Wednesday, March 29, 2017


'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-21     'చలో ఎక్ బార్ ఫిర్ సే అజ్ నబీ బంజాయే హందోనో'  9 January
'చలో ఎక్ బార్ ఫిర్ సే అజ్ నబీ బంజాయే హందోనో' పాట రేడియోలో బాగా వినపడేది. 'తిరిగి మనం అపరిచితులమైపోదాం పద ' ఇది పల్లవికి అర్ధం.విన్నతొలినాళ్ళలో ఇదేదో చిత్రంగా వుందే అనిపించేది. ఆట మధ్యలో ఆపేసి 'తూచ్ ' మళ్ళిమొదలుపెడదాం అన్నపుడూ, చెస్ లో పావుల్ని కలిపేసి మళ్ళీ మొదటినుంచి ఆడదామన్నపుడు ఈ పాట హమ్ చేయటం గుర్తుంది.
బి.ఆర్.చోప్రా అర్ధ శతాబ్దంపాటు హిందీ చిత్రపరిశ్రమలో ఉన్నాడు.దర్శకుడిగా,నిర్మాతగా అతని చిత్రాలు ఎక్కువభాగం విజయవంతమయ్యాయి.అతని చాలసినిమాల...కు సంగీత దర్సకుడిగా 'రవి 'పనిచేశాడు. రవి, గాయకుడు మహేంద్రకపూర్ తో ఎక్కువపాటలు పాడించాడు.వాటిలోనూ చాలా భాగం హిట్ అయ్యాయి.
సాహిర్ లూధియాన్వి రాసిన పాటల్లో లోతైన భావాలు,అందమైన ఉర్దూ పదాల ప్రయోగం కనిపిస్తాయి.
బి.ఆర్.చోప్రా సినిమా, రవి సంగీతం,మహేంద్రకపూర్ స్వరం.లూధియాన్వి రచన - ఇవి కలిసిన పాట గుమ్రా సినిమాలో 'చలో ఎక్ బార్ ఫిర్ సె '
ఆమె ఒకరిని ప్రేమించింది.ఆ ప్రేమ విషయంతెలియని ఆమే అక్క చనిపోతూ తన పిల్లలకోసం తన భర్తను పెళ్ళిచేసుకోమని కోరింది. ప్రెమను వదులుకుని ఆమె బావను పెళ్ళిచేసుకుంది. తరువాత ఆమె ప్రేమించినతను తిరిగి ఆకుటుంబంలోకి వచ్చాడు.
పాట సందర్భం ఇది.
మనమిద్దరం తిరిగి అపరిచితులమైపోదాము పద
నీ సాన్నిహిత్యం పట్ల నేనేమీ ఆశ ఉంచుకోలేదు
వేరే అర్ధాలు స్పురింపజేస్తూ నా వంక చూడకు
మరిక నేనూ మాట్లాడేటప్పుడు నా మనసు చలించదు
నీ చూపులు అవిదాచుకున్న బాధను తెలియనీవులే
నిన్ను కుడా ఏవో చిక్కులు ముందుకు అడుగెయ్యనివ్వవు
నన్నూ లోకులు అంటారు ఎవో ముసుగులు వేసుకున్నానని
నా గతకాలపు తప్పిదాలు ఇక నా జతగాళ్ళు
గడచిపోయిన రాత్రుల నీడలు నీతోనూ ఉంటాయి
పరిచయమే సుస్తీ ఐతే దానిని మరచిపోవటమే మేలు
బంధమే బరువైపోతే దానిని తెంచుకోవటమే మంచిది
కథను ముగింపుకు తేవటం కష్టమైపోయిన
దానిని అందమైన మలుపు తిప్పి వదిలెయ్యటం మంచిది.

జీవితంలో చాలాసార్లు కొన్ని సంఘటల్ని 'అన్ డు ' చేయాలనో ఎరేజ్ చేయాలనో బాగా అనిపిస్తుంది.అన్ డు చేయలేకపోయినా ఆ సంఘటనల జ్ఞాపకాల ప్రభావం పట్ల ప్రతిస్పందన మనచేతిలోనే ఉందికదా అని ఒక ఓదార్పు.
ప్రత్యేకంగా ఈ పాటలో చివరిభాగం
'వో అఫ్సానా జిసే అంజాం తక్ లానా న హో ముంకిన్
ఉసే ఏక్ ఖూబ్ సూరత్ మొడ్ దె కర్ ఛోడ్నా అచ్చా '
చాలా నచ్చుతుంది.

No comments:

Post a Comment