Showing posts with label raj kapoor. Show all posts
Showing posts with label raj kapoor. Show all posts

Friday, May 5, 2017

జానే కహా వో దిన్

'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-76’

“జానే కహా వో దిన్ “(ఎక్కడికి పోయాయి ఆ రోజులన్నీ?)
మేరా నామ్ జోకర్ లో పాట ,గానం ముఖేష్, సంగీతం శంకర్ జైకిషన్, సాహిత్యం హస్రత్ జైపురి

‘మేరా నామ్ జోకర్’   సినిమా ఫలితం  రాజ్ కపూర్ కు నిరాశ కలిగించిందంటారు. ఐతే రోజులు గడిచాక సినిమా ఒక క్లాసిక్ గా మారింది.
రిపీట్ రన్ లో సినిమా చూసాను. . పేజీ లోపు ఉన్న ‘జాన్ కీట్స్’  కవిత  ‘హ్యూమన్ సీజన్స్ ‘ కు మూడు గంటల చిత్రరూపమనిపించింది. వ్యక్తి పూర్తి జీవితాన్ని అంటే బాల్యం నుంది వృద్దాప్యం వరకూ చూపే సాంఘిక చిత్రాలు అరుదు. ఈ సినిమా లో అది చూస్తాము.

కథానాయకుని జీవితంలో వివిధ దశల్లో అనుభవాలు (బాల్యంలో,యవ్వనంలో, మాన్ హుడ్(?) లో), ఆ దశల్లో ఎదురైన స్త్రీలు, వారితో ఏర్పడ్డ/ తెగిన బంధాలు, చివరిలో ఆ అనుభవాల నెమరువేత ,ఆంతరంగికశోధన ..వీటిని చెబుతూ కథానాయకునిఅనుభవాలతో ప్రేక్షకుల సహానుభూతుల్ని చేస్తుందీ సినిమా.

బాల్యంలో అతను తన తండ్రి లానే జోకర్ కావాలనుకుంటాడు. జీవిత భాగస్వామి జోకర్ జీవితాన్నిచూసి ఉన్న అతని తల్లి అదివద్దని వారించింది. తల్లి  అనుభవం అతనికి అక్కరకు రాలేదు.సర్కస్ లో జోకర్ గా అతని చేష్టలు ప్రేక్షకుల్ని నవ్విస్తుంటే, అతనికి జరగబోయే ఆపదల్ని తలుచుకుని తల్లి తల్లడిల్లుతుంది. తల్లి మరణం కారణంగా  అతను  కార్చే కన్నీరు కూడా ప్రేక్షకుల్ని ఆనందపరుస్తుంది.

బాల్యంలో తననభిమానించే టిచర్ పట్ల ఇష్టాన్ని పెంచుకున్నాడు. ఆమెకు దూరమై బాధపడ్డాడు. యువకుడైనాక ఒక యువతి కి సాయపడి ఆమెకు దగ్గరయ్యాననుకున్నాడు. ఆమె తారగా ఎదిగి దూరమయ్యింది. మరోదశలో సర్కస్ లో జోకర్ గా ఉన్నపుడు, ఓ రష్యన్ యువతి ఇతనిపట్ల ఇష్టాన్ని చూపింది. ఆ కథా సఫలంకాలేదు.

జీవితపు మలి సంధ్యలో సర్కస్ లో అతని పెర్ఫార్మెన్స్ చూడటానికి వీరంతా వచ్చారు.ఆ సందర్భం లో ఈ పాట .చూస్తున్న వారికి  గతం కళ్ళముందు కదలాడింది. వారి మనసూ కదులుతుంది.

“ఎక్కడికి పోయాయి ఆ రోజులన్నీ?
చెబుతుండేవారు
నా దారిలో చూపులు పరచి వుంచుతామని

నువ్వు ఎక్కడ ఉన్నా
నేను జీవితాంతం నిన్ను ప్రేమిస్తూనే వుంటాను
నున్ను మరువలేను

నా పాద ముద్రలు పడిన చోటల్లా
నా మిత్రులు వంగి ఆ నేలను ముద్దాడేవారు.
వెళ్లిపోయే వసంతం
నన్ను ఎంతగానో రోదింపజేస్తుంది

నిన్నాఈరోజూ ,నా కళ్ళకు
పగళ్ళు కూడా చీకటి రాత్రులే
నా నీడ మాత్రమే నా సహచరి”

మరో పాట ‘జీనా యహా మర్నా యహా ‘ కు కొనసాగింపు పై పాట తర్వాత వస్తుంది.

రేపటి ఆటలో నేనున్నా లేకున్నా
ఆకాశంలో తారలు ఎప్పటికీ ఉంటాయి
నువ్వు మరుస్తావు..వారు మరుస్తారు
కాని నేను ఎప్పటికీ మీవాడినే
నా గుర్తులు ఇక్కడ ఉంటాయి
ఇక్కడికి బదులు వెళ్ళగలిగేది ఎక్కడికి ?


