‘నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-142
‘కహీ ఎక్ మాసూమ్ నాజుక్ సి లడ్కి’
(ఎక్కడో ఒక నాజూకైన అమాయకపు అమ్మాయి.)
‘శంకర్ హుస్సేన్’(1977) సినిమాలో పాట. కమల్ అమ్రోహి రచన,ఖయ్యాం సంగీతం,మహమ్మద్ రఫీ గానం
‘శంకర్ హుస్సేన్’ సినిమా తెలుగునాట ప్రదర్శితమయ్యిందోలేదో తెలియనంత అనామకంగా సినిమా వచ్చివెఌంది. కాని అందులోని రెండుపాటలు సినిమా పేరును మరులేనట్టు చేసాయి. అందులో ఒకటి ‘బహుత్ ఖూబ్ సూరత్ ...కహీ ఏక్ మాసూమ్ నాజుక్ సి లడ్కి’. (మరొకటి ‘ఆప్ యూ ఫాసిలోం సె గుజర్ తే రహే’ లతామంగేష్కర్ గానం)
చాలా తక్కువ సంగీత ఉపకరణాలు, హెచ్చు తగ్గులు లేకుండా ఒకే స్థాయిలో సాగే గానం, విభిన్నతతో కూడిన గీతరచనలతో సాగే పాట మనసుకు హాయిగొలుపుతుంది.
‘పాకిజా’ ‘రజియా సుల్తాన్’ వంటి పెద్దసినిమాలమధ్య దర్శక, నిర్మాత, రచయిత ఐన ‘కమల అమ్రోహి’ తీసిన చిన్నసినిమా ‘శంకర్ హుస్సేన్’.ఆయన పరిమితమైన సంఖ్యలో రాసినపాటల్లో ఇది ఒకటి.
చిన్నసినిమాలో పెద్దపాట. కాలవ్యవధిలోనూ, నాణ్యతలోనూ పెద్దదే.
“ఎంతో అందం
ఎంతో అందం...కొద్దిగా ఛాయతక్కువకానీ..
ఎక్కడో ఒక నాజూకైన అమాయకపు అమ్మాయి.
తన కలలో నన్ను చేతుల్లోకి తీసుకుని
ఎప్పుడో నిద్రలో నవ్వుతూ ఉందేమో
నిదురలో అటూ ఇటూ దొర్లుతూ ఉందేమో
తల కింది దిండును జార్చుకుని ఉందేమో
ఎక్కడో ఒక నాజూకైన అమాయకపు అమ్మాయి.
పగటికలలు మనసు వాకిలిలోకి వచ్చి
ఆమెను లోలోపల సమ్మోహనపరుస్తుండవచ్చు
నిశ్చలంగా ఉన్న ఆమె గుండెలోని నిశ్శబ్దాన్ని
నాజ్ఞాపకాలసడి భంగపరచి ఉండవచ్చు
అసంకల్పితంగా నెమ్మదైన స్వరంతో
నాపాటలో తనూ గొంతుకలుపుతూ ఉండవచ్చు.
ఎక్కడో ఒక నాజూకైన అమాయకపు అమ్మాయి.
లేఖ రాయాలని తనకు అనిపించిందేమో
కాని వేళ్ళు కంపిస్తున్నాయేమో
చేతినుండి కలం జారిపోతుండవచ్చు
కోరిక తిరిగి చేతితో కలాన్ని పట్టించి వుండవచ్చు
నాపేరు తన పుస్తకంలో రాసి
పళ్ళమధ్య వేలు పెట్టి వుండవచ్చు
ఎక్కడో ఒక నాజూకైన అమాయకపు అమ్మాయి
ఎప్పుడో నిట్టూర్చి ఉండవచ్చు
తనువు కొంచెం కొంచెం జ్వలిస్తూవుండవచ్చు
తన అడుగులు తడబడుతుండవచ్చును
ఆమె దుపట్టా వేలాడుతూ నేలకు ఆనివుండవచ్చును
ఎప్పుడో ఉదయాన్ని సాయంత్రమనుకునివుండవచ్చు
ఎప్పుడో రాత్రిని పగలు గా అనుకుని వుండవచ్చు
ఎక్కడో ఒక నాజూకైన అమాయకపు అమ్మాయి
చేతులనుండి అన్నీ జారిపోతూవుండవచ్చు
పనులన్నీ అన్యమనస్కంగా చేస్తుండవచ్చు
పళ్ళేలు జారి పగిలిపోతూండవచ్చు
అప్పుడు పొయ్యిమీది పాలు పొంగిపోతుండవచ్చు
చివరగా, తన పసితనపు అమాయకత్వంతో
ఆ నాజూకు తనువు సిగ్గుపడుతూ ఉండవచ్చు
ఎక్కడో ఒక నాజూకైన అమాయకపు అమ్మాయి.”

No comments:
Post a Comment