ఝూమ్ బరాబర్ ఝూమ్ షరాబీ
(సరిగ్గా ఊగు… తాగుబోతు..,సరిగ్గా ఊగు)
'మందిరాలలో కాదు మదిర లోనే శాంతి దొరుకుతుంది’ అని చెప్పే పాట....
(5రైఫిల్స్ సినిమా లొ అజీజ్ నజా పాడిన పాట.నజా షోలాపురి రచన,కల్యాణ్ జీ ఆనంద్ జీ సంగీతం)
ఝూమ్ బరాబర్ ఝూమ్ బరాబర్ ' పాట అమితాబ్, అభిషేక్ బచ్చన్ల నృత్యంతో ఇటీవల బాగా ప్రాచుర్యంపొందింది.ఐతే ఆ పాట వేరే సినిమా పాటగా చిన్నప్పటినుండీ వింటున్నా. ఆ గాయకుడిది విభిన్నమైన స్వరం. ఆ పాట మినహా అతనివి వేరే సినిమా పాటలు వినలేదు. కొత్తగాఉన్న సంగీతం,తమాషాగా ఉన్న పాట అర్ధం.సినిమా పేరు పాంచ్ రైఫిలె’ . రేడియో లో కొన్నిసార్కు ఫైవ్ రైఫిల్స్’అని కూడా వినపడేది. పేరు వినపడటమే కాని సినిమా ఎక్కడా (చూడటానికి) కనపడలేదు.
ఆ పాట ఒక ఖవ్వాలి. పాడినాయన ‘అజీజ్ నజా’ . ఖవ్వాలీ గాయకునిగా ప్రసిద్ధుడు. రాసినాయన 'నజా షోలాపురి’’.
ఖవ్వాలీలను సూఫీ గాయకులు తాత్వికతతో ముడిపెట్టి గానంచేసేవారంటారు. ఐతే సినిమాలలో ఎక్కువభాగం ఖవ్వాలీలు ప్రేమకు సంబంధించో, పోటి లాగానో లేదా మదిరాపానాన్ని గొప్పచేసేవిగానో ఉంటాయి.చాలా సినిమా ఖవ్వాలీలు హిట్ ఐనవే.ఖవ్వాలీ పాటల్ని ప్రత్యేకంగా కాసెట్టుగా రికార్డ్ చేయించుకుని కూడా వినేవాడిని.వాటిలో ఎక్కువ రఫీ,మన్నాడే,(కొద్దిగా కిశోర్ కుమార్) ,లతా,షంషాద్ బేగం,ఆశా భోన్‌స్లే లు పాడినవి.
పాటల ప్రేమికులైన నా స్నేహితుల మద్యపాన గోష్టులలో ‘ఝూమ్‌బరాబర్ ఝూమ్ షరాబీ' పాట ఖచ్చితంగా ప్రస్తావన వస్తుంది.మిగతా హిందీ పాటల అర్ధంగురించి పట్టించుకోకపోయినా ఈ పాట అర్ధం తెలుసుకుమరీ ఆనందించిన స్నేహితులు తెలుసునాకు.
పాట అర్ధం రమారమీ
“నిషేదాలలో మందిరాల లో శాంతి దొరకదు
ప్రశాంతత ఎక్కడైనా దొరుకుతుందంటే ,అది నీ మధుశాలలోనే ….
ఊగు ఊగు ఊగు
సరిగ్గా ఊగు… తాగుబోతు..,సరిగ్గా ఊగు
నల్లటి మబ్బులున్నాయి, మహదానందకరమైన వాతావరణం వుంది.
మధుపాత్ర ఎత్తిపట్టి గిరగిరా తిరుగు
ఈరోజు ద్రాక్ష కుమారితో ప్రేమలో పడు
గురువుగారి సలహాలపై తిరుగుబాటు చెయ్యి
ఈ ద్రాక్ష కుమారి తన శిరసు పై ప్రపంచాన్ని నిలుపుకుంది
ద్రాక్షకు కుమారుడు ఉండకపోవటం మంచిదయ్యింది
కనీసం మెరుస్తున్న సాకీ ముఖమన్నా చూడు
మధుశాల కు వచ్చి జీవించటానికి ఆసరా తీసుకో
కళ్ళు కలిస్తే యవ్వనపు మజా తెలుస్తుంది
నీకు ద్రాక్ష రసం మజా తెలుస్తుంది
నీ ప్రతీ చూపును గులాబీ రంగులోకి మార్చుకో
ప్రపంచాన్ని తాగుబోతు చేసేంతగా తాగు
మధుపాత్ర చెంతకు వస్తే దూరంగా వుంచేదెలా?
విషయం తాగేదైనప్పుడు బెదిరేందుకేముంది?”
-ముళ్ళపూడి సుబ్బారావు
“నిషేదాలలో మందిరాల లో శాంతి దొరకదు
ప్రశాంతత ఎక్కడైనా దొరుకుతుందంటే ,అది నీ మధుశాలలోనే ….
ఊగు ఊగు ఊగు
సరిగ్గా ఊగు… తాగుబోతు..,సరిగ్గా ఊగు
నల్లటి మబ్బులున్నాయి, మహదానందకరమైన వాతావరణం వుంది.
మధుపాత్ర ఎత్తిపట్టి గిరగిరా తిరుగు
ఈరోజు ద్రాక్ష కుమారితో ప్రేమలో పడు
గురువుగారి సలహాలపై తిరుగుబాటు చెయ్యి
ఈ ద్రాక్ష కుమారి తన శిరసు పై ప్రపంచాన్ని నిలుపుకుంది
ద్రాక్షకు కుమారుడు ఉండకపోవటం మంచిదయ్యింది
కనీసం మెరుస్తున్న సాకీ ముఖమన్నా చూడు
మధుశాల కు వచ్చి జీవించటానికి ఆసరా తీసుకో
కళ్ళు కలిస్తే యవ్వనపు మజా తెలుస్తుంది
నీకు ద్రాక్ష రసం మజా తెలుస్తుంది
నీ ప్రతీ చూపును గులాబీ రంగులోకి మార్చుకో
ప్రపంచాన్ని తాగుబోతు చేసేంతగా తాగు
మధుపాత్ర చెంతకు వస్తే దూరంగా వుంచేదెలా?
విషయం తాగేదైనప్పుడు బెదిరేందుకేముంది?”
-ముళ్ళపూడి సుబ్బారావు
No comments:
Post a Comment