'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-49’
“రామయ్యా వస్తావయ్యా”
(శ్రీ 420 లో రఫీ,లతా మంగేష్కర్,ముఖేశ్ పాడిన పాట)
...

చార్లీచాప్లిన్ తరహా నటన తో, నెహ్రూ ఆలోచనలను గుర్తుచేసే కథనంతో రాజ్ కపూర్ తీసిన సినిమా’శ్రీ 420’. అంటే తెలుగులో ‘ఘరానా మోసకారి’ గా చెప్పుకోవచ్చేమో. వామ పక్ష మేధావి కె.ఎ.అబ్బాస్ రచన,సంభాషణల బలానికి ,రాజ్ కపూర్ ఆకర్షణీయమైన, సౌందర్యమయమైన చిత్రీకరణ తోడయ్యాయి.
కొన్ని విలువలు,చదువు ఉన్నసాధారణ నిరుద్యోగ యువకుడు అలహాబాద్ నుండి బొంబాయి కి తన ఆస్తి భుజాన వేసుకుని అదృష్టాని వెతుక్కుంటూ బయలుదేరాడు.చదువుకున్నవాడూ, నిజాయితీపరుడూ,కష్టపడిచేసేవాడూ ఐతే ఆ వ్యక్తికు బొంబాయి లో ఉద్యోగం దొరకదని కథ్హనాయకుడికి తొలిరోజే ఓ బిచ్చగాడు తెలియజెప్పాడు. జీవన ప్రవాహంలో ఎక్కడెక్కడ మునిగాడు ఎక్కడ తేలాడు, ఏవి పొందటంలో ఏవి ఫొగొట్టుకున్నాడు..అదే సినిమా కథ.
సినిమాలో అనేకం పోటీ పడతాయి.నైతికత-అనైతికత, నిజాయితీ-కపటత్వం, విద్య-మాయ,కలిమి-లేమి.. ఇలా.
కథానాయకుడు చాలా మందిని కలుసుకుని అనేక మజిలీలతోముందుకు సాగాడు.పైకొచ్చాననుకున్నాడు. ఎవరెవరిదగ్గర ఆసరా పొందాడో,వారంతా ఉన్నచోటే ఉన్నారు. అతను వారందరితో అనేక అనుభవాలు పొందాడు.నడిచొచ్చిన మార్గం తిరిగి చూసుకోవాల్సిన ఘడియ వచ్చింది. తనెక్కడుండాలో,తనకేది సరైన చోటో చివరకు తెలుసుకున్నాడు.ఆ తెలుసుకున్న క్రమంలో వచ్చే పాట 'రామయ్యా వస్తావయ్యా '.
ఈ పాట ప్రారంభంలో వినవచ్చే 'రమియ్యా వస్తావయ్య ' లా ధ్వనించే తెలుగు పదం తొలినాళ్ళలో దీనిపట్ల నా ఆకర్షణకు కారణం.బొంబాయి లో భవన నిర్మాణ కూలీలైన తెలుగు వాళ్ళ దగ్గర శైలేంద్ర ఈ పదం విని రాశాడంటారు.కొందరు శంకర్ జైకిషన్ ద్వయంలో తెలుగు వాడైన శంకర్ కారణంగా ఈ పదం కలిసిందంటారు.
తప్పిపోయిన గొర్రె, ప్రొడిగాల్ సన్ వంటి క్రైస్తవ గాథల్ని తలపింపజేసే సంఘటనతో పాట నడుస్తుంది.తను వదులుకు వెళ్ళింది వెతుక్కుంటూ రాజు (రాజ్ కపూర్) వెనక్కి వస్తున్నాడు. అతని పాత స్నేహితులు అతన్ని 'వస్తావయ్యా ' అని పిలుస్తున్నారు.
అంతకు ముందు అతన్ని అమ్మలా ఆదరించిన స్త్రీమూర్తి అతన్ని తిరిగి అక్కున జేర్చుకుంది.అక్కడ సాగే పాట తోపుడు బండి,జట్కా, సైకిల్ మీదా ప్రయాణిస్తూ అతనికి మనసిచ్చిఉన్న స్త్రీ దగ్గరకు చేరింది.ఆమే పదం కలిపింది.
పాట అర్ధం సుమారుగా
“రామయ్యా వస్తావయ్యా
నా మనసు నీకు ఇచ్చేసా
ప్రేమకాంతి నీ కళ్ళలో ఉండేది.
నీ కళ్ళలో ఇలాంటి లౌక్యం ఉందేది కాదు.
నువ్వు అప్పటి వాడవు కాదు, నీ మనసూ అప్పటిది కాదు
నీ మనసులో ఈ తీయని కత్తి అప్పుడు లేదు.
నేను దుఃఖ పడితినేమి
పశ్చాత్తాప పడితేనేమి
నా మనసు నీకు ఇచ్చేసా
నీ ఆ పరదేశంలో
వెండి బంగారాలకు మనసు అమ్ముడౌతుంది
ఈ పల్లెలో, బాధనీడలో
ప్రేమ పేరు వింటునే గుండె కొట్టుకుంటుంది.
చంద్రునితొ చుక్కలతో
ఈ రాత్రి పాటలతో గడవనీ
నా మనసు నీకు ఇచ్చేసా
జ్ఞాపకాలు వస్తూనే ఉన్నాయి, మనసు దుఃఖ పడుతూనే ఉంది
మనసును సముదాయించటం తెలియట్లేదు నాకు
నువ్వు రాక పోతేనేమి,మరచిపొతేనేమి
ప్రేమించి మరచిపోవటం తెలియట్లేదు నాకు
ఇక్కడికి దూరం నుంచి కూడా
నువ్వు అప్పుడప్పుడూ చెబుతూనె ఉన్నావు
నా మనసు నీకు ఇచ్చేసా
అవే దారులు, వారే ప్రయాణీకులు
ఒక తార మాత్రం ఎక్కడ దాక్కుందో తెలియట్లేదు
లోకం అదే, లోకులూ వారే
ఎవరికి మాత్రం ఏం తెలుసు ఎవరి ప్రపంచం ధ్వంసం అయ్యిందో?
నా కళ్ళలో జీవిస్తానని
నాతో చెప్పినవారెవరో
నా మనసు నీకు ఇచ్చేసా”
-ముళ్ళపూడి సుబ్బారావు

No comments:
Post a Comment