'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-14: 'జవా హై మొహబ్బత్ ..హసీ హై జమానా'
ఎనభై ప్రాంతాలలో 'వీక్ ఎండ్' అనే మాగజీన్ టాబ్లాయిడ్ సైజ్ లో వచ్చేది. మధ్య పేజీ, చివరి కవర్ పేజీ లలోనూ బ్లో అప్ ఫొటోలువచ్చేవి. చాలామందిమి వాటిని రూము గోడపై అంటించేవాళ్ళం. ఒక వారం లతా మంగేష్కర్ తన అంతేవాసి ఉన్నమరోమహిళనుఆలింగనం చేసుకుంటున్న ఫొటో బ్లోఅప్ గా వచ్చింది.ఆ మాగజీన్ లో ఫోటోలు ఎక్కువ,వివరాలు తక్కువ. దొరికినంత వివరాలల్తో చూస్తేఆవిడ 'నూర్జహాన్ ' అని ఒక పాకిస్తానీ గాయనీమణి.
తరవాత ఒక సారి రేడియోలో ఆ పేరు తో ఒక పాట వచ్చ...ింది. ఆపాట అప్పటికి విన్నదేకాని గాయనిపేరు మనసులోనాటుకున్నట్టులేదు.అలా నా గాయనీమణుల జాబితాలో మరోఆమె చేరింది.
తరవాత తెలిసిన వివరాలు..ఆమె తొలితరం సినిమా నటగాయకురాలు, బడేగులాం అలిఖాన్ వంటివారివద్దశిష్యరికంచేసింది,చాలాసినిమాల్లో హీరొయిన్ గా నటించింది.నిలిచివుండే పాటలు చాలాపాడింది. దేశవిభజన అనంతరం పాకిస్తాన్ కుతరలింది.సినిమాలు నిర్మించింది.దర్శకత్వం చేసింది.పెద్దపెద్ద బిరుదులు పొందింది. ఇంచుమించు భారతదేశంలో 'లత ' లాంటి స్థితిపాకిస్తాన్ లో అనుభవించింది.1982లో భారతదేశ పర్యటనకు వచ్చింది.నేను చెప్పిన బ్లోఅప్ ఆసందర్భంలోనిదే.
ఆరకంగా చూస్తే నేను తెలిసీతెలియక రూము గోడమీద అతికించుకున్న ఫొటొ మామూలుదికాదు. సినీసంగీత సామ్రాజ్యాన్ని రెండుగాపంచుకుని అధినేతృత్వం వహిస్తున్న ఇద్దరు మహారాణుల కలయికకు సంబంధించింది.
పాతపాటలు వినేవాళ్ళకు 'అనుమోల్ ఘడి ' సినిమా బాగా పరిచయమున్నదే. అనుమోల్ ఘడి అంటే నాకుతెలిసిన హిందీ తో అమూల్యఘడియలు అనుకునేవాణ్ణి. ఐతేసినిమా చూస్తే అర్థమైంఐంది అమూల్యమైన గడియారం అని.బాల్యప్రేమ,గడియారంగుర్తు,నాయకిమారుపేరుతో చేసిన రచనలో పాత జీవితాన్ని చూసి నాయకుడు గుర్తుపట్టటం ..కథ ఇలా సాగుతుంది.
ఆసినిమా లో అన్నీ హిట్ గీతాలే(హిట్ కు నా కొలత..ఇప్పటికీ నేను మళ్ళీ మళ్ళీ వినగలిగేవి,ఇప్పటికీ వినిపిస్తూ ఉండేవి). అందులో ఒకపాట 'జవా హై మొహబ్బత్ ..హసీ హై జమానా'.ప్రస్ఫుటంగా,సంగీతం ముందుకువచ్చి వినపడే స్వరం,మంచి సంగీతం(నౌషాద్),సరళమైన పదాలు..పాటను సతత హరితం చేశాయి.(ఇంకో డెఫినిషన్.. సదాబహార్(హిందీ)--->ఎవర్ గ్రీన్(ఇంగ్లీష్)--->సతతహరితం(తెలుగు)). పాట చిత్రీకరణ కూడా నూర్జహాన్ పైనే.. ఈ పాట వచ్చి డెబ్భై సంవత్సరాలు దాటింది.అలా అనిపిస్తుందా?
ముళ్ళపూడి సుబ్బారావు

No comments:
Post a Comment