'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-28
'దిల్ కే అర్మా ఆసువోమె బెహగయే'
(హృదయంలోని ఆశలన్ని కన్నీటితో ప్రవహిస్తున్నాయి.)
...
'దిల్ కే అర్మా ఆసువోమె బెహగయే'
(హృదయంలోని ఆశలన్ని కన్నీటితో ప్రవహిస్తున్నాయి.)
...
కొత్తది విలక్షణమైనమైనది ఐన స్వరం 'నిఖా' సినిమా పాటలద్వారా వినవచ్చింది.ఆ స్వరం 'సల్మా ఆఘా'ది.ఆ పాటలు చాలా ప్రాచుర్యంపొందాయి. సినిమా ఏలూరులో 'బాలాజీటాకీస్ 'లో వచ్చింది.ఒక స్నేహితునితో ఆ సినిమాకు వెళ్ళాను.జనం పలచగా ఉన్నారు.హిందీ సినిమాలో సంభాషణలే సరిగా అర్ధంకావనుకుంటే ఇందులోవి మరింత అర్ధంకానట్టు వున్నాయి.మహేంద్రకపూర్ పాట ఒకటి పూర్తయ్యింది. సినిమాలో ఎదో కొత్తవిషయం చెప్పబోతున్నడు.ఫాలో కావటానికి బాగా ప్రయత్నిస్తున్నా.పక్కకి చూసా.నా స్నేహితుదు అసహనంగా సీట్లో కదులుతున్నాడు. నాకు తెలీని కల్చరు తో సినిమా నడుస్తుంది.బయటవిన్న పాటలకోసం ఎదిరుచూస్తున్నా.పాతమొదలౌండగా నా స్నేహితుడు చేతులురెండూ పైకెత్తి వళ్ళువిరుచుకుంటూ ,గట్టిగా అవులిస్తూ నా మొహంలోకి చూసాడు. నేనేం తప్పుచేసానో అర్ధమైంది.ఎమోషన్లు కష్టంమీద అణచుకుని "వెళ్ళిపోదామా?" అన్నాను.ఆ మాటకోసమే చూస్తున్నట్టున్నాడు. బయటకొచ్చేసాం.
ఆరోజూ రెండవ ఆట ఒక్కడ్నే చూసాను.
‘దిల్ కె అర్మా ‘ పాట ఎప్పుడు విన్న పైసంఘటన గుర్తుకొస్తుంది.
“హృదయంలోని ఆశలన్ని కన్నీటితో ప్రవహిస్తున్నాయి.
నేనెంత విశ్వాసంచూపినా ఒంటరిగానే మిగిలిపోయాను
జీవితం ఒక తీరని దాహంగానే మిగిలింది
ప్రేమ కథలన్నీ అసంపూర్ణంగానే మిగిలాయి
బహుశా అతను కలిగించే చివరిబాధ ఇదేకావచ్చు.
అలా అనుకొనే ప్రతీబాధను భరిస్తున్నాను.
నేనే నేను లేనట్టు చేసుకున్నాను
కాని మామధ్య దూరాలు అలాగే ఉండిపోయాయి”
హైదరాబాదీ ముస్లిం కల్చర్, ఆర్ట్స్ కాలేజి బిల్డింగు, పాతబస్తిలోని భవనాలు,బాక్ డ్రాపులో కనిపించే చార్మినారు,చిత్రమంతటా వినవచ్చే ఉర్దూ, ఒకదానికొకటి సాటివచ్చే పాటలు... ఇవన్నీ 'నిఖా' ని ఒక ప్రత్యేక చిత్రంచేశాయి.కథ పైకి ముస్లిం లా లోని 'తలాక్,తలాక్,తలాక్' చుట్టూ తిరుగుతున్నట్టున్నా సారాంశంలో ఇది ఏమతంలో స్త్రీ కైన వర్తించేదే అనిపిస్తుంది.
సంపన్నుడైన భర్త, అతని తో నిర్లక్ష్యంచేయబడ్డ భార్య, ఆమెను అజ్ఞాతంగా ప్రేమించిన సహపాఠి..వీరి మధ్య కథ ఈ సినిమా.హీరోయిన్ గా నటించిన పాకిస్తానీ నటి,సల్మా ఆఘా గాయని కూడా. ఆమె తన పాటలు తానే పాడుకుంది.అందులో ఒక పాట ఇది.
బి.ఆర్.చోప్రా చిత్రాలకు ఎక్కువగా పనిచేసిన సంగీత దర్శకుడు 'రవి ' దీనికీ పనిచేశాడు. 'హసన్ కమాల్ ' ఈ పాటకు రచయిత.
-ముళ్ళపూడి సుబ్బారావు

No comments:
Post a Comment