నువ్వు కోరినపుడు నన్ను పిలువు
నేనిదివరకెక్కడున్నానో ఇప్పుడూ అక్కడే ఉన్నాను
నా రెండు లోకాలు ఇక్కడే.
ఇక్కడికి బదులు వెళ్ళగలిగేది ఎక్కడికి ?

-ముళ్ళపూడి సుబ్బారావు


Sunday, March 26, 2017


'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-5  ‘చలత్ ముసాఫిర్ మోహ్ లియారే ‘

Subbarao Mullapudi 
ి చలిమంట వేసుకుని కబుర్లు చెప్పుకోవడం,అప్పుడప్పుడు పాటలు పాడుకోవడం, పడుకుని,గడ్డి మేస్తూనో, నెమరేసుకుంటునో ఉన్న ఎడ్ల మెడలో గంటల సడి వాళ్ళ పాటలకి వాద్యసహకారం కావటం...ఇవన్నీ నాకున్న బాల్య స్మృతుల్లో భాగం.
అలాగేఒకమాదిరి పల్లె లో పెరగటంవల్ల పొలాల్లో పనిచేసుకునేవారు పాడుకునే పాటలు, గుడుల్లో భజన పాటలు నాకు బాగా పరిచయమే. రేడియోలో జానపదగీతాలు వినప డేవి.వివిధ్ భారతిలో మ ధ్యాహ్నం ‘లోక్ సంగీత్ ‘ పేరుతో వివిధ ప్రాంతాలల్లోని జానపద గీతాలు ప్రసారమయ్యేయి.
ఈ వివరాలకీ,కింది పాటకూ సంబంధం వుంది...
సినిమాల్లోనూ,సాహిత్యంలోనూ మనకు పరిచయమున్న వాతావరణమో,పాత్రలో కనిపిస్తే వెంటనే కనెక్టవుతాము.
తీస్రీకసం సినిమాలో ‘చలత్ ముసాఫిర్ మోహ్ లియారే ‘ పాట చాలా హుషారు గా సాగే జానపద గీతం.తక్కువ వాయిద్య ఉపకరణాలు,ప్రముఖంగా వినిపించేవి నాకు తెలిసిన హార్మోనియం,దోలక్..శైలేంద్ర సాహిత్యం..గానం మన్నాడె.
అచ్చమైన జానపదుల్లా,ఎవరినో మెప్పించడానికి కాకుండా తమ కోసం తాము పాడుకుంటున్నట్టుగా సాగే పాట. తక్కువ భాగం అర్ధమయ్యింది కానీ ఆకర్షణ ఉంది.
తర్వాత ఆ పాటను సినిమాలో చూశాను. ఆ పాటకి పెదవి కదిల్చింది కథానాయకుడు కాదు.పాడిందీ కథానాయకుడికి మిగతా పాటలు పాడిన ముకేష్ కాదు.
సన్నివేశం..... పల్లె ప్రాంతం,ప్రయాణికుల మజిలీ,చలిమంట,వాళ్ళంతా కలిసి పాడుకునే జానప దం.భాష హిందీ కాదు భోజ్ పురి.
“సంచారం లో ఉన్న ప్రయాణికుడు పంజరంలో ఉన్న మైనా(పక్షి) మీద మనసు పడ్డాడు(మోహించాడు)..
పక్షి ఎగిరెగిరి మిఠాయి దుకాణంలో దూరింది
బర్ఫిలో ఉన్న రసం మొత్తాన్ని తాగేసింది...
ఎగిరెగిరి బట్టల అంగడిలో వాలింది
బట్టల రంగు మొత్తాన్ని పులుముకుంది...
ఎగిరెగిరి ఒక పాన్ దుకాణంలో చేరింది
బీడా (కిళ్ళీ) లో ఉన్న రసాన్ని కొనిపోయింది.. “
పాటకు లోపలి అర్ధం వేరే వుండ వచ్చు.
పంజరంలో మైనా అంటే ఇంట్లో బంధింపబడ్డ స్త్రీ గా, మిఠాయి, బట్టలు,పాన్ లను, రుచికరమైనఆహారం, సొగసైన దుస్తులు, అలంకరణ లేదా సౌందర్య పోషణ సౌకర్యం.. ఇలా చూడొచ్చా?
పక్షి ప్రలోభాలవైపు పోతుందని హెచ్చరింపా?
పాట పిక్చరైజేషన్లో పాట పాడేవ్యక్తి ని,పక్కన వాయిద్యాలు వాయించేవారిని,కోరస్ అందుకునే వాళ్ళని , చిన్న తప్పెట వాయిస్తూ ఉప పాత్రధారిలా కనిపించే రాజ్ కపూర్ లను చూస్తే జీవన మాధుర్యాన్ని ఆ క్షణంలో ఎంతపొందుతున్నారొ అనిపిస్తుంది.అసూయతో కూడిన ఆనందం కలుగుతుంది.