అప్పట్లో ‘ఓ జాబిలీ వెన్నెలా ఆకాశం ‘ పాట బాగా వినపడేది. ఆ పాటకి అధారమైన ‘ఓ సాథీ రే ‘ పాట ‘ముకద్దర్ కా సికందర్’ సినిమా లోనిది.
ఏలూరు ఫైర్ ఆఫీస్ సెంటర్లో ఒక రాజస్థానీ టీ స్టాల్ ఉండేది. పొట్టిగా, బలంగా, ఎర్రగా, పైకి తిప్పిన మీసాల్తో దుకాణదారు ఒక ఇత్తడి గిన్నెలో టీ కాస్తుండే వాడు. టీ కాసేటప్పుడు గిన్నె లో గరిట తిప్పుడుకు గిన్నె అరిగి టీ లో కలిసి పోతుందేమోననిపించేది.
ఆ టీ స్టాల్ లో హిందీ పాటలు వేసేవాడు. కాకతాళీయమో ఏమో మేమెప్పుడు వెళ్ళినా ముకద్దర్ కా సికందర్ లో పాటలే వస్తుండేవి.కిశోర్ ‘రోతే హుయే ఆతే హై సబ్’ అంటే లతా ‘ది తో హై దిల్’ అనేది. నేనున్నానంటూ మహేంద్ర కపూర్’ ప్యార్ జిందగీ హై’ అనేవాడు. ‘జిందగీ హై బే వఫాయి ‘అని రఫీ తత్వం చెప్పేవాడు.
ఎల్ పీ రికార్డ్ కవరు మీద బొమ్మలు పోస్టర్ల లానే ఉన్నాయి.వాటిని స్టాల్ లో గోడలకి అంటించాడు.వాటిలో ఐదు ముఖాలు. కోపంగాఉన్న అంజద్ ఖాన్, నృత్యంచేస్తూ రేఖ, ఏదో పోగొట్టుకున్నట్టు అమితాబ్. గాయపడి ఉన్న వినోద్ ఖన్నా, అతన్ని ఏడుస్తూ పట్టుకునిఉన్న రాఖీ.
ఒక రోజు ఉదయం చూసేసరికి వేదరాజ్ ధియేటర్ పోస్టరు మారింది. ఇదే సినిమా.సినిమా ఒక విషాద భరిత ప్రేమకథ. ఒకరినొకరు ప్రేమించుకున్నది వినోద్ ఖన్నా,రాఖీ జంటఒకటే.. రాఖీని చిన్నప్పట్నించి అమితాబ్ మూగగా ప్రేమిస్తున్నాడు.రేఖ అమితాబ్ నిప్రేమిస్తుంది,రేఖను అంజాద్ ఖాన్ ప్రేమిస్తున్నాడు. చివరికి చివరి ముగ్గురూ చనిపోతారు.
సున్నితమైన అంశాలున్న సినిమా కమ ర్షియల్ గా పెద్ద సక్సెస్.అన్ని పాటలూ జనరంజకమే.
బాగా ఆకట్టుకున్న పాట..’ సలాం-ఎ- ఇష్క్ మెరీ జాన్’.
రేఖ కోఠీ కి అమితాబ్ స్నేహితుడి బలవంతం మీద వచ్చాడు. ఆమె నృత్యానికి పరవశించాడు. పాట మధ్య లో ఆమె నృత్యాన్ని, పాటనుప్రసంశించాడు. ఆమె అతని పాటకు దాసోహం అయ్యింది.ప్రేమలో పడింది.

పాట, నటుల అబినయం, పాటతో నడిచే కథా.... గొప్ప చిత్రీకరణ..
‘ఏక్ బాదల్ ఉధర్ సే చలా ఝూం కె,
దేఖ్ తే దేఖ్ తే చాంద్ పర్చా గయా’
ఈ చరణం మధ్యలో క్షణం పాటు వచ్చే సంగీతం వింటే ఒక మేఘం మనని రాసుకుంటూ వెళ్ళి చంద్రుణ్ణి కమ్మేసినట్టే అనిపిస్తుంది .అమితాబ్ , రేఖ ను ‘'ప్రేమలో గాయపడిన వారికి నువ్వు ఓ దేవదూతవు' అంటూ పాడుతుంటే,గుండ్రం గా తిరిగే కెమేరా, రేఖ హావభావాలు,కళ్ళలో కనిపించే తన్మయత్వం.... ఇవన్నీ పాటని మరపురానిది గాచేశాయి.

'ముళ్ళపూడి సుబ్బారావు
No comments:
Post a Comment