'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-27
“పియా ఐసో జియా మే సమాయె గయో రే”
“నన్ను నేను మరచిపోయేలా ,ప్రియుడు మనసులోకి వచ్చి కూర్చున్నాడు”.
( హేమంత్ కుమార సంగీతం,షకీల్ బదాయుని రచన,గీతాదత్ గానం)...
ఒక పెద్ద హవేలీ కూలిపోతున్న దృశ్యంతో మొదలౌతుంది ‘సాహిబ్ బీబీ ఔర్ గులాం’ సినిమా.ఆ భవనం కళకళలాడున్నకాలంనాటికి కథ వెనక్కి వెళుతుంది.ఆ భవనపు యజమానులకు కర్మాగారాలున్నాయి.బ్రహ్మసమాజ మద్దతుదారులు.బ్రిటిష్ వారిపట్ల వ్యతిరేకతౌంది. ఇంటి చిన్న యజమానికి పెళ్ళైంది. చిన్నకోడలుగా పిలవబడే అతని భార్య అతని రాకకోసం చూస్తూ అలంకరించుకుంటుంది.
ఆ సందర్భంలో ఈ పాట వస్తుంది. లిటరేచర్ లోనూ,సినిమాల్లోనూ ఫోర్ షాడోయింగ్ ని వాడుతారు.తరువాత జరగబోయే దానిగురించి హింటు చేసినట్టుగా.తెరపై జరిగేదానిపట్ల అలోచన,అంచనాలకు భిన్నమైనది జరుగుతుందేమోనని అనుమానంకలిగేట్టు ఇది ఉంటుంది.ఈ పాట చిత్రీకరణ,అర్ధం దానికి దోహదంచేస్తుంది.
‘నన్ను నేను మరచిపోయేలా
ప్రియుడు మనసులోకి వచ్చి కూర్చున్నాడు.
ప్రతి అలికిడికీ తను వచ్చారేమోనని అనుకొంటున్నా
త్వరత్వరగా ముసుగులో ముఖం దాచుకుంటున్నా

నా వాకిలిలో తూరుపు గాలివీచినపుడు
నా గుమ్మపు తలుపులు తెరుచుకున్నాయి
ప్రియుడు వచ్చాడని అనుకున్నాను
త్వరత్వరగా పోయి పూలుపానుపు మీద కూర్చున్నా
పాపిటలో నేను కుంకుమ నింపాను
ప్రియుని కోసం నేను అలంకరించుకున్నాను
దిష్టి తగులుతుందని భయంతో
త్వరత్వరగా కళ్ళకు కాటుక పెట్టుకున్నాను.”
మీనాకుమారి అత్యుత్తమన నటన ప్రదర్శించిన సినిమాగా దీనిని చెబుతారు.తక్కువకాలంలోనే అనేకదశలు అనుభవించిన స్త్రీగా ఆమెపాత్ర సినిమాకు ఇరుసు లా ఉంటుంది. తొలిదశలో ఆశలు నిండిన నవవధువుగా ఉన్నప్పుడు ఆమె మానసిక స్థితి వర్ణితమయ్యే పాట. ఆమె నటనతో పాటు ,హవేలీ వాతావరణం, పరిచారికలు,వారి వస్త్రధారణ, వారుచేసే సేవలు,ఆసేవల్ని ఒక హక్కుగా పొందటం ...ఒకనాటి వ్యవస్థలొ ఒక భాగాన్ని ఖండించి చూపుతున్నట్టుంతుంది.
గురుదత్ నిర్మాతగా వచ్చిన సినిమా 'సాహిబ్ బీబీ ఔర్ గులాం'. దర్శకుడుగా రచయిత అబ్రార్ అల్వి పేరు కనిపించినా గురుదత్ గురుతులు చిత్రమంతటా కనిపిస్తాయి.చిత్రం మొదట్లో చూపిన కూలిపోతున్న భవనం కూలుతున్న ఒక జీవనవిధానం,ఒక వ్యవస్థకు ప్రతీక.చిన్న యజమాని(చోటా సర్కార్) అలవాట్లు,విలువల లేమి,చిన్నకోడలు భగ్నమైన ఆశలు,ఆమె మత్తుతో మనసును జోకొట్టే ప్రయత్నం, ప్రస్తుతానికి అలౌకిక ప్రేమలా కనిపించే సంబంధాలు....ఇవన్ని కుటుంబంలో జరిగే విధ్వంసాలు. అలాగే వ్యవస్థల్లోనూ,రాజకీయంగానూ ఇంటిబైట వచ్చే మార్పులు. వీటన్నింటినీ ఇమిడ్చిన సినిమా ఇది.
గురుదత్ ను పెళ్ళిచేసుకుని గీతాదత్ గా మారిని గీతారాయ్ ఈ పాట్ అ పాడింది.చిన్నవయసులోనే చిత్రరంగానికి వచ్చింది.40 యేళ్ల వయసుకే ఆమె కెరీరు ముగిసిపోయింది. ఆమె స్వరంగురించి విన్న ఒక పోలిక 'తేనె అంతటి తీయదనం ఉంటుంది. తేనెటీగ కుడితే కలిగేటి బాధ కూడా అందులోఉంటుంది'..
-ముళ్ళపూడి సుబ్బారావు

No comments:
Post a Comment