Thursday, February 8, 2018

మై యహా తూ వహా ,జిందగి హై కహా

‘నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-133
‘మై యహా తూ వహా ,జిందగి హై కహా’
(నేనిక్కడ, నీవు అక్కడ ,జీవితం ఉన్నదెక్కడ?
బాఘ్ బన్ (2002) సినిమాలో అమితాబ్ బచన్,అల్కా యాగ్నిక్ పాడిన పాట.
సమీర్ రచన ,ఆదేష్ srivatsava,ఉత్తమ్ సింగ్ .
...
బాఘ్ బన్ (తోటమాలి) తోట కు తానే యజమానిననుకుంటే ఏమౌతుంది.
వయసుమీరిన తల్లిదండ్రులకు పిల్లలవలన బాధ కలిగేది వాళ్ళు తమ బాగోగులు చూడకపోవటం వల్ల లేదా పట్టించుకోకపోవటం వల్లనేనా? తల్లితండ్రులకు తినటానికి ,ఉండటానికి ఏర్పాటుచేస్తే వారిని పట్టించుకున్నట్టేనా? వాళ్ళపట్ల బాధ్యతతో ప్రవర్తించితేచాలా? పెద్దవాళ్ళను బానే చూసుకుంటున్నాం అని చెప్పటంలోని `బానే` గురించి ఎవరి నిర్వచనాలు వారివి.
ప్రాధమిక అవసరాలకోసం ఏర్పాటు తర్వాత కూడా రెండు తరాలు దూరంతనాన్ని అనుభవించటానికి కారణాలు ఎన్నోవింటుంటాం.దూరం అయ్యాం అని పెద్దవాళ్ళు అనుకోవటానికి నాకు తెలిసీ తెలియనట్టుండి, అమూర్తంగాఉన్న ఆలోచనకు ఒకమాటలో తెలియజెప్పింది `బాఘ్ బన్` సినిమాలో ఒకమాట.
తండ్రి కొడుకుల్ని పెద్దవాళ్ళనుచేసాడు.పెఌళ్ళు చేసాడు. వాళ్ళ ఇళ్ళు తన స్వంత ఇళ్ళే అనుకున్నాడు. కాని అతని అనుభవాలు తాను వారికి దూరమౌతున్నాని చెబుతున్నాయి.
అలాంటి స్థితి లో కొడుకు తండ్రితో అన్నమాట సుమారు అర్ధం `` అతిధిలా వచ్చినవారు అతిధిలా ఉండండి``.
దూరమవ్వటమంటే స్వంతమనుషులనుకున్నవారికి అతిధి కావటం.
ఎందుకు స్వంతమనుకున్న మనుషులు ఒకరినొకరు దూరం చేసుకుంటారు? పెద్దప్రశ్న. వందలాది సమాధానాలు.
`బాఘ్ బన్` సినిమా మూలకథ ఎనభైయేళ్ళనాటిది. భారతీయభాషల్లోనే సుమారు ఐదు సార్లు సినిమాగా వచ్చింది. అందులో `బడి పంతులు` సినిమా ఒకటి. ఐతే `బాఘ్ బన్ `సినిమాలో వివరాలు మరింత లోతుగా డీల్ చేయబడ్డాయి.
"నేనిక్కడ నీవక్కడ , జీవితం ఉన్నదెక్కడ?
నేనెక్కడ చూసినా నువ్వే నువ్వే
నిదుర రాదు, జ్ఞాపకం పోదు
నీవేలేకుంటే ప్రాణముండదు
చూచిన చోటల్లా తెలియని ఉదాసీనత తో కాలం ఆగిపోయింది.
గుబులుతో తనువు ఒంటరిదయ్యింది,కాలం దప్పికతో ఉంది
నా కళ్ళనుండి నీ వదనం ఒక్క క్షణమూ దూరమెందుకు కాదు?
రాత్రులు పగళ్ళు గడుస్తాయి కాని ఒంటిదైనకాలం గడవదెందుకు?
చెప్పాలనిఉన్నా నీతో ఏమీ చెప్పలేకున్నాను
బాధనెలా చెప్పగలను
ఏ అలికిడైనా నువ్వు వచ్చావని అనిపిస్తుంది
సుగంధపవనంలా నా ఊపిరీపరిమఌస్తుంది
మనం సదా కలిసున్న కాలముండేది
ఇప్పుడు ఎన్నో దూరాలు
ఒంటరిగాఉన్నపుడు గతకాలపు మాటలు గుర్తుకొస్తాయి
నిశ్శబ్దం మాట్లాడుతుంది, చాటుగా రోదిస్తాను
నవ్వి సంవత్సరకాలమైంది
కన్నీళ్ళు కథలను నింపుకున్నాయి"
https://m.youtube.com/watch?v=1lPAE9yq41s

No comments:

Post a Comment