సుందర దృశ్యమా! వసంతమా! నా జీవితాన్నీ అలంకరించు!వసంతమా! (కంటికి) కాటుక దిద్దు! మల్లెలమాల తీసుకురా వంగిన కొమ్మలనుండి నువ్వు పూలు తీసుకురా వసంతమా! నా జీవితాన్నీ అలంకరించు! నా ఈచేతులకు గోరింటాకు పెట్టు నా పాపిట సింధూరం పెట్టు జ్ఞాపకాల ధారలు! వసంతమా!
Saturday, October 31, 2020
Dil ka bha.Nwar kare pukaar
దిల్ క భవర్ కరే పుకార్
తెరే ఘర్ కె సామ్నె (1963)
హస్రత్ జైపురి ఎస్. డి. బర్మన్, మహమ్మద్ రఫీ ల కలయిక వీనులవిందు చేస్తే దేవానంద్, నూతన్ లు నేత్రపర్వం చేసారు. కాలంతో నిమిత్తం లేకుండా విన్నప్పుడూ,చూసినప్పుడూ కొత్తలోకాలకు తీసుకెళ్ళే పాట.
పాటకు నేపధ్యం లో కనపడేది కుతుబ్ మినార్ లోపల ఉన్న మెట్లు. మినార్ పైభాగంనుంది ప్రేమికులు కిందకు వస్తున్నారు. ఇరుకైన మార్గం, అందులో ప్రేమికుడు ఆమెతో మనసు మాట తెలియజేస్తున్నాడు. వివిధరకాల పర్యాటకులు అతని మాటకు అడ్డువస్తున్నారు. కిందకు దిగేసమయానికి అతనామెకు చెప్పాల్సింది చెప్పాడు.
పాట దృశ్యీకరణకు కుతుబ్ మినార్ ఇరుకైన మెట్లు సహకరించక పోవటంతో కుతుబ్ మినార్ సెట్ లో నే చిత్రీకరణ జరిగింది. పాట చూస్తున్నపుడు అది తెలియకపోవటానికి ఒక కారణం చూపరులదృష్టి దేవానంద్, నూతన్ లపైనుండి మరలకపోవటం.
*******
హృదయ భ్రమరం పిలుస్తుంది ప్రేమరాగం విను
నీవొక గులాబివి..నీకు సరి ఏది నీ శైలే ఒక వసంతం మనసు లోపలి సందిగ్ధం పెదవిపైకి వచ్చింది నీవంటే ప్రేమనే మాటగా నీకే మనసిచ్చాగా ప్రేమరాగం విను
కావలిస్తే నన్ను మాయం చెయ్యి కాని కిందకు తోయకు నీ కంటి అశ్రుకణంలా! నాప్రేమ ఉన్నతి, లోతును నా నిట్టూర్పులనడుగు అవి ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రేమరాగం విను
ఈ అందమైన చోట నేను ఓడిపోయి కూర్చోను నీడనై నీవెంట నడుస్తాను నేడు నాపక్కన నీవు.. మనసు కోరిక ప్రతిధ్వనిస్తుంది నీతో నా చూపు కలిసినపుడు నువ్వేమి చేసావో తెలియదుగా ప్రేమరాగం విను
నీ ఈ పైట ఒక ప్రేమ మేఘంలా తిరిగి నన్ను నేలమీదకు తెచ్చింది నా చేయి అందుకో ఇపుడు, నీచూపు మధుపాత్ర ఇవ్వు ఈ కొత్తయాత్ర కోసం నీవు నా సాకీ వి ప్రేమరాగం విను
देखा है ज़िंदगी को कुछ इतना करीब से - dekhaa hai zindagii ko kuchh itanaa kariib se
ఏక్ మహల్ హో సప్నో కా (1975) సినిమాలో పాట. సాహిర్ లూధియాన్వి రచన, రవి సంగీత దర్శకత్వం, కిశోర్ కుమార్ గానం.
కథానయకుడు ఒక కవి. అతనికి రావలసినంత ఖ్యాతి రాదు. బాధ్యతలున్నాయి. ప్రేయసి ఉంది. ఆమె కొద్దిరోజుల్లో కంటిచూపు కోల్పోబోతుందని తెలుసుకుంది. కథానాయకునికి బరువు కాకూడదని అతనికి దూరమై ఒక పెద్ద మనిషి ని పెఌచేసుకుంది. ఆ పెద్దమనిషి కూతురు కథానాయకుని పట్ల ఇష్టం పెంచుకుంది. కథానాయకుడు తన ప్రేయసిని వేరేవ్యక్తి భార్యగా పార్టీలో చూసాడు. ఆమె తనకు తన పేదరికం వల్లే దూరమైందనుకున్నాడు. ఆ సందర్భంలో పాట ఇది.
సాహిర్ లూధియాన్వి ,కథానాయకులు కవులుగా కనపడే ప్యాసా, కభీ కభీ సినిమాలకు పాటలు రాసాడు. అవి మన్ననలనందుకున్నాయి. ఐతే ఈ సినిమాలో పాటలకు ఆ స్థాయి ఖ్యాతి రాలేదు.
అన్ పఢ్ (1962) సినిమా లతా మంగేష్కర్ పాడిన పాట. హిందీ సినిమా లో ఉత్తమమైన ఘజల్ లో ఒకటిగా చెప్పబడే ఈ పాట 'రాజా మహ్ది అలి ఖాన్' విరచితం. స్వరకర్త మదన్ మోహన్. సంగీత దర్శకుడు నౌషాద్ కూ ఈ పాత ఎంతో నచ్చి, మదన్ మోహన్ ను ప్రత్యేకంగా అభినందించాడట. ఆరు దశాబ్దాలుగా ఈ పాత శ్రోతల్ని అలరిస్తూనే ఉంది.
