, దానికి బి ఆర్ అంగీకరించలేదని ,అందువల్ల విబేధాలు వచ్చాయన్నది ఒక వెర్షన్. 

మహేంద్ర కపూర్ గాత్రం తొలినాళ్ళలో రఫీ గాత్రానికి దగ్గరగాఉండేది.(కొన్ని మహేంద్ర కపూర్ పాటల్ని రఫీ పాటలని శ్రోతలు భ్రమపడటం నాకు తెలుసు). అందువల్ల  ఇద్దరు కలిసి పాడితే వైవిధ్యం ఉండదనేది రఫీ వాదనగా చెబుతారు. ఏదిఏమైనా చివరకు బి ఆర్ చోప్రా , మహేంద్ర కపూర్ ను తన సంస్థ ద్వారా ప్రోత్సహమిచ్చాడు.   రవి ఒక రకంగా వారి ఆస్థాన సంగీతదర్శకుడు. అలా రవి- మహేంద్ర కపూర్ కాంబినేషన్లో చాలానే పాటలు- మంచిపాటలు వచ్చాయి. 

హమ్ రాజ్ సినిమా (బి ఆర్ చోప్రా-సాహిర్ లూధియాన్వి- రవి- మహేంద్రకపూర్ ల కాంబినేషన్) లో ఇద్దరు హీరో లకు (రాజ్ కుమార్ , సునీల్ దత్ ) కు నేపధ్య గానం మహేంద్రకపూర్ చేయటం హమనార్హం.

ఆ సినిమాలో ఒక పాట  'హే నీలె గగన్ కి తలే'. 

నీలాకాశపు నీడలో 

పుడమి ప్రేమ ఫలించింది


ఇలాంటి చోటే పొద్దుపొడుపులు

అలానే పొద్దుకుంకులు


మంచుముత్యాలు పూలమీద రాలాయి

రెండింటి ఆశలూ ఫలించాయి


చెట్టును ఆలింగనం చేసుకున్న లత

మత్తులోన తూలింది


సెలయేరు నదితో కలిసి

సాగరునివైపు సాగింది




Thursday, February 8, 2018

అభీ అల్విదా మత్ కహో దోస్ తో!

‘నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-132
అభీ అల్విదా మత్ కహో దోస్ తో!
(ఇప్పుడే వీడుకోలు చెప్పకండి మిత్రులారా)
...
నికాహ్ (1982) సినిమా లో మహేంద్ర కపూర్ పాడిన పాట. రవి సంగీతం, హసన్ కమాల్ రచన.

ప్రయాణ సాధనాలు, ప్రసార, సమాచార సాధనాలు
ఇప్పట్లా లేని రోజుల్లో వీడుకోలు సందర్భాలు ఉద్వేగభరితంగా ఉండేవి. అప్పటిదాకా విలువ తెలియని,విలువ కట్టని బంధాల విలువ తెలుస్తుందప్పుడు. హైస్కూళ్ళలో ,కాలేజీలలో ఆఖరి పని(?) దినంలో విద్యార్ధులు ఎమోషనల్ ఐపోయేవారు. ఆటో గ్రాఫ్ పుస్తకాలో సంతకాలతోపాటు కవిత్వమూ దొర్లేది.
నికాహ్ సినిమాలో ఈ పాట అలాంటి వీడుకోలు (అల్విదా) సందర్భంలోనిదే.
అల్విదా అనగానే కిశోర్ కుమార్ ‘కభి అల్విద న కెహనా’ అంటాడు. ‘అభీ అల్విదా మత్ కహో దోస్ తో ‘ అంటూ మహేంద్ర కపూర్ వస్తాడు. సంధ్యా సమస్య లో ఎంపిక రెండవదే. కారణం సినిమా లో ఆ పాటకున్న ప్రాధాన్యత, సినిమాలో ఇమిడిన విధానం.
బి ఆర్ చోప్రా (దర్శక నిర్మాత) చిరకాల మిత్రులు రవి, మహేంద్ర కపూర్ లు కొద్ది విరామం తర్వాత ఈ సినిమాతో జత కట్టారు. లోటల్లా ఆ బృందంలో ‘సాహిర్ లూధియాన్వి’ లేకపోవటమే.( ఆయన 80 లొ కాలం చేసారు).
‘యాదోం కి చిరాగోం కొ జలాయె హుయె రఖనా, లంబా హై సఫర్ ఇస్ మె కహీ రాత్ తో హోగీ’ పాదం వింటుంటే సాహిర్ లోటును హసన్ కమాల్ కలం భర్తీ చేసిందనిపిస్తుంది.
పాటలో చరణాలమధ్య సంగీతం వింటుంటే పరిమళాన్ని మోసుకొచ్చే చల్లగాలి శరీరాన్ని స్పృశించినట్టు అనిపిస్తుంది.

