డకియా డాక్ లాయా….
(పోస్ట్ మాన్ పోస్ట్ తీసుకు వచ్చాడు)
గుల్జార్ రచనను lakshmikaanth pyaarelaal స్వరపరచగా కిశోర్ కుమార్ పాడారు.సినిమాపేరు 'పల్కోమ్‌కి చావ్ మె ' (కనురెప్పల నీడల్లో ).
...
పోస్టు,పోస్ట్ మాన్,పోస్ట్ మాస్టర్ ,పోస్ట్ ఆఫీసు ....ఇందులో ఏమాటవిన్నా ఎన్నో ఉద్వేగాలు,ఏవేవో అనుభూతులూ గుర్తొస్తాయి.రవీంద్రుని 'పోస్ట్ మాస్టరు ' కథ, బాలగంగాధర తిలక్ కవిత ' తపాలా బంట్రోతు ' అసంకల్పితంగా గుర్తొస్తాయి.
టెలిఫోన్లు, ఇతర సమాచార వ్యవస్థ రాకమునుపు,ఇంచుమించు మధ్య తొంభైలవరకూ, సమాజాన్ని అనుసంధానించింది తపాలా వ్యవస్థే. అందులో పోస్ట్ మాన్ ముఖ్యమైన ఇంటర్ ఫేస్. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పోస్ట్ మాన్ ఓ కుటుంబసభ్యునిలా మారిపోతాడు.
అతను దూరాల దారాల్ని విచిత్రంగా... ఒకేనిముషం ..అనే కండె చుట్టూ తిప్పగల నేర్పరి.. కూర్పరి.అతని మేజిక్ సంచిలో నిట్టూర్పులు,నవ్వులు,పువ్వులు,ఆనందాలు,అభినందనలు,ఏడుపులు..ఏ క్షణంలో ఏది తీస్తాడో ..ఆక్షణాన అతను రాజుతో సమానం.(ఈ వాక్యాలు తిలక్ వి)
ఈ సినిమాలో కథానాయకుడు ఒక వూరిలో పోస్ట్ మాన్ గా పనిచేస్తున్నాడు.సైకిల్ పై తపాలా తెస్తూ పాట పాడుతున్నాడు.అతని సైకిల్ బెల్లుకోసం చాలామంది ఎదురుచూస్తున్నారు.కొన్నిసార్లు ఎదురు చూసిన వారికి నిరాశ,కొందరికి అనుకోని అదృష్టం,శుభాలు,అశుభాలు,కొన్నిసార్లు రెండు కలిసి.అతను పోస్ట్ తేవటమే కాదు..చదివిపెడతాడు..కొన్నిసార్లు లేఖకుడు కూడా. కొందరితో మేలమాడుతాడు.కొందర్ని ఆటపట్టిస్తాడు.ఆ వూరివాళ్ళతో హోలీ ఆడతాడు.
పాట అర్ధం దగ్గరదగ్గరగా
పోస్టు తిసుకొచ్చాడు
పోస్ట్ మాన్ పోస్టు తెచ్చాడు
ఒకసారి శుభవార్త ..ఒక్కోసారి దుర్వార్తలు
రాబోయే పున్నమినాడు
బావమరిది మేనల్లుడి మరదలు నిశ్చితార్ధం
మామ నిన్ను తీసుకెళ్ళటానికి రాలేకపోతున్నాడు
పిల్లలతో నువ్వు తప్పనిసరిగా రావాలి..
తాతయ్య ..అరెరె..తాతయ్య కాలధర్మం చెందారు..తాతమ్మ కి బాగోలేదు
అమ్మ గారి నాన్న కు సోమవారం తర్పణాలు
చిన్నవారికి ఆశీస్సులు,పెద్దలకు నమస్కారాలు
నా అసహాయత గమనించు..ఇది టెలిగ్రాము గా భావించు.
ఓ సోమనాథ్….నీ పెళ్ళికబురు తెచ్చాను
ఓ పోస్ట్ మాన్ అబ్బీ...
ఏమిటి?
ఆరునెలలయ్యింది అతను ఉత్తరం రాసి..
ఉత్తరం అతను రాయలేదా? ...చెప్పు ఏమి రాయను?
త్వరగా వచ్చేటట్టు రాయి.
విరహంతో రాత్రులు గడిపేదెట్లా?
వర్షం తడి తడి మాటలు చెబుతుంది
చినుకులు నిప్పుల్లా దహిస్తున్నాయి
నౌకరీ వదులుకుని తిరిగి వచ్చేయవా..
రావా ప్రియతమా...వైశాఖం వస్తుంది
ఓ మునియా!
హోలీ ఆడేవారూ...
ఈ కవరులో ఇంటినుండి రంగులుపంపారు
ప్రియుడు గులాల్ పంపాడు
కొందరికి పండగ రోజు
కొందరికి చెడ్డరోజు
నిమ్మోకు కడుపు పండింది
ఖైరూకు పళ్ళెం నిండింది
-ముళ్ళపూడి సుబ్బారావు

No comments:
Post a Comment