2015 లో 'ఆలిఘర్' సినిమా వచ్చింది. అందులో 'మనోజ్ బాజ్ పాయ్' ప్రొఫెసర్ గా నటించాడు. ఏవో కారణాలతో ఒంటరిగా కాలంగడుపుతుంటాడు. అతని ఒంటరితనాన్ని చూపటానికి ఈ పాటను ఉపయోగించారు.
నీ చూపులు చెబుతున్నాయి నేను నీ ప్రేమకు తగినదాననని
హృదయమా! స్పందించటం ఆపు. నేను గమ్యం చేరుకున్నాను.
నీ ఈ నిర్ణయం నాకు సమ్మతమే
నా ప్రతీ చూపూ దేవునికి కృతజ్ఞత చెబుతుంది
నవ్వుతూ నీజీవితంలో నన్ను కలుపుకున్నావు
నేను నీ గమ్యాన్ని , నువ్వు నా గమ్యానివి
నా ఒడ్డువు నువ్వైనపుడు నేను తుఫానుకు ఎందుకు భయపడతాను? ఎవరైనా తుఫానుకు చెప్పండి నేను గమ్యానికి చేరానని
నా హృదయం పై నీ ఛాయ పరచుకుంది
అన్నిదిక్కులనుండి వందలాది షెహనాయి మోతలు మొదలయ్యాయి రెండు లోకాల ఆనందం నేడు నాకు దొరికింది -ముళ్ళపూడి సుబ్బారావు
నటుడు ఎమ్.బాలయ్య మంచి అభిరుచి కలిగిన నిర్మాత. విభిన్న కథాంశాలతో సినిమాలు తీసాడు. చెల్లెలి కాపురం,నేరము-శిక్ష, అన్నదమ్ములకథ, ఈనాటిబంధం ఏనాటిదో, ప్రేమ పగ , చుట్టలున్నారు జాగ్రత్త వాటిలో కొన్ని . చిత్రాలన్నింటిలోనూ సంగీతానికి ప్రాధాన్యతనిచ్చాడు. మొదటి రెండు సినిమాలకు కె విశ్వనాథ్ దర్శకుడు. కేవి మహదేవన్, ఎస్. రాజేశ్వరరావు (మూడు సినిమాలకు), ఎమ్ ఎస్ విశ్వనాథన్ వంటి లబ్ద ప్రతిష్టులతో సంగీతం తీసుకున్నాడు.
'ఈ నాటి బంధం ఏనాటిదో' సినిమానాటికి కృష్ణ పూర్తిస్థాయి కమర్షియకల్ హీరో గా ఉన్నాడు. ఐతే ఈ సినిమాలో అతని పాత్రలో గొప్ప హీరోయిజమ్ తో కూడిలేదు. సినిమా జయప్రద చుట్టూ తిరుగుతుంది, అల్లు రామలింగయ్య పాత్ర కూడా ప్రాముఖ్యతతో కూడినదే. కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కానిఈ సినిమా పాటలద్వారా ఎక్కువ గుర్తింపు పొందింది. దేవులపల్లి కృష్ణ శాస్త్రి -ఎస్ రాజేశ్వర రావులు అందుకు కారకులు. సినిమాలో ఒక పాట సుశీల పాడిన 'ఎవరికి చెప్పేది ఏమని చేప్పేది ' . ఆ పాట పై నిర్వివాదంగా హిందీ పాట 'ఏ దిల్ ఔర్ ఉన్ కి' పాట ప్రభావం ఉంది. ఆ పాట తెలుగునాటనూ బహు ప్రసిద్ధం.
లతా పాడిన హిందీ పాట 'ప్రేమ్ పర్బత్' (1973)సినిమా లొది. స్వరకర్త 'జై దేవ్' , గీతకారుడు 'జాన్ నిసార్ అఖ్తర్'. సినిమా దర్శకుడు,రచయిత వేద్ రాహి డోంగ్రీ భాష లో పేరున్న రచయిత. ప్రేమ్ పర్బత్ సినిమా ఇపుడు అందుబాటులో ఉన్నట్టులేదు
*********
అతని చూపుల నీడ నా మనసుపై వాలితే
అతని చేతులు నన్ను చుట్టుముట్టినట్టుంటుంది.
చంచలించే సూర్యకిరణాలు పర్వతాలను ముద్దాడుతున్నాయి
గాలికెరటాలు నదులతనువుల్ని ముద్దాడుతున్నాయి
ప్రతీచోటా ప్రేమ నీడలు పరచుకున్నాయి
చెట్టు కొమ్మల్ని దట్టమైనమేఘాలు పెనవేసుకున్నాయి ఒక్కక్షణం కాంతివంతం , మరోక్షణం అంధకారం
చల్లని నీడలతో దారులు నిండాయి
గుండె స్వేచ్చగా కొట్టుకుంటుంది ఈ ప్రకృతిని అనుకరిస్తూ
వర్ణమయ ప్రేమ ఛాయలు పరచుకున్నాయి
****
ఎవరో ఔత్సాహికులు ఈ పాటను వైజయంతి మాల (మధుమతి సినిమా) విజువల్స్ తో కలిపారు.