‘నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-141
ఢోల్ బజ్ నే లగా ! గావ్ సజనే లగా
(డోలు మోగసాగింది,ఊరు అలంకరించుకుంటుంది)
విరాసత్ (1997) సినిమాలో పాట. ఉదిత్ నారాయణ్, కవితా కృష్ణమూర్తి గానం. జావెద్ అఖ్తర్ రచన, అను మలిక్ సంగీతం....
తమిళంలో మదురై పరిసర ప్రాంతాలు నేపధ్యమనుకోదగిన పేరులు ,వేషభాషలతతో వచ్చిన సినిమా తేవర్ మగన్.
తేవర్ మగన్ (తేవర్ పుత్రుడు) తెలుగులో క్షత్రియ పుత్రుడు అయ్యాడు. హిందీ లో ఠాకుర్ పుత్రుడు అయ్యాడు. హిందీ సినిమా పేరు విరాసత్ (వారసత్వం) గా మారింది.
దాయాదుల కక్షలు, వారితో పాటు విడిపోయిన గ్రామప్రజలు. అందులో ఒకటి మంచి పక్షం. ఆ పక్షపు నాయకుడి కొడుకు విదేశాలలో చదివి స్నేహితురాలితో ఊరికి తిరిగి వచ్చాడు. వచ్చినతను తమతో ఉండి తమబాగోగులు చూస్తాడని అతని పక్షం ఆశపడుతుంది. తండ్రి ఆశా అదే. పాట సందర్భం కొడుకు రాక.
శివాజీ గణేశన్ నటించిన అనేక పాత్రలు మిగతా భాషల్లో లబ్దప్రతిష్టులైన నటులనేకులు పోషించారు. మాతృక, రిమేక్ లు చూసిఉన్నపుడు శివాజీని మరపించటం కష్టమని చాలాసార్లు అనిపించింది. (మేజర్ చంద్రకాంత్ లో కట్టబ్రహ్మన పాత్రలో కనిపించిన ఎన్ టి ఆర్ , ఆ సందర్భం లో ‘కట్టబ్రహ్మన అంటే వారే గుర్తొస్తారు’ అన్నట్టు ఒకచోట చదివాను)
తేవర్ మగన్ సినిమాలో శివాజీ ధరించిన పాత్ర హిందీ లో అమ్రిశ్ పురి ధరించారు. నాకు ‘విరాసత్’ సినిమాను గుర్తు తెచ్చుకున్నపుడు భోజనం చేస్తూ కొడుకు ఊరిలో ఉండనని సిటీ లో ‘చైన్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్ ..రెస్టారెంట్స్’ పెట్టుకుంటానన్నపుడు ,’చాయ్ కి దుకాన్ ?‘అన్న ‘అమ్రిశ్ పురి’నే గుర్తొస్తాడు.
దర్శకుడు ప్రియదర్శన్ హిందీ లో నిలబడటానికి దోహదం చేసిన సినిమా. చెట్టినాడు హవుస్ (తమళనాడు) లో సినిమాతీసి ఉత్తరభారతమని నమ్మించగల సత్తా ఉన్నదర్శకుడు. ఈ పాటలో మాత్రం ఠాకుర్ ఇంటిలో రవివర్మ చిత్రం ‘ లక్ష్మిదేవి’ పటాన్ని ఉంచేసాడు.

“డోలు మోగసాగింది
ఊరు అలంకరించుకుంటుంది
ఎవరో తిరిగి వచ్చారు
తనతో ఎన్నో రంగులు తెచ్చాడు
మన మిత్రుడు వచ్చాడు
మనం ఆడుతూ పాడుదాం!
మన హృదయాలు నాట్యం చేస్తున్నాయి
మనం ఆడుతూ పాడుదాం!
వచ్చినవారు మననొదిలి తిరిగి పోగూడదు
చేతులు జోడించి పాదాలు మొక్కుతాం
మనసు గాయపరచి పోనివ్వం
మా యువరాజు వచ్చాడు ,రాజేశ్వర్ వచ్చాడు
తనతో రంగులెన్నో తెచ్చాడు
మన మిత్రుడొచ్చాడు
ప్రేమతో నిండిన మనసొకటి ఉంది
నా చిన్ననాటి నేస్తం,నా గ్రామం
ఈ నూతినీరు బహు తియ్యన
ఈ చెట్టు నీడ బహు చల్లన
ఈ గాలిలో విచ్చిన సంగీతం లా
గాలిమరల శబ్దం విను
శ్రావ్యమైన పాట లాఉంది
స్వరబద్దమైన పక్షికూత
ఎన్నోయేళ్ళతరవాత తిరిగి వచ్చాను
తెలుసుకున్నాను... ఈ ఊరి రీతి రివాజులు శతాబ్దాలనాటివి”

No comments:
Post a Comment