“ఇప్పుడే వీడుకోలు చెప్పకండి మిత్రులారా
ఎవరికితెలుసు.. తిరిగి కలయిక ఉంటుందేమో
గడచిన క్షణాల తీయని బాధ వెంట వస్తూనే ఉంటుంది
కోరితే కలలలోనైనా కలయిక ఉంటుంది

ప్రేమలో మునిగిన వర్ణ మయ స్థలాలు
ఈ వదనాలు, ఈ దృక్కులు, ఈ యవ్వనభరితఋతువు, ఈ పవనాలు
ఎక్కడికి వెఌనా వీటి సుగంధం వెంట వస్తూనే ఉంటుంది

పూలలా మనసులో నిలిపే ఉంచండి
జ్ఞాపకాల దీపాలను వెలిగించే ఉంచండి
బహుదూరపు ప్రయాణం ..దీనిలో ఎప్పుడైనా రాత్రి కావచ్చు

మీతో కలిసి నడిచే ఈ క్షణాల సంపద
అనుభూతుల సంపద,భావనల సంపద
ఏది వెంటనున్నా లేకున్నా ఉండే అరుదైన సంపద”

Wednesday, March 29, 2017


'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-21     'చలో ఎక్ బార్ ఫిర్ సే అజ్ నబీ బంజాయే హందోనో'  9 January
'చలో ఎక్ బార్ ఫిర్ సే అజ్ నబీ బంజాయే హందోనో' పాట రేడియోలో బాగా వినపడేది. 'తిరిగి మనం అపరిచితులమైపోదాం పద ' ఇది పల్లవికి అర్ధం.విన్నతొలినాళ్ళలో ఇదేదో చిత్రంగా వుందే అనిపించేది. ఆట మధ్యలో ఆపేసి 'తూచ్ ' మళ్ళిమొదలుపెడదాం అన్నపుడూ, చెస్ లో పావుల్ని కలిపేసి మళ్ళీ మొదటినుంచి ఆడదామన్నపుడు ఈ పాట హమ్ చేయటం గుర్తుంది.
బి.ఆర్.చోప్రా అర్ధ శతాబ్దంపాటు హిందీ చిత్రపరిశ్రమలో ఉన్నాడు.దర్శకుడిగా,నిర్మాతగా అతని చిత్రాలు ఎక్కువభాగం విజయవంతమయ్యాయి.అతని చాలసినిమాల...కు సంగీత దర్సకుడిగా 'రవి 'పనిచేశాడు. రవి, గాయకుడు మహేంద్రకపూర్ తో ఎక్కువపాటలు పాడించాడు.వాటిలోనూ చాలా భాగం హిట్ అయ్యాయి.
సాహిర్ లూధియాన్వి రాసిన పాటల్లో లోతైన భావాలు,అందమైన ఉర్దూ పదాల ప్రయోగం కనిపిస్తాయి.
బి.ఆర్.చోప్రా సినిమా, రవి సంగీతం,మహేంద్రకపూర్ స్వరం.లూధియాన్వి రచన - ఇవి కలిసిన పాట గుమ్రా సినిమాలో 'చలో ఎక్ బార్ ఫిర్ సె '
ఆమె ఒకరిని ప్రేమించింది.ఆ ప్రేమ విషయంతెలియని ఆమే అక్క చనిపోతూ తన పిల్లలకోసం తన భర్తను పెళ్ళిచేసుకోమని కోరింది. ప్రెమను వదులుకుని ఆమె బావను పెళ్ళిచేసుకుంది. తరువాత ఆమె ప్రేమించినతను తిరిగి ఆకుటుంబంలోకి వచ్చాడు.
పాట సందర్భం ఇది.
మనమిద్దరం తిరిగి అపరిచితులమైపోదాము పద
నీ సాన్నిహిత్యం పట్ల నేనేమీ ఆశ ఉంచుకోలేదు
వేరే అర్ధాలు స్పురింపజేస్తూ నా వంక చూడకు
మరిక నేనూ మాట్లాడేటప్పుడు నా మనసు చలించదు
నీ చూపులు అవిదాచుకున్న బాధను తెలియనీవులే
నిన్ను కుడా ఏవో చిక్కులు ముందుకు అడుగెయ్యనివ్వవు
నన్నూ లోకులు అంటారు ఎవో ముసుగులు వేసుకున్నానని
నా గతకాలపు తప్పిదాలు ఇక నా జతగాళ్ళు
గడచిపోయిన రాత్రుల నీడలు నీతోనూ ఉంటాయి
పరిచయమే సుస్తీ ఐతే దానిని మరచిపోవటమే మేలు
బంధమే బరువైపోతే దానిని తెంచుకోవటమే మంచిది
కథను ముగింపుకు తేవటం కష్టమైపోయిన
దానిని అందమైన మలుపు తిప్పి వదిలెయ్యటం మంచిది.

జీవితంలో చాలాసార్లు కొన్ని సంఘటల్ని 'అన్ డు ' చేయాలనో ఎరేజ్ చేయాలనో బాగా అనిపిస్తుంది.అన్ డు చేయలేకపోయినా ఆ సంఘటనల జ్ఞాపకాల ప్రభావం పట్ల ప్రతిస్పందన మనచేతిలోనే ఉందికదా అని ఒక ఓదార్పు.
ప్రత్యేకంగా ఈ పాటలో చివరిభాగం
'వో అఫ్సానా జిసే అంజాం తక్ లానా న హో ముంకిన్
ఉసే ఏక్ ఖూబ్ సూరత్ మొడ్ దె కర్ ఛోడ్నా అచ్చా '
చాలా నచ్చుతుంది.