‘నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-135
బేసన్ కి సోన్ధి రోటి పర్ ఖట్టి చట్ని జైసి మా
(చక్కని శనగ రొట్టె పై, పుల్లనైన పచ్చడిలా అమ్మ)
తొంభైల మధ్యలో మొదలైన ప్రవేటు టి వీ చానెళ్ళ అవసరాలకోసమనుకుంటా , ఎన్నో వీడియో ఆల్బమ్ లు వచ్చాయి. అందులో ఒకటి `అమన్`. పంకజ్ ఉధాస్ పాడిన గజళ్ళతో వచ్చిందది. ఆ ఆల్బమ్ లో ఒక పాట ఇది. దీనిని రాసినవారు నిదా ఫజ్లి. ...
పంకజ్ పాడటమే కాదు అందులో నటించాడుకూడా. ప్రత్యేకంగా క్లోజ్అప్ లలో పాటకు తగినట్టు కనిపించాడతను. తల్లి గా కనపడే ఆమె నటి `బీనా`. తల్లి పాత్రల్లో చాలా చిత్రాల్లో నటించింది.
పాటలో ఉన్న చాలా పదాలకు నేను అర్ధం చేసుకున్నది కరెక్టో కాదో తెలియదు. పాట వింటున్నా ,చూస్తున్నా అర్ధం అవసరం పడలేదు.
ఇల్లు అనే సామ్రాజ్యానికి కోట గోడలు పెద్ద బలమైనవి కావు. అలాంటి ఇంటికి ఎలుకనుండి దొంగ వరకూ ఎందరో శత్రువులు. అమ్మ ఇంటికి కాపలాదారు. అమ్మ ఎపుడూ మేలుకునే ఉంటుంది.పొయ్యిలా మండిపోతుంటుంది. గిలక లా తిరుగుతుంటుంది. ఆమె గాజుల శబ్దంలోనూ మనకి ధైర్యాన్నిచ్చే `మార్చింగ్` సాంగు వినగలం. తన సౌందర్యాన్ని ,వయసుని కళ్ళలో వెలుగునూ పిల్లలకూ కుటుంబానికి పంచేసింది.అందరిలోనూ కొద్ది కొద్దిగా కనపడుతుంది.
పాటలు కొన్ని మనని గతంలోకి తీసుకెళతాయి. అప్పటిని ,ఇప్పటి కళ్ళతోనో మనసుతోనో చూసేలా చేస్తాయి. దానితో కొన్ని ఆనందాలు కొన్ని పశ్చాత్తాపాలు కలుగుతాయి. కొన్ని సార్లు చేయాల్సిని పనులను గుర్తుచేసి కార్యోన్ముఖులను చేస్తాయి. అలాంటి పాట ఇది.

``చక్కని శనగ రొట్టె పై
పుల్లనైన పచ్చడిలా అమ్మ
గుర్తొస్తున్నాయి వెదురు మంచం
పొయ్యి ,పటకారు, బావి గిలక ….
నులక మంచం పైనుండే
ప్రతీ అలికిడి పైనా చెవివొగ్గుతుంది
సగం నిద్ర, సగం మెలకువతో
అలసిన మధ్యాహ్నం లా అమ్మ
ఆమె గాజుల శబ్దంలో
కొన్నిసార్లు అన్నపేరు,కొన్నిసార్లు నాపేరు వినవస్తాయి
కోడికూతతోనే తెరుచుకునే
ఇంటి వాకిలి ముగ్గులా లా అమ్మ
భార్య, కూతురు, సోదరి, పక్కఇంటి ఆమె
అందరిలో కొద్ది కొద్దిగా...
రోజంతా తాడుపై
నడుస్తున్నఆమెలా అమ్మ
తన వదనాన్ని ,నుదుటిని,కళ్ళను
పంచేసి తను ఎక్కడికెఌందో
చిరిగిపోతున్న పాత ఆల్బమ్ లో
చలాకీ పిల్లలాఉన్న అమ్మ``

No comments:
Post a Comment