‘నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-140
లిఖే జో ఖత్ తుఝే
(నీకు లేఖ రాస్తే )
...
కన్యాదాన్ సినిమాలో మహమ్మద్ రఫీ పాడిన పాట.నీరజ్ రచన,శంకర్ జై కిషన్ సంగీతం.
శశికపూర్ సినిమాల్లో పాటలు బాగుంటాయి. కారణం అవి శశి కపూర్ వి కావటమా? లేక అరవై డెబ్భైలలో అతని సినిమాలు రావటమా?
`చోర్ మచాయే షోర్` సినిమా లో మొదటిసారి శశికపూర్ ను చూసాను. ఆ తర్వాత ‘ఫకీరా’ సినిమా. ఇవి చూడటానికి కారణంఅవి తెలుగులో కృష్ణతో రావటం. రెంటిలోనూ తెలిసిన పాటలున్నాయి. అప్పటికి వివరాలు తెలియవు కానీ రెంటికీ రవీంద్ర జైన్ రచన, సంగీతం చేసారు. చోర్ మచాయే షోర్ లో రెండు పాటలు కిశోర్ కుమార్ వి,రెండు రఫీ వి.ఇప్పటికీ మనసుకోరే పాటలే. జాగ్రత్తగా `పావ్ మె డోరీ ` పాట వింటే అందులో `గోరి తెరా గావ్ బడా ప్యారా`(చిత్ చోర్) కు బీజాలు దొరుకుతాయి.
`ఫకీరా`లో ఖవాలీ, టైటిల్ సాంగ్, `దిల్ మె తుఝె బిఠాకె` పాటలు వినసొంపైనవే.
అంతకుముందుపాటలు..షర్మిలి లో `ఖిల్ తె హై గుల్ యహా`, ` ఓ మెరి శర్మిలి` పాటలు ,ప్యార్ కా మౌసమ్ లో `తుమ్ బిన్ జావూ కహా`, ని సుల్తనా రే రేడియోలో తరచూ వినపడేవి. జబ్ జబ్ ఫూల్ ఖిలే లో బాగుండని పాటఏది?

డెబ్బైఐదు తర్వాత శశికపూర్ నటించిన మల్టీ స్టారర్ లు .త్రిశూల్ నుండి సిల్ సిలా వరకూ మహమ్మద్ రఫీ,కిశోర్ కుమార్ లు పాడిన పాటలు మనోరంజితాలు.
శశి కపూర్ ను పాతసినిమాలలో చూస్తే సంస్కారవంతంగా పెరిగిన పెద్దింటి అబ్బాయిలా ఉంటాడు. రాజేశ్ ఖన్నా లా అమ్మాయిలకు హార్ట్ థ్రోబ్ కాడు. ధర్మేంద్ర లా కండగల వాడుకాదు. అమితాబ్ లా హై ఇంటెన్సిటీ నటన చూపగలవాడుకాదు. ఐనా వీరందరిమధ్యా సంవత్సరానికి ఐదారు సినిమాలు చొప్పున నటించగలిగాడు.
వారితో పాటు అనేక మల్టి స్టారర్లలో పాత్రోచితంగా నటించి తన ఉనికిని తెలియజెప్పాడు. అందులో అనేక సన్నివేశాలను బాలెన్స్ చేయగలిగాడు.
దీవార్ లో అన్నదమ్ముల బావోద్వేగాలతో కూడిన సంభాషణ నలభైయేళ్ళుగా ప్రతిధ్వనిస్తూనేఉంది.

కాలా పత్థర్ సినిమాలో వేరు వేరు కారణాలతో జ్వలిస్తూ సంఘర్షించే అమితాబ్, శతృఘన్ సిన్హా ల మధ్య సయోధ్యయత్నించే పాత్రను ప్రతిభావంతంగా పోషించాడుఱోటి కపడా ఔర్ మకాన్, కభీ కభీ, సిల్ సిలా సినిమాలలో అర్ధవంతమైన నటన చూపాడు.
నటుడు శశి కపూర్ కు వీరాభిమానులు తక్కువ.అలాగే అభిమానించనివారు ఇంకాతక్కువ. అతను సినిమాను తన భుజానవేసుకుని విజయపధానికి చేరవేసినవి అరుదు. అలాగని అతనున్న సినిమాకు అతనెప్పుడూ బరువుకాలేదు. అతను తన సినిమాలలో `ప్రదర్శనను కొల్లగొట్టిన` సందర్భాలు ఉండవు.కాని అతను ఆ సినిమాలో లేకుంటే అది లోటే ఔతుంది.
''నీకు లేఖ రాసినపుడు, నీ జ్ఞాపకాలతో
వేలాదిరంగులతో నిండిన దృశ్యమయ్యింది
పొద్దుపొడిచినపుడు పువ్వులామారింది
రాత్రివేళలో తారల్లా మారింది
ఎక్కడ ఏ పాట వినపడినా నువ్వొచ్చావని మనసు చెప్పింది
ఎప్పుడు ఏ మొగ్గ వికసించినా నువ్వు సిగ్గుపడుతున్నవని అనుకున్నాను
ఏ సుగంధం వ్యాపించినా నీ కురులు తేలియాడుతున్నాయనిపించింది

వాతావరణం రంగులమయం, సొగసు రంగులమయం, ఈ లజ్జ,ఈ సిగ్గు
ఈ వళ్ళు విరుపు, ఈ వంటరితనం, బాధించటం, వదలిపోవటం
ఈ యవ్వనమాయ పిచ్చివాడిని చేయనిదెవరిని?
నీవెక్కడో నేనక్కడే, నాహృదయ స్పందన నువ్వే
నేను యాత్రికుడ్ని నూవ్వు గమ్యానివి, నేను దాహాన్ని నువ్వు వానజల్లువు
నీ చూపులే నా ప్రపంచం, నీ పైటనీడే నా స్వర్గసీమ''

`శ్రీదేవి `సినిమా లో రాసాను ప్రేమలేఖలెన్నో పాటపై ఈ పాట ప్రభావం ఉందనిపిస్తుంది.
No comments:
Post a Comment