‘నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-134
“కల్ కీ దౌలత్ ఆజ్ కీ ఖుషియా”
(నిన్న సంపద, నేడు ఆనందం)
అస్లీ -నక్లీ (1962) సినిమాలో మహమ్మద్ రఫీ పాడినపాట. శైలేంద్ర రచన, శంకర్ జై కిషన్ సంగీతం.
...

కథానాయకుడు సంపదలో పుట్టి పెరిగాడు. ఆ సంపద అతను సృష్టించింది కాదు. నచ్చని ఆమె ను పెల్లి చేసుకోవటం ఇష్టం లేక సంపదకు దూరమయ్యాడు. వేరే జీవితాన్ని చూస్తున్నాడు. తనుచూసిన పాత ప్రపంచం , చూడబోయిన ..చూస్తున్న కొత్తప్రపంచం...వీటిలో ఏది అసలు ఏది నకిలీ అన్నది అతని ప్రశ్న.
పనిలో ఇష్టం ,నైపుణ్యం ఉండి ,శక్తి మేరకు మాత్రమే పని చేస్తూ , పనికి సరిపడా ప్రతిఫలం పొందుతున్న వారు పనిచేసేటపుడు చేస్తుంటే కళాసృష్టి ని చూస్తున్నట్టే ఉంటుంది.
ఈ పాట చిత్రీకరణ లో అనేక వృత్తులవారు శ్రమ చేస్తూ కనపడతారు.శ్రమ సౌందర్యం కనపడుతుంది. చిత్రీకరించే కెమేరా కథానాయకుని కళ్ళద్వారా చూస్తుంది. అతనికి కలిగిన ఆలోచనల్ని మనకి చూపుతుంది. అతనికి కొత్తప్రపంచంలో ఆనందం కనపడుతుంది.అక్కడ అందరూ ఆనందం తో ఉన్నారనీ నమ్ముతున్నాడు. అక్కడి మనుషుల్లో మంచి కనపడుతుంది. అది అసలా నకిలీనా అన్నదో ప్రశ్న.
నిన్నటి సంపద ... నేటి ఆనందం
వారి దర్బారులు ,...మన వీధులు
అసలు ఏది ? నకిలీ ఏది ? నా మనసు నడుగు
అబద్ధపు సంబంధాలు వదులుకుని మనసున్నవారిలోకి వచ్చాను
నిజం చెబుతాను సంపద కూడబెట్టేవాళ్ళలో దొంగలు అధికం
ఆ ప్రపంచంలో పలకరించేవాడేలేడు. ఈ ప్రపంచం ప్రేమ ఇచ్చింది
మనసనే రాజమందిరంలో కూర్చుండబెట్టి కలలప్రపంచాన్ని ఇచ్చింది
ఆకాశంలో బ్రతికేవారూ ..నేలను గుర్తుపట్టండి
నమ్మూ నమ్మకపో !పువ్వులు ఈ మట్టిలోనే పరిమఌస్తాయి

No comments:
Post a